Wednesday, January 21

ఆహార పోషణ సూచిక - తిండి కాదు... బరువు తగ్గాలి

టీనేజ్ నుంచి మధ్య వయస్కుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు అందరూ నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు . అందుకు డైటింగ్, యోగా, వ్యాయామం... ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఎంత వ్యవధిలో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో షెడ్యుల్ తయారుచేసుకోనే ముందు వయసు, శరీరాకృతి, ఆరోగ్య పరిస్థితి... ఇలా ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే బరువు తగ్గే మాట అటుంచి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి.

ఒకేసారి డైటింగ్ చేసి అంటే పూర్తిగా బోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటారు చాలా మంది, ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపు కోల్పోతుంది. వ్యార్ధకపు చయలు కనిపిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో క్యాల్షియం , ఇనుము, విటమిన్ - ఎ,ఇ,సి,బి కాంప్లెక్స్‌లు వంటి సూక్ష్మపోషకాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి . [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - జ్వరమొస్తే వణుకెందుకు

జ్వరం వచ్చిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కదా. కానీ అతడు చలితో వణికి పోతూ దుప్పటి కప్పుకుంటాడెందుకు మీకు తెలుసా? దీనికంతటికి కారణం ఏమిటో మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తికి చలి వేస్తుందా, ఉక్కపోస్తుందా అనే విషయం ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఆ అధిక వేడిని నివృత్తి చేసుకోవడానికి చెమట పట్టి శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అప్పుడే మనకు ఉక్కపోత అనే భావన కలుగుతుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఏకపాత్రాభినయం ఆట

ఎంతమంది : 10 మంది.

ఆడే స్థలం : గదిలో గాని, ఆరు బయట గాని.

ఆటగాళ్ళవయస్సు : 7 నుండి 10 సంవత్సరాలలోపు.

పోటీ సమయం : ఒక్కొక్కరికి 5 నిమిషాలు.

ఆటగాళ్ళు కూర్చున్నాక లీడర్ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో రకం ఏకపాత్రాభినయాన్ని చెయ్యమని చెప్పాలి. అంటే ఒకరిని డ్రిల్లు మాస్టారిలా, మరొకరిని క్రికెట్ కామెంటేటర్ లా, మరొకరిని ఇస్త్రీ చేసేవాడిలా, పోస్ట్‌మేన్‌లా, ఆటోడ్రయివర్ లా, స్కూల్ టీచర్ లా, చేపలు పట్టేవాడిలా, బస్ కండక్టర్ లా ఇలా అభినయించాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా

మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా ...నీవు
పోకడెక్కడ పోయినావె సై కోడలా

కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో ...నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో

మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా ...నీవు
చిల్లర పని చేసినావే సై కోడలా

కోడలు : చిల్లరపని చెయ్యలేదు మామయ్యలో ...నీ
చిన్ని ముద్దు కొడుకు తోడు మామయ్యలో [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీకృష్ణాయ నమః
2. ఓం కమలానాథాయ నమః
3. ఓం వాసుదేవాయ నమః
4. ఓం సనాతనాయ నమః
5. ఓం వసుదేవాత్మజాయ నమః
6. ఓం పుణ్యాయ నమః
7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
9. ఓం యశోదావత్సలాయ నమః
10. ఓం హరయే నమః [ఇంకా... ]

Monday, January 19

మీకు తెలుసా - భారతదేశం భాషలు

రాష్ట్రము - భాషలు

1. అరుణాచల్‌ప్రదేశ్‌‌ - మొంపా, అకా, మిజీ, నిషి,షెర్దుక్‌పెన్, అపటాని, హిల్‌మిరి, టాగిన్, ఆది, ఇదు, డిగర్, కాంప్టి, టంగ్షెనోక్టె, వాంచో, సింగ్‌పో.
2. అస్సాం - అస్సామీస్.
3. ఆంధ్రప్రదేశ్‌ - తెలుగు, ఉర్దూ.
4. ఉత్తరప్రదేశ్‌‌ - హిందీ, ఉర్దూ.
5. ఒరిస్సా - ఒరియా, సంతాలీ.
6. కర్ణాటక - కన్నడం.
7. కేరళ - మళయాళం.
8. గుజరాత్ - గుజరాతీ.
9. గోవా - కొంకణి, పోర్చుగీస్, ఇంగ్లీషు.
10. జమ్మూ & కాశ్మీర్ - ఉర్దూ, కాశ్మీర్,డోగ్రీ, లడకీ మొ||. [ఇంకా... ]

వ్యాయామ శిక్షణ - వంచితేనే నడుము

నేటి తరానికి నడుము నొప్పి ఓ తీవ్రమైన వేదన. ఇలాంటి సమస్యలన్నింటికీ చాలా వరకూ మన జీవన శైలినే కారణంగా చెప్పుకోవాలి. గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పనిచేసే వారికీ, మహిళలకూ ఈ సమస్య అధికం. యోగాసనాల ద్వారా నడుము నొప్పి బాధల నుంచి చక్కటి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఉపకరించే కొన్ని ప్రాథమికమైన యోగాసనాలు చూద్దాం.

