ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను క్రమబద్దమైన రీతిలో నల్లని బట్టలు ధరింపజేసి, విలక్షణమైన రీతిలో కఠోరమైన దీక్షలు చేయించి, "స్వామియే శరణం అయ్యప్ప" అని శరణం చెప్పించుకుంటూ! భక్తులను కఠినశిలలపై బాధ తెలియని అఖిలాండ కోటి భక్తజనావళికి సదా ఆశీస్సులు అందించే ఆ అయ్యప్పస్వామి వారి జన్మ వృత్తాంతగాధ ఏమిటి? వారిని దర్శించుకోవటమెలా? అనే కుతూహలం మీకు ఉన్నదా?అసలు ఆ స్వామి చిన్ముద్రతో పట్టబంధాసనం లో తపస్సులో ఆసీనులైన తీరే! ముందు మనకు కలిగే మొదటి సందేహమవుతుంది.
మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. [ఇంకా... ]