శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ
గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా! [ఇంకా...]