1. భుజంగాసనం:

ప్రారంభ స్థితి - బోర్లా పడుకొని. ముఖాన్ని నేలకు ఆనించాలి. రెండు కాళ్ళనూ దగ్గరగా ఉంచాలి. కాలి మడమలు పైకి ఉండాలి. అరచేతుల్ని భుజాలకు ఇరువైపులా నేలకు ఆనించాలి.

ఎలా చేయాలి - శ్వాస నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ తల పైకెత్తుతూ వెన్నెముకను వీలైనంత వెనక్కి వంచి. అదే స్థితిలో కొంత సేపుండాలి. పొత్తి కడుపు ప్రాంతాన్ని నేలకు ఆనించి ఉంచి, వీలైనంత సేపు శ్వాస బిగపట్టాలి. శ్వాసను నిలపటం ముఖ్యం. [ఇంకా... ]

పిల్లల పాటలు - భారతీయ వీరులం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం

శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం

మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - అల్లూరి సీతారామ రాజు

పేరు : అల్లూరి సీతారామరాజు.
తండ్రి పేరు : శ్రీ వెంకట రామరాజు.
తల్లి పేరు : శ్రీమతి సూర్యనారాయణమ్మ.
పుట్టిన తేది : 4-7-1897.
పుట్టిన ప్రదేశం : కృష్ణా జిల్లాలోని భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ.
చదువు : నాల్గవ ఫారం.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు.
స్వర్గస్తుడైన తేది : 7-5-1924.
నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా, నాడు కృష్ణాజిల్లా లోనిది. భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు. తాత వెంకట కృష్ణం రాజు. సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర "పాండ్రంకి"లో స్థిరపడిపోయారు. [ఇంకా... ]

పండుగలు - భోగి - సంక్రాంతి - కనుమ

సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది.

సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు.

ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు. [ఇంకా... ]

Saturday, January 17

చిట్కాలు - వంటగదికి సంబంధించినవి

1. అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
2. అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
3. అల్లం తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం, పది రోజుల వరకూ తాజాగానే ఉంటుంది.
4. ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
5. ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - తులసి

తులసి మొక్కను భూలోక కల్పవృక్షం అంటారు. ఏ చెట్టుకూ లేని పూజ్యత, భారతీయులు ఈ తులసి మొక్కకు ఇచ్చారు. ప్రతి ఇంట్లో తులసి బృందావనాలుంటాయి. దేవతను పూజించినట్లుగా, తులసి మాతను పూజిస్తుంటారు. దీనికి కారణం తులసి మొక్కలో నున్న విశిష్ట ఔషధ గుణాలే. తులసి ఆకురసం - అల్సర్‌, గుండెపోటు, రక్తపుపోటు, ఆస్త్మా వంటి దీర్ఘ రోగాలను సైతం నిశ్శేషంగా ఫోగొట్టకలదు. తులసి పొడితో చేసిన టీ కూడా చాలా ఆరోగ్యకరమైనది.

తులసి ఉపయోగాలు:

ఔషధ గుణాల గురించి, కింగ్‌ జార్జి మెడికల్‌ కాలేజీ డాక్టర్లు పరిశోధనలు జరిపి పై విషయాలు తెలియజేశారు. తులసి ఆకును నమిలి తిన్నా, టీ కాచుకు తాగినా అన్ని రకాల ఒత్తిళ్ళ నుంచి శరీరాన్ని దూరంగా ఉంచి భద్రంగా కాపాడుతుందని వారు కనుగొన్నారు. కాబట్టి మామూలు టీ, కాఫీలు త్రాగేకన్నా, తులసి టీని త్రాగటం మంచిది కదా! [ఇంకా... ]

వంటలు - క్యాబేజి పకోడి

కావలసిన వస్తువులు:

క్యాబేజి - పావుకిలో.
శనగపిండి - పావుకిలో.
పచ్చిమిర్చి - 15.
కారం - అరచెంచా.
వరిపిండి - కొంచెం.
నూనె - 100గ్రా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :

మిర్చీ, క్యాబేజీ సన్నగా తరిగి సరిపడా ఉప్పు, కారాలు వరిపిండితో సహా శంగపిండిలో పోసి తడితడిగా, పొడిపొడిగా వుండేలా కలపాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - తెలుగు పదాల మాటలు

ఎంతమంది ఆడవచ్చు : నలుగురు.
ఆడే స్థలం : ఆరుబయటగాని, ఇంట్లోగాని.

ప్రతి ఒక్కరు ఒక పది లైన్ల మాటలు మాట్లాడాలి. అయితే నిబంధన ఏమిటంటే ఈ 10 లైన్లలో అన్నీ తెలుగు పదాలే ఉండాలి. ఒక్క ఇంగ్లీషు పదం గాని అక్షరంగాని ఉండకూడదు.

ఉదా : నేను 'కారు' కొన్నాను అనకూడదు. కారు అన్నది ఇక్కడ ఇంగ్లీషు పదం. కారుని యంత్ర శకటం అనాలి.

