ఒక అడవిలో నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉన్నది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటమంటే భలే ఇష్టం తన పనంతా అయిపోయాక చెట్టు పై పాటలు పాడుతూ గడిపేసేది.
ఓ రోజు పావురం పాటపాడుతూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో నదీ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చీమ ఒకటి కనిపించినది.దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది పావురం. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరచింది. అంతే, చీమ వెంటనే ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. [ఇంకా...]