Friday, June 15

వంటలు - చారుపొడి

కావలసిన వస్తువులు:
ధనియాలు - పావు కిలో.
జీలకర్ర - 50 గ్రా.
మిరియాలు - ఒక టేబుల్ స్పూన్.
ఎండుమిర్చి- 6.
కందిపప్పు - 1 చెంచా.


తయారు చేసే విధానం :
పై వస్తువులన్నీ రెండు రోజులపాటు ఎండలో ఎండబెట్టి, బాగా ఎండిన తరువాత వాటిని పొడి చేసుకోవాలి. చారు కాచేటప్పుడు పొడుము చిన్న చెంచాడు వేస్తే మంచి రుచి, సువాసన వస్తుంది. [ఇంకా...]

నీతి కథలు - కనువిప్పు

ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. [ఇంకా...]

వంటలు - వెజిటబుల్ చట్ పట్ దోసె

కావలసిన వస్తువులు:
దోసెపిండి - 3 కప్పులు.
పచ్చి బఠాణీ - 50 గ్రా.
పన్నీరు - 50 గ్రా.
బీన్స్ - 4,5.
క్యారెట్ - 1.
క్యాప్సికం - 2.
తాలింపు దినుసులు - కొద్దిగా.
ఖాజూ పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు .
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ఉప్పు - సరిపడినంత.
ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు.
రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు.
కొత్తిమీర తురుము - రెండు కట్టలు.
చీజ్ తురుము - కొద్దిగా.


తయారు చేసే విధానం :
పచ్చి బఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలు వేడినీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి. కడాయిలో ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలువేసి దోరగా వేగాక జీరా, వెజిటబుల్స్ ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః

1. ఓం ఆంజనేయాయ నమః
2. ఓం మహావీరాయ నమః
3. ఓం హనుమతే నమమః
4. ఓం మారుతాత్మజాయ నమః
5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
8. ఓం సర్వమాయావిభంజనాయ నమః
9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః
10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః [ఇంకా...
]

వంటలు - బాసుందీ

కావలసిన వస్తువులు:
పాలు - 2 లీటర్లు.
పంచదార - అర కప్పు.
పప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలుగా కోయాలి).

యాలకుల పొడి - 1 టీ స్పూను.
మిల్క్‌మెయిడ్ - 1 డబ్బా.


తయారు చేసే విధానం :
పాలను చిక్కగా కోవాలా అయ్యేవరకూ మరిగించాలి. అందులో పంచదార, మిల్క్‌మెయిడ్ కలిపి సిమ్‌లో పెట్టి మరో పదిహేను నిమిషాలు మరిగించి దించాలి. [ఇంకా...]

Thursday, June 14

నీతి కథలు - పరోపకారం

ఒక అడవిలో నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉన్నది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటమంటే భలే ఇష్టం తన పనంతా అయిపోయాక చెట్టు పై పాటలు పాడుతూ గడిపేసేది.

ఓ రోజు పావురం పాటపాడుతూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో నదీ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చీమ ఒకటి కనిపించినది.దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది పావురం. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరచింది. అంతే, చీమ వెంటనే ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. [ఇంకా...]

వంటలు - మామిడి పలావు

కావలసిన వస్తువులు:
ఎర్ర బియ్యం - 200 గ్రా.
తేనె - మూడు టేబుల్ స్పూన్లు.
కొబ్బరి పాలు - ఒక కప్పు.
బాదం లేదా జీడి పప్పులు - ఒక టేబుల్ స్పూను.
మామిడి పండు - ఒకటి.


తయారు చేసే విధానం :
బియ్యాన్ని రాత్రే నానబెట్టుకుని పొద్దున కుక్కర్‌లో ఉడకబెట్టండి. [ఇంకా...]

ఘట్టాలు - వధూవరుల మంగళవచనములు

వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు.

వధువు: లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.

బాసికము: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుఘమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమ వైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు. [ఇంకా...]

వంటలు - అటుకుల పాయసం

కావలసిన వస్తువులు:
తాజా మీగడపాలు - 1 లీటరు.
అటుకులు - 100 గ్రా.
పంచదార - పావు కిలో.
యాలుకలు - 4 (పొడిచేయాలి).
జీడిపప్పు - 4 టేబుల్ స్పూన్లు.
ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు.
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.