ఇలా అందరిలో ఎవరు ఎక్కువ ఇంగ్లీషు పదాలు లేకుండా కేవలం తెలుగునే ఉపయోగించి మాట్లాడతారో వారు విజేతలు. [ఇంకా... ]

కథలు - అనంతం

'చంకలోనిబిడ్డ నీ బిడ్డేనా! మడత నోటితో మాట్లాడావంటే మూతిని కుట్టిపడేస్తాను!!'

'................'

నిడదవోలు జంక్షన్ వదిలిన సర్కార్ఎక్స్‌ప్రెస్ గుడివాడ జంక్షన్‌కి చేరాలంటే నాలుగున్నర గంటలు పడుతుంది. మధ్యలో భీమవరం జంక్షన్ కూడ వదిలిపోయింది.

అయినా ఆ జగడం అలాగే సాగుతోంది. విషయం చివరగా ఉన్న లేడీస్ కంపార్టుమెంట్‌లో వాళ్ళకి ఎలాతెల్సిందో! అత్తిలి స్టేషన్‌లో సర్కారు ఆగేసరికి కొందరు ఆడంగులు అక్కడినుండి ఈ బోగీలోకి మారిపోయారు.

'అనుమానం లేదు! అయినా ఇటువంటివాళ్ళని ఊరికే వదిలితే...' కోపంతో ఊగిపోతోంది ఆ ఊబకాయ శరీరం ఆంటీ.

'ఇందాకణ్ణుంచి ఆ దొంగచూపులు చూడండి. నాకూచాలా అనుమానంగా ఉంది.' [ఇంకా... ]

Thursday, January 15

భరతమాత బిడ్డలు - సరోజినీ నాయుడు

పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్‌.
చదివిన ప్రదేశం : ఇటలీ, స్విట్జర్లాండ్.
చదువు : మెట్రిక్యులేషన్.
గొప్పదనం : ఈమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమేగాక, స్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ కృషి చేశారు.
స్వర్గస్తురాలైన తేది : 2-3-1949.
రచించిన రచనలు : 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్'.

"హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. [ఇంకా... ]

మీకు తెలుసా - బ్రాస్ లెట్ తయారు చేయడం

ఒక ఆభరణం గురించి చెప్పుకుందాం. అదేంటంటే... బ్రాస్‌లెట్. ఏం కావాలంటే... ఒకే రంగు పూసలు (కొన్ని పెద్దవి, మరికొన్ని చిన్నవి), సన్నగా వుండే ప్లాస్టిక్ వైర్, స్క్రూ ఫాస్ట్‌నర్ (ఇవి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. లేదంటే పాత గొలుసులకు వున్నవైనా వాడుకోవచ్చు.)

ఎలా చేయాలంటే... ముందుగా ప్లాస్టిక్ వైర్‌ని కొంచెం పొడవుగా కత్తిరించండి. దీన్ని రెండు పేటలుగా చేయండి. ఒకవైపు ఓ స్క్రూ వేలాడదీయండి. తర్వాత ఒక పెద్ద పూసను ఎక్కించండి. తర్వాత రెండు పేటలకు వేరేరుగా చిన్న పూసలు ఎక్కించండి. మళ్లీ రెండు వైర్లను కలుపుతూ ఒక పెద్ద పూస ఎక్కించండి. ఇలా మీకు కావాల్సినంత పొడవు పూసలు గుచ్చండి. [ఇంకా... ]

భక్తి గీతాలు - భక్తికొలది వాడే

భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు

పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు

పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు

పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు [ఇంకా... ]

వంటలు - కోవా కజ్జికాయ

కావలసిన వస్తువులు:

పాలు - 1 లీటరు.
పచ్చికొబ్బరి (తురుము) - 1.
యాలకుల పొడి - 1 టీ స్పూను.
పంచదార - 100 గ్రా.
బెల్లం - 100 గ్రా.
నెయ్యి - 50 గ్రా.

తయారు చేసే విధానం:

గిన్నెలో పాలు బాగా మరిగించి పంచదార వేసి కలుపుతూ సన్నని సెగపై పాలు చిక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిస్తూ కోవా తయారు చేసి పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో బెల్లం, సరిపడినన్ని నీళ్ళతో తీగపాకం పట్టి పచ్చికొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. [ఇంకా... ]

నీతి కథలు - తెలివి లేని స్నేహం

అదొక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో రెండు తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండో తొర్రలో చిట్టెలుక వుంటున్నాయి. అడవిలో తిరిగి, పళ్ళు కాయలూ ఏరుకొచ్చి పావురము, ఎలుక కలసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి రెండూ మంచి స్నేహంగా వుంటూ ఒకదానిని విడిచి, మరొకటి వుండేవికావు. పావురము, ఎలుక కలసివుండటం ఓ తోడేలు కనిపెట్టింది. పళ్ళూ, కాయలు తిని బాగా బలసి వున్న వాటిని తినాలని ఆశ పడింది. వాటిని పట్టుకొనే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని వున్నది.

ఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మగ్గిన పళ్ళు వేలాడుతూ వుండడం ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడినది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో వున్న యేరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరి వెళ్ళగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకు పోతానని ఎలుక భయపడింది. [ఇంకా... ]

Friday, January 9

వ్యక్తిత్వ వికాసం - సోక్రటీస్

గ్రీస్‌లొ నగర రాజ్యమైన ఏథెన్స్ పౌరుడైన సోక్రటీస్ 470 బి.సి.లో జన్మించాడు. కొంతకాలం తన తండ్రి వృత్తిని చేపట్టాడు. కాని ఇతర ఆశలు అతనికి ఉన్నందువల్ల సైన్యంలో చేరాడు. ఏథెన్స్‌కు తిరిగివచ్చిన తర్వాత తన కాలాన్ని మానవ జీవిత ప్రవర్తనపై అధ్యయానికి వినియోగించి ప్రజా సమస్యలను గురించి ప్రజలకు హెచ్చరిక చేసేవాడు. 406 బి.సి.లో 500 మందితో కూడిన సెనేట్‌లో సభ్యుడయ్యాడు. ఇతర గౌరవాలు కూడా పొందాడు. తన ప్రజాహిత కార్యాలకు తోడు ఒకటి తరువాత ఒకటిగా తన బోధనా వృత్తిని కొనసాగించేవడు. సోఫిస్ట్స్ అని పిలువబడే పాఠశాల ఉపాధ్యాయుల వేదాంత చర్చలను - అతని కాలంనాటి - ఏథెన్స్ వాసులు ఆదరించేవారు. సోఫిస్టులు ధనవంతుల వద్ద డబ్బు తీసుకొని వారి పిల్లలకు - వాదన, ఉపన్యాస విధానం నేర్పేవారు. పాపాన్ని (చెడు) మంచిదాన్నిగా, మంచిదాన్ని పాపంగా రూపొందించేవారు. హృదయపూర్వకంగా, నేర్పుకల వారుగా ఉండేవారు. సన్మార్గం (నీతి)పై మనుషుల విశ్వాసాన్ని బలహీనపర్చే విధంగా వారి బోధనల ప్రభావం ఉండేది. అందరి చేత గౌరవించబడే ఒకే సత్యం, నీతి అనేవి లేవని సోఫిస్టులు చెప్పేవారు. ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుంది. [ఇంకా... ]

గృహాలంకరణ - ఇంధ్రధనస్సు లాంటి ఇంటికోసం

పూర్వం ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వేరే రంగుతో కలిసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఏ రంగు ఎలా ఉంటుందో ఆ వివరాలే ఇవి...

* పసుపు, ఎరుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్నిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా తీసుకుంటే మరీ గాడిగా కనిపిస్తాయి.

* పోస్టల్ రంగులైన పౌడర్ పింక్, బేబి బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. [ఇంకా... ]

నీతి కథలు - ప్రతిభే పెట్టుబడి

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.

ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్టి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. [ఇంకా... ]

జానపద గీతాలు - వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

వేళజూడ వెన్నెలాయె వెండిలట్ల కిన్నెరాయె

మల్లెపూల పందిరాయె వయ్యారి రావె

నవ్వులోనె తెల్లవారును

కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ

దొండపండులాంటి పెదిమె వయ్యారి రావె

మనసు ఇవరిపాలుజేతును [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - తిరుపతి, తిరుమల

ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తిరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం.

క్షేత్ర వైభవం
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర. [ఇంకా... ]

Thursday, January 8

వంటలు - వెల్లుల్లిపాయ కారప్పొడి

కావలసిన వస్తువులు:
వెల్లుల్లిపాయలు - 4.
చింతపండు - 150 గ్రా.
నూనె - 100 గ్రా.
పసుపు - అర చెంచా.
మినపప్పు - 100 గ్రా.
శనగపప్పు - 100 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
ఎండుమిర్చి - 200 గ్రా.

తయారు చేసే విధానం :
వెల్లుల్లి పొట్టువలిచి రేకలు విడిగా ఉంచుకోవాలి. నూనెకాచి పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లిరేకలు వేయించి తీసుకుని ఉప్పు, పసుపు కలిపి మెత్తగా దంచాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - ఆరోగ్యం - ప్రాముఖ్యత

సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆర్ధిక ఉన్నతి అదృష్టం మీదనఒ, కష్టానికి తగిన ఫలితం మీదనో ఆధారపడి ఉండగా ఆరోగ్యం మాత్రం వారి వారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ మహద్భాగ్యాన్ని పొందడం కోసం అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు యోగాను ఆశ్రయిస్తే, మరికొందరు ఇతర వ్యాయామాలను, మరికొందరు ప్రాణాయామాన్ని, ఆరోగ్య నియంత్రణ సూత్రాలను పాటిస్తుంటారు. జాతిపిత మహాత్మా గాంధి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో విలువైనవి బంగారు, వెండి ఆభరణాలు కాదు, అరోగ్యం మాత్రమే అన్నారు. ఈ మాటని అంగీకరించకుండా ఉండడం అసాధ్యం. అయితే నేడు ఎంతమంది ఈ సత్యానికి దగ్గరగా ఉంటున్నారు? ఎందరు ఆరోగ్యంపట్ల నిజమైన శ్రద్ధ కనబరుస్తున్నారు? అని అలోచిస్తే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించదు. స్పీడు యుగంలో ఆహారాన్ని కూడా అంతే స్పీడుగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా భావిస్తూ ఎందరో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కుంటుళ్ళు

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు నుంచి ఎంతమందైనా ఆడవచ్చు.
ఏ వయస్సువారు : 12 సంవత్సరాలలోపు వారు.

