అదొక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో రెండు తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండో తొర్రలో చిట్టెలుక వుంటున్నాయి. అడవిలో తిరిగి, పళ్ళు కాయలూ ఏరుకొచ్చి పావురము, ఎలుక కలసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి రెండూ మంచి స్నేహంగా వుంటూ ఒకదానిని విడిచి, మరొకటి వుండేవికావు. పావురము, ఎలుక కలసివుండటం ఓ తోడేలు కనిపెట్టింది. పళ్ళూ, కాయలు తిని బాగా బలసి వున్న వాటిని తినాలని ఆశ పడింది. వాటిని పట్టుకొనే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని వున్నది.
ఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మగ్గిన పళ్ళు వేలాడుతూ వుండడం ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడినది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో వున్న యేరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరి వెళ్ళగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకు పోతానని ఎలుక భయపడింది. [ఇంకా... ]