Friday, June 8

పుణ్య క్షేత్రాలు - మధురై

కాంచీపురం మాదిరిగానే మదురై కూడా చాల పురాతన ప్రశస్తిగల పట్టణం. తమిళనాడులో మదరాసు మహానగరం తరువాత రెండవ పెద్ద నగరం. మీనాక్షిదేవి నివాసం. పాండ్యరాజుల రాజధానిగా విలసిల్లిన ఈ అనాదిపట్టణం ఆనాడూ, ఈనాడూ సరిసమాన ప్రతిపత్తిగల శాఖతో జిల్లా ముఖ్యకేంద్రమై వెలుగొందడం నిజంగా గొప్ప విషయం. ఒక గొప్ప పవిత్రస్థలమే గాకుండా మంచి సందడిగల వ్యాపార కేంద్రం. సంస్కృతీ సాంప్రదాయాల కాణాచి. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో మధురై నగర ప్రసక్తి వుంది. వస్త్రాలు, ముత్యాల వ్యాపారం బహు జోరుగ సాగించిన వైనం సుప్రసిద్ధం. క్రీస్త్రు పూర్వం నుండే విదేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలున్నాయని చరిత్ర చాటి చెబుతుంది. [ఇంకా...]