ముందుగా పంటలు వేసుకున్నాక అందరూ పండిపోగా మిగిలిన వారు దొంగవుతారు. దొంగయిన బాలుడు/ బాలిక కుంటుతూ గెంతుతుంటే మిగతా వారు అతన్ని ఆటపట్టిస్తూంటారు. అతని వెనుకగా వెళ్ళి వీపుని తట్టి వంకాయ్, టెంకాయ్, ములకాయ్, దోసకాయ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ నన్నంటుకో అంటుంటారు. దొంగైన వారు కుంటుతూనే వారిని అంటుకోవాలి. కాలు క్రింద పెట్టకూడదు. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - కంప్యూటర్  బల్ల

ఒకసారి మీ కంప్యూటర్‌ బల్లను గమనించండి. బల్ల చిన్నదే అయినా దాన్ని పుస్తకాలు, పెన్నులు, చిన్న చిన్న కాగితాలు, సీడీలు, చిల్లర, డైరీలు ఇలా బోలెడు ఆక్రమిస్తాయి. బల్లను అందంగా సర్దుకోవాలంటే కష్టమంటూ చాలామంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

మీ దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనులు, డెడ్‌లైన్స్, సంప్రదించాల్సిన వ్యక్తులు ఇలా ఎన్నో వివరాలను మనం డైరీలో రాసుకుంటాం. ఇక నుంచి ఓ డిస్‌‌ప్లే బోర్డు బల్లకు సమీపంలో తగిలించండి. అన్ని ముఖ్యమైన అంశాలను దానిపై రాసుకుంటే మరిచిపోరు. డైరీ అవసరం అంతగా ఉండదు కూడా..! అయితే అన్నీ ఒకేరంగు పెన్నుతో రాయాలని చూడకండి. నాలుగైదు రంగుల పెన్నులు ఉంటే బాగుంటుంది. [ఇంకా... ]

కథలు - మళ్ళీ వచ్చేశా

కెవ్వున అరిచినంత పనిచేసింది మధుర మీనాక్షి. పెళ్ళయిన తరువాత తన జీవితంలో పెళ్ళాం నోటి నుంచి వచ్చే ఆ అరుపులలోని తికమకల్ని ఎప్పుడూ పసికట్టలేకపోతూన్న మార్కండేయులు ఉలిక్కి పడ్డాడు.

మళ్ళీ ఏం కొంపలంటుకు పోయాయో అన్న భయంతో భార్య ఇచ్చిన కాఫీ కషాయాన్ని ప్రక్కన పడేసి గదిలోంచి చటుక్కున బయటకు వచ్చాడు.

ఆవిడ ఆనందమో! ఆవేశమో!! తెలియని అదో విధమైన భావంతో కేరింతలు కొడుతోంది.

"మధురా! ఏమిటి అమ్మాయి నుండి ఏదైనా ఉత్తరం వచ్చిందా!!" తడబడుతూ అన్నాడు మార్కండేయులు

చెక్క బండి దిగి ఇవ్వడానికి జేబులోంచి చిల్లర డబ్బులు తీసి లెక్కపెడుతున్న జిగురు మూర్తి కంటపడ్డాడు.

పై ప్రాణంపైనే ఎగిరిపోయినట్లు అయింది మార్కండేయులుకి. [ఇంకా... ]

Monday, January 5

ఎందుకు, ఏమిటి, ఎలా ... - సీతాకోక చిలుక

రంగు రంగు రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదూ. అంతకు ముందు అది నల్లటి, పొడవైన వెంట్రుకలతో ఉన్న గొంగళిపురుగే అంటే అసలే నమ్మబుద్దికాదు. అదే మరి విచిత్రమంటే. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా ఎలా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం.

సీతాకోకచిలుకగా మారడానికి ముందు గొంగళిపురుగు ప్యూపా దశకు చేరుకుంటుంది. ఈ దశకు చేరుకోవడానికి గొంగళిపురుగు ఒక చెట్టు లేక మొక్కలోని అనువైన ఆకు కాండాన్ని ఎంచుకొని, తలను కిందికి తిప్పి, శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకుంటుంది. తల కింది భాగం నుంచి అతి సన్నని పట్టుదారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి, వాటితో చిన్న దిండును చేసుకుంటుంది. దాని ఆధారంగా గొంగళిపురుగు కాండానికి అతుక్కుపోతుంది. ఆపై అది తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ, తలను అటూ ఇటూ కదిలిస్తూ, ఆ దారాల్లాంటి పోగులతో తన దేహం చుట్టూ ఒక ఒడ్డాణాన్ని రూపొందించుకుంటుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ద్రాక్షాపండు తియ్యానా? పుల్లనా? నాకేం తెలుసు

ఎంతమందికావాలి : 10మంది.
ఆటగాళ్ళ వయస్సు : 7సంవత్సరాల వయస్సు పై ఉండాలి.
ఆడేస్థలం : ఆరుబయట.

