తులసి మొక్కను భూలోక కల్పవృక్షం అంటారు. ఏ చెట్టుకూ లేని పూజ్యత, భారతీయులు ఈ తులసి మొక్కకు ఇచ్చారు. ప్రతి ఇంట్లో తులసి బృందావనాలుంటాయి. దేవతను పూజించినట్లుగా, తులసి మాతను పూజిస్తుంటారు. దీనికి కారణం తులసి మొక్కలో నున్న విశిష్ట ఔషధ గుణాలే. తులసి ఆకురసం - అల్సర్, గుండెపోటు, రక్తపుపోటు, ఆస్త్మా వంటి దీర్ఘ రోగాలను సైతం నిశ్శేషంగా ఫోగొట్టకలదు. తులసి పొడితో చేసిన టీ కూడా చాలా ఆరోగ్యకరమైనది.
తులసి ఉపయోగాలు:
ఔషధ గుణాల గురించి, కింగ్ జార్జి మెడికల్ కాలేజీ డాక్టర్లు పరిశోధనలు జరిపి పై విషయాలు తెలియజేశారు. తులసి ఆకును నమిలి తిన్నా, టీ కాచుకు తాగినా అన్ని రకాల ఒత్తిళ్ళ నుంచి శరీరాన్ని దూరంగా ఉంచి భద్రంగా కాపాడుతుందని వారు కనుగొన్నారు. కాబట్టి మామూలు టీ, కాఫీలు త్రాగేకన్నా, తులసి టీని త్రాగటం మంచిది కదా! [ఇంకా... ]