తయారు చేసే విధానం :
ముందుగా అటుకుల్ని కడిగి నీళ్ళు లేకుండా పదినిముషాలు ఆర బెట్టాలి. మందపాటి బాణలిలో పాలు పోసి కాసేపు మరిగించాలి. అందులో అటుకులు వేసి తక్కువ మంటమీద కాసేపు ఉడికించాలి. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

1. ఓం కాంతాయై నమః
2. ఓం శివసంధాత్రై నమః
3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః
4. ఓం శ్రీ పద్మాయై నమః
5. ఓం శ్రితమందారాయై నమః
6. ఓం సిద్ధిదాయై నమః
7. ఓం సిద్ధరూపిణ్యై నమః
8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః
9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః
10. ఓం ధుఃఖహారిణ్యై నమః [ఇంకా...
]

Wednesday, June 13

పండుగలు - హనుమజ్జయంతి

మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.

ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. [ఇంకా...]

వంటలు - కరివేపాకు రైస్

కావలసిన వస్తువులు:
సన్నబియ్యం - అర కిలో.
నీళ్లు - ముప్పావు లీటరు.
నూనె - 1 కప్పు.
ఉప్పు - తగినంత.
వేయించిన కరివేపాకు - 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి).
పుట్నాల పొడి(వేయించినశనగపప్పుపొడి) - 1 కప్పు
చింతపండు పులుసు - అర కప్పు.
వేయించి కొట్టిన ధనియాల పొడి - 2 టీ స్పూన్లు.
వేరుశనగపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 6 (సన్నగా చీల్చాలి).
ఎండుమిర్చి - 6.
మినపప్పు - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
జీలకర్ర - 1 టీ స్పూను.
పసుపు - 1/4 టీ స్పూను.
ఇంగువ - 1/4 టీ స్పూను.


తయారు చేసే విధానం :
బియ్యం కడిగి, నీళ్లన్నీ వార్చేయాలి. వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత బియ్యం వేసి మూడు వంతులు ఉడికాక మంట తగ్గించాలి. [ఇంకా...]

నేర్చుకో - సంధులు

సంధి అనగా రెండు పదముల కలయిక మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు.

ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.

రాముడ్ + అతడు = రాముడతడు అయినది. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాళిః

1. ఓం ప్రకృత్యై నమః
2. ఓం విద్యాయై నమః
3. ఓం వికృత్యై నమః
4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
5. ఓం శ్రద్ధాయై నమః
6. ఓం విభూత్యై నమః
7. ఓం సురభ్యై నమః
8. ఓం పరమాత్మికాయై నమః
9. ఓం వాచే నమః
10. ఓం పద్మాలయాయై నమః [ఇంకా...
]

Monday, June 11

పండుగలు - అక్షయ తృతీయ

ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి. అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ - ఉగాది" పర్వదినం. [ఇంకా...]

శతకాలు - దాశరథి శతకము

శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ

భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా! [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళిః

1. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
2. ఓం అవ్యక్తాయ నమః
3. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః
4. ఓం కటిహస్తాయ నమః
5. ఓం లక్ష్మీపతయే నమః
6. ఓం వరప్రదాయ నమః
7. ఓం అనమయాయ నమః
8. ఓం అనేకాత్మనే నమః
9. ఓం అమృతాంశాయ నమః
10.
ఓం దీనబంధవే నమః [ఇంకా...]

వంటలు - దద్దోజనం

కావలసిన వస్తువులు:
బియ్యం - 1 కిలో (కడిగి నానబెట్టాలి).
తాజా గట్టి పెరుగు - 1 లీటరు.
నెయ్యి - 100 గ్రా.
కరివేపాకు - 4 రెమ్మలు.
ఎండు మిర్చి - 10.
చిక్కటి పాలు (కాచినవి) - అర లీటరు.
పచ్చి మిర్చి - 10.
అల్లం (సన్నని ముక్కలు) - 2 టీ స్పూన్లు.
ఆవాలు - 2 టీ స్పూన్లు.
ఇంగువ పొడి - అర టీ స్పూను.
మిరియాలు - నాలుగు టీ స్పూన్లు.
పసుపు - పావు టీ స్పూను.
ఉప్పు - తగినంత.


తయారు చేసే విధానం :
బియ్యం కడిగి ఎసట్లో పోసి కాస్త మెత్తగా ఉడికించాలి. అన్నం చల్లారనివ్వాలి. [ఇంకా...]