ముందుగా ఇద్దరు బాలురు / బాలికలు తమ పేర్లు ఏదైనా పండ్ల పేరు పెట్టుకోవాలి.

ఉదా: ఒకరు ఆపిల్ పండు, ఇంకొకరు దానిమ్మ పండు అని పేరు పెట్టుకోవాలి. తర్వాత ఇద్దరూ చేతులు పైకెత్తి పట్టుకొని ఇంటి టాప్ లా చేసి నిలబడి ఈ ఇద్దరి చేతుల కింద నుంచి నడుస్తారు. ఆపిల్ పండు బాలుడు, దానిమ్మ పండు బాలుడు ఇద్దరూ ఇలా పాట పాడుతారు. "ద్రాక్షా తియ్యనా? పుల్లనా ? నాకేం తెలుసు! నీకేం తెలుసు!! ఇద్దరికి తెలియదు. అందుకు ఆఖరున వచ్చే పిల్లను పట్టుకొని అడుగుదాం" అని చివర వచ్చే వారిని పట్టుకోవాలి. అతన్ని పక్కకు తీసుకెళ్ళి దానిమ్మ కావాలా? ఆపిల్ కావాలా? రెండిటిలో ఏమికావాలి? అని అడగాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - అన్నం - ఔషధం

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్ర దేశంలో సాధారణంగా అందరూ తినే ప్రధాన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని గుణాన గురించి, పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేసే పద్దహ్తిలో, అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. దంపుడు బియ్యంతో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - సుభాష్ చంద్రబోస్

పేరు : సుభాష్ చంద్రబోస్.
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండు.
చదువు : ఐ.పి.ఎస్.
గొప్పదనం : మాతృ దేశం ను దాస్యపు శృంఖలాల నుండి విడిపించడానికి తన ప్రాణాలను సైతం అర్పించాడు.
స్ధాపించిన సంస్థలు : "ఆజాద్ హింద్".
స్వర్గస్తుడైన తేది : 18-8-1945.

కొంతమంది వీరుల పేరు వింటేనే ఆంగ్లేయుల వెన్నెముకలో చలి పుట్టేది. అటువంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతి ముఖ్యుడు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు. తండ్రి జానకీనాథ్ బోస్, పేరొందిన న్యాయవాది. తల్లి ప్రభావతిదేవి, కాళికాదేవి భక్తురాలు. కొడుకు జిల్లాకలెక్టర్ కావాలని కోరుకుంటూండేది. హిందూ మతం గురించి, భారతీయ సంస్కృతి గురించి అతనికి బోధిస్తూ ఉండేది. [ఇంకా... ]

నీతి కథలు - పరమానందయ్య శిష్యులు

పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.

"అమ్మో! వాగులో మునిగి పోతామేమో" అంటూ భయపడ్డారు. "మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం" అన్నాడు ఒకడు. "సరే" అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి "అందరం వాగుదాటామా?" అనే అనుమానం వచ్చింది. "ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను" అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.

"ఒకటి, రెండు, మూడు..... పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు" అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది. [ఇంకా... ]

Friday, January 2

భరతమాత బిడ్డలు - సుభాష్ చంద్రబోస్

పేరు : సుభాష్ చంద్రబోస్.
తండ్రి పేరు : జానకీనాథ్ బోస్.
తల్లి పేరు : శ్రీమతి ప్రభావతిదేవి.
పుట్టిన తేది : 23-1-1897.
పుట్టిన ప్రదేశం : ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండు.
చదువు : ఐ.పి.ఎస్.
గొప్పదనం : మాతృ దేశం ను దాస్యపు శృంఖలాల నుండి విడిపించడానికి తన ప్రాణాలను సైతం అర్పించాడు.
స్ధాపించిన సంస్థలు : "ఆజాద్ హింద్".
స్వర్గస్తుడైన తేది : 18-8-1945.

