దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది. ఈనాలుగు ధామములతో దేశం నలుమూలలూ చుట్టివేసినట్లే. మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్, 4వది-బదరీనాధ్ ధామం. ఉత్తరాన కాశీ వెళ్తామని వెళ్ళకపోయినా ఫరవాలేదట. కాని దక్షిణాదిన రామేశ్వరం వెళ్తామని అనుకొని వెళ్ళకపోతే మహపాతకమట. మీ మనస్సులోకి వెళ్దామనే సంకల్పం మాత్రంగానే మన పితృదేవతలు మన రాకకోసం స్వర్గంలో నిరీక్షిస్తారట. కనుక ప్రతివారూ కనీసం ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించవలె. మొదటగా కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యంగాదు. ఇది ప్రతి భారతీయుడూ చేయదగినపని యని మా భావం. రామేశ్వరం దర్శించటానికి దేశం నలుమూలల నుండి అన్ని రాష్ట్రాలు నుండి రావటం గమనించగలం. [ఇంకా...]