Thursday, June 7

నీతి కథలు - తల్లి ప్రేమ

గర్భవతిగా వున్న సీతమ్మ భర్త పొరుగూరు వెళ్ళి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు-కోడలు వద్ద వుండి జీవితాన్ని వెళ్ళదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతియై మగ శిశువును కన్నది. అత్తా-కోడలు అన్యోన్యముగా వుండసాగారు. కొంతకాలము గడిచే సరికి చెప్పుడు మాటలకు లోనై భర్త వూళ్ళోలేని సమయంలో అత్తగారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు. [ఇంకా...]