కొంతమంది వీరుల పేరు వింటేనే ఆంగ్లేయుల వెన్నెముకలో చలి పుట్టేది. అటువంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతి ముఖ్యుడు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు. తండ్రి జానకీనాథ్ బోస్, పేరొందిన న్యాయవాది. తల్లి ప్రభావతిదేవి, కాళికాదేవి భక్తురాలు. కొడుకు జిల్లాకలెక్టర్ కావాలని కోరుకుంటూండేది. హిందూ మతం గురించి, భారతీయ సంస్కృతి గురించి అతనికి బోధిస్తూ ఉండేది. [ఇంకా... ]

మీకు తెలుసా - పావురాల పెంపకం

పిచ్చుకల మనిషికి అత్యంత చేరువలో ఉండే పక్షి పావురం. దేవాలయాల సిఖరాల పైన దర్పంగా నివశించే ఈ పక్షులంటే అందరికీ ఇష్టమే. అనేకమంది ఇళ్ళలో వీటిని హాబీగా పెంచుతుంటారు. ఇంటికి కొత్త శోభనిచ్చే ఈ పావురాలంటే చిన్నా పెద్దా అందరూ ప్రేమ చూపుతారు. వాటికి ప్రత్యేకమైన గూళ్ళను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా ఇస్తుంటారు. అత్యంత ప్రాచీనమైన విలాసాలలో పావురాలను పెంచడం ఒకటి. అతి సులువుగా మచ్చికవ్వడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళినా తిరిగి బయల్దేరిన గమ్యానికి చేరే గుణంగల పక్షి కావడంతో అనేకమంది వీటిని ప్రత్యేకంగా పెంచేవారు. వీటిని విలాసాలకోసమే కాకుండా వీటి ద్వారా లాభాలను కూడా పొందేవారు.

పూర్వం యుద్ధాలలోనూ, శాంతి సమయాల్లోనూ రహస్య సందేశాలను పంపుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. 776 బి.సి. మరియు 393 ఏ.డి.ల మధ్య ఒలంపిక్ ఆటల్లో వీటిని ఉపయోగించుకున్నారు. మొగలాయిలు పావురాలను పెంచడమేకాక వాటిపై పందేలు కట్టడానికి వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఔద్ నవాబు వజాద్ ఆలీ షా తన విలాసం కోసం 25,000 పావురాలను పెంచేవాడు. [ఇంకా... ]

వ్రతములు - గ్రామ కుంకుమ వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణునకు ప్రాణగండ ముండెను. అతని భార్య గ్రామ కుంకుమనోము నోచి, యధావిధిగ పండ్లు, పసుపు, కుంకుమలు పట్టుకొని వీధివీధుల పంచిపెట్టసాగెను. ఆమె మొదటవీధీలో పంచి పెట్టునంతలో పెద్దకొడుకువచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా నామె ఇంకొక వీధి యున్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలో పంచి పెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగము ముదిరి పోయినదని చెప్పెను. ఆమె యింకొక వీధి యున్నదని చేప్పి, మూడవవీధిలో పంచిపెట్టుచుండగా మూడవకుమారుడు వచ్చి తండ్రికి ప్రాణము మీదికి వచ్చెనని చెప్పెను. అప్పుడామె యింకొక వీధిమాత్ర మున్నదని నాల్గవవీధిలో పంచిపెట్టుచుండగా నాల్గవకొడుకువచ్చి తండ్రిని క్రిందబెట్టినట్లు చెప్పెను. ఆమె ఇంకొక వీధిమాత్రమున్నదని చెప్పి అయిదవవీధిలో పంచిపెట్టుచుండగా ఐదవకొడుకువచ్చి చనిపోయినట్లు చెప్పెను. కాని ఆమె ఆవీధికంతకు పంచిపెట్టువరకు ఇంటికి వెళ్ళలేదు. [ఇంకా... ]

వంటలు - కారప్పూస

కావలసిన వస్తువులు:

శనగ పిండి : 4 గ్లాసులు.
వాము : 2 టీ స్పూన్లు.
నూనె : 1/2 కిలో.
బియ్యం పిండి : 1 గ్లాసు.
నెయ్యి : 4 టీ స్పూన్లు.
ఉప్పు, కారం : సరిపడినంత.

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో శనగ పిండిని, బియ్యం పిండిని జల్లించి, వాము కూడా దంచి జల్లించి వేసి ఉప్పు, కారం, నెయ్యి వేసి కొంచెం నీళ్ళు పోసి గట్టిగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత జంతికల గొట్టంలో లేక చక్రాల గిద్దలో సన్నని చిల్లుల రేకు ఉంటుంది. [ఇంకా... ]

పండుగలు - అయ్యప్ప - మకరజ్యోతి

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను క్రమబద్దమైన రీతిలో నల్లని బట్టలు ధరింపజేసి, విలక్షణమైన రీతిలో కఠోరమైన దీక్షలు చేయించి, "స్వామియే శరణం అయ్యప్ప" అని శరణం చెప్పించుకుంటూ! భక్తులను కఠినశిలలపై బాధ తెలియని అఖిలాండ కోటి భక్తజనావళికి సదా ఆశీస్సులు అందించే ఆ అయ్యప్పస్వామి వారి జన్మ వృత్తాంతగాధ ఏమిటి? వారిని దర్శించుకోవటమెలా? అనే కుతూహలం మీకు ఉన్నదా?అసలు ఆ స్వామి చిన్ముద్రతో పట్టబంధాసనం లో తపస్సులో ఆసీనులైన తీరే! ముందు మనకు కలిగే మొదటి సందేహమవుతుంది.

మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. [ఇంకా... ]

Thursday, January 1

సౌందర్య పోషణ - నాజూకు కోసం

1. తేనె నిమ్మకాయ రసం కలిపి తాగినా లావుగా ఉన్నవారు సన్నబడతారు. అయితే ఎసిడిటి ఉండకూడదు.

2. బరువు తగ్గటానికి మందులేమి ఉండవు. పీచు పదార్దాలనే నిపుణులు బరువు తగ్గడానికి ఉపయోగపడే మ్యూజిక్పిల్స్ గా పేర్కొంటారు.

3. లావు కావాలనుకునేవారు రాత్రులు గ్లాసుడు గోరు వెచ్చని పాలల్లో స్పూను తేనె కలుపుకొని తాగాలి.

4. లావుగా ఉన్న వారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేత ములగాకు రసం తాగుతూ ఉండాలి.

5. సన్నబడాలనుకునే వాళ్ళు ఉదయానే పరగడుపున గ్లాసుడు గోరు వెచ్చని నీళ్ళలో స్పూను తేనె కలుపుకొని తాగాలి. [ఇంకా... ]

లాలి పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే

పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే

పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే

పెందలాడే రావే - పాలు పెరుగు తేవే
మంచి మనసుతో రావే - ముద్దులిచ్చిపోవే [ఇంకా... ]

వంటలు - షుగర్ ఫ్రీ బర్ఫీ

కావలసిన వస్తువులు:

ఖర్జూరం పళ్లు - 200 గ్రాములు.
జీడిపప్పు - తగినంత.
బాదంపప్పు - తగినంత.
పిస్తా ముక్కలు - తగినంత.
యాలకులు - తగినంత.
కుంకుమపువ్వు - తగినంత.
అలంకరణకు వెండి కాగితం - తగినంత.

తయారు చేసే విధానం:

ఖర్జూరం పళ్ల విత్తనాలు తీసేసి, మెత్తగా ఉడికించాలి. డ్త్ర్ ఫ్రూట్స్, యాలకులు పొడి, కుంకుమపువ్వు కలిపి, ఒక పళ్లెంలో పోయాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - త్యాగయ్య

పేరు : త్యాగయ్య.
తండ్రి పేరు : రామబ్రహ్మం.
తల్లి పేరు : సీతమ్మ.
పుట్టిన తేది : 4-5-1767.
పుట్టిన ప్రదేశం : తిరువారూర్.

కాకర్ల త్యాగయ్య 1767వ సంవత్సరం మే నెల నాలుగవ తారీఖున తంజావూరు జిల్లాలోని కావేరీ నదీ తీరంలోని తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం మహాభక్తుడు. తంజావూరును పాలించిన రాజుల అభిమానాన్ని పొందిన రామభక్తుడు. తల్లి సీతమ్మ త్యాగయ్యను ఎంతో ప్రేమతో తన కీర్తనలలో 'సీతమ్మ మాయమ్మ... శ్రీరాముడు మాతండ్రి' అని గానం చేశాడు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లు తన తల్లిదండ్రుల పేర్లు కావటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తల్లి పేరును కొంతమంది రచయితలు శాంతమ్మగా రాశారు, కానీ అది నిజంకాదు. ఆయన రచించిన 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకంలో తండ్రిపై ప్రేమతో తండ్రి రామబ్రహ్మం గురించి ప్రస్తావించాడు. [ఇంకా... ]

మీకు తెలుసా - నూతన సంవత్సర వేడుకలు

కొత్త కొత్త ఆశలతో... నూతన ఆలోచనాల విధానాల సరళితో మార్పులు కోరుకొంటూ... మనిషిగాపుట్టిన ప్రతి ఆశాజీవి రాబోయే సంవత్సరం మరింత శోభాయమానంగా ఉండాలనే ఆకాంక్షతో పాత సంవత్సరపు వైభవాన్ని నెమరువేసుకొంటూ...విషాధచాయలని వదిలించుకొంటూ కనీసం కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేవేళ అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తూ వేడుకగా కులమతాలకతీతంగా, సనాతన సాంప్రదాయాలపట్టింపులు లేకుండా అన్ని దేశాలలో సర్వమానవ సౌబ్రాతృత్వం పరిపొందేలా వయో బేధం లేకుండా... పేద, గొప్ప అందరూ తమ శక్తికొద్ది జరుపుకొనే వేడుకే ఈ నూతన సంవత్సర సంబరం. ఈ నూతన సంవత్సరానికి ఆది అంతం అనేది ఉండదు. నూతనత్వాన్ని కోరుకోవడము లోనే గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. అలా ఆలోచించబట్టే ఆది మానవుడు నేడు అణుమానవుడైనాడు.

సంవత్సరం అంతా న్యూ ఇయరే...

జనవరి 1 న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొన్నిదేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఈ నూతన సంవత్సరంను ఒకొక్కరు ఒక్కొక్క నెలలో జరుపుకోవడం విశేషము. ఆరకంగా సంవత్సరంలో వచ్చే ప్రతినెలలోనూ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు చోటు చేసుకోవడం గమనార్హం. [ఇంకా... ]