Saturday, June 9

నీతి కథలు - నేనే గొప్పవాణ్ణి

గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము వుంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమయిన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా ఎనిమిది మైళ్ళ దూరమయినా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారుకొమ్మపై వున్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తుంటాడు.

"మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్ధులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు" అని గ్రామములోగల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు వుండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్ధుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు. [ఇంకా...]

వంటలు - చిలగడదుంపల పచ్చడి

కావలసిన వస్తువులు:
చిలగడదుంపలు - 1 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.
చింతపండు - 1/4 కిలో.


తయారు చేసే విధానం :
చిలగడదుంపలు శుభ్రంగా కడిగి తుడిచి, దుంపలు చిన్న చిన్న ముక్కలుగా చేసి, ముక్కలు, ఉప్పు, చింతపండు అన్నీ కలిపి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకొన్న తరువాత కారం కలిపి తీసి తాలింపు పెట్టటమే. [ఇంకా...]

నేర్చుకో - సమాసములు

వేరు వేరు అర్థములు గల పదములు ఏకపదమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తర పదమనుయు అందురు.

అవ్యయీభావ సమాసము: సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్ధ ప్రధానము అవ్యయీభావ సమాసము.

ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి [ఇంకా...]

వంటలు - క్యాబేజీ ఊరగాయ

కావలసిన వస్తువులు:
క్యాబేజీ తురుము - పెద్ద కప్పు.
నూనె - 4 టేబుల్‌ స్పూన్లు.
కారం - 1 టీ స్పూను.
ఉప్పు - 1 టీ స్పూను.
ఆవపిండి - 1/4 టీ స్పూను.
మెంతిపిండి - 1/4 టీస్పూను
ఇంగువ - చిటికెడు.
పసుపు - చిటికెడు.


తయారు చేసే విధానం :
ఓ పొడి పాత్ర తీసుకుని అందులో క్యాబేజీ తురుము వేయాలి. అందులోనే ఉప్పు, కారంతో పాటు పొడులన్నీ వేసి బాగా కలిపి, నూనె పోసి జాడీలో పెట్టాలి. [ఇంకా...]

శతకాలు - కుమార శతకము

శ్రీ భామినీ మనోహర
సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లోఁభావించెద; నీకున్
వైభవము లోసగుచుండ, వసుధఁగుమారా!


ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా! [ఇంకా...
]

Friday, June 8

వంటలు - వంకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:
వంకాయలు - 1 కిలో.
చింతపండు - 1/4 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.


తయారు చేసే విధానం :
ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. [ఇంకా...]

పుణ్య క్షేత్రాలు - చేజర్ల

చేజర్ల - కపోతేశ్వరాలయం:
మాచర్ల-గుంటూరు మార్గంలో నర్సరావుపేటకు 20 కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రయాణంలో చేరవచ్చును. చేజెర్ల చాలా చిన్న గ్రామం. కాని చాల పురాతనమైన ఆలయం కపోతేశ్వరాలయం. సుమారు క్రీ.శ. 3-4 శతాబ్దాలకు చెందినది. ఒక బౌద్ద చైత్యమును హిందూ దేవాలయంగా మార్చబడిందిగా తెలుస్తుంది. అయితే ఒక పూర్వగాధ మాత్రం చెప్పబడుతూ ఉంది ఇక్కడ ఇంకా మరికొన్ని చిన్ని చిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణకాశిగా పేరుగాంచి మంచి వైభవంతో శోభిల్లిందని కొన్ని శాసనాలను బట్టి తెలుస్తుంది. [ఇంకా...]

వంటలు - నిమ్మకాయ ఊరగాయ

కావలసిన వస్తువులు:
నిమ్మకాయలు - 100.
ఉప్పు - 6 గిద్దలు.
పసుపు - కొంచెం.
కారం - 3 గిద్దలు.


తయారు చేసే విధానం :
ముందుగా నిమ్మకాయలు కడిగి తుడిచి ముక్కలు చేసి, ఉప్పులో ఊరవెయ్యాలి. [ఇంకా...]

పుణ్య క్షేత్రాలు - మధురై

కాంచీపురం మాదిరిగానే మదురై కూడా చాల పురాతన ప్రశస్తిగల పట్టణం. తమిళనాడులో మదరాసు మహానగరం తరువాత రెండవ పెద్ద నగరం. మీనాక్షిదేవి నివాసం. పాండ్యరాజుల రాజధానిగా విలసిల్లిన ఈ అనాదిపట్టణం ఆనాడూ, ఈనాడూ సరిసమాన ప్రతిపత్తిగల శాఖతో జిల్లా ముఖ్యకేంద్రమై వెలుగొందడం నిజంగా గొప్ప విషయం. ఒక గొప్ప పవిత్రస్థలమే గాకుండా మంచి సందడిగల వ్యాపార కేంద్రం. సంస్కృతీ సాంప్రదాయాల కాణాచి. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో మధురై నగర ప్రసక్తి వుంది. వస్త్రాలు, ముత్యాల వ్యాపారం బహు జోరుగ సాగించిన వైనం సుప్రసిద్ధం. క్రీస్త్రు పూర్వం నుండే విదేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలున్నాయని చరిత్ర చాటి చెబుతుంది. [ఇంకా...]

వంటలు - దబ్బకాయ ఊరగాయ

కావలసిన వస్తువులు:
దబ్బకాయ - పెద్దది.
ఉప్పు - 1 గిద్ద.
పసుపు - కొంచెం.
కారం - 1 గిద్ద.


తయారు చేసే విధానం :
ముందుగా దబ్బకాయ కడిగి తుడిచి ముక్కలు చేసి, ఉప్పులో ఊరవెయ్యాలి. [ఇంకా...]

Thursday, June 7

పుణ్య క్షేత్రాలు - రామేశ్వరం

దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది. ఈనాలుగు ధామములతో దేశం నలుమూలలూ చుట్టివేసినట్లే. మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్, 4వది-బదరీనాధ్ ధామం. ఉత్తరాన కాశీ వెళ్తామని వెళ్ళకపోయినా ఫరవాలేదట. కాని దక్షిణాదిన రామేశ్వరం వెళ్తామని అనుకొని వెళ్ళకపోతే మహపాతకమట. మీ మనస్సులోకి వెళ్దామనే సంకల్పం మాత్రంగానే మన పితృదేవతలు మన రాకకోసం స్వర్గంలో నిరీక్షిస్తారట. కనుక ప్రతివారూ కనీసం ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించవలె. మొదటగా కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యంగాదు. ఇది ప్రతి భారతీయుడూ చేయదగినపని యని మా భావం. రామేశ్వరం దర్శించటానికి దేశం నలుమూలల నుండి అన్ని రాష్ట్రాలు నుండి రావటం గమనించగలం. [ఇంకా...]

వంటలు - మామిడికాయ ఆవకాయ

కావలసిన వస్తువులు:
మామిడికాయ ముక్కలు - మానెడు.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 డబ్బా.
ఆవ పిండి - 1 డబ్బా.
పసుపు - కొంచెం.
నూనె - 1/2 కిలో.
మెంతిపిండి - కొంచెం.


తయారు చేసే విధానం:

ఆవ పిండి: ఆవాలను ఎండలో పెట్టి, ఎండిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. తరువాత ఆవ పిండి, ఉప్పు, కారం కలిపి ఉంచుకోవాలి.

ముందుగా మామిడికాయలు కడిగి టెంకెతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి కొంచెం పసుపు, నూనె రాసి ఉంచుకోవాలి. [ఇంకా...]

నీతి కథలు - తల్లి ప్రేమ

గర్భవతిగా వున్న సీతమ్మ భర్త పొరుగూరు వెళ్ళి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు-కోడలు వద్ద వుండి జీవితాన్ని వెళ్ళదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతియై మగ శిశువును కన్నది. అత్తా-కోడలు అన్యోన్యముగా వుండసాగారు. కొంతకాలము గడిచే సరికి చెప్పుడు మాటలకు లోనై భర్త వూళ్ళోలేని సమయంలో అత్తగారిని నిర్ధాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు. [ఇంకా...]

భక్తి సుధ - శ్రీ శివాష్టోత్తర శతనామావళిః

1. ఓం శివాయ నమః
2. ఓం మహేశ్వరాయ నమః
3. ఓం శంభవే నమః
4. ఓం పినాకినే నమః
5. ఓం శశిశేఖరాయ నమః

6. ఓం వామదేవాయ నమః
7. ఓం విరూపాక్షాయ నమః
8. ఓం కపర్దినే నమః
9. ఓం నీలలోహితాయ నమః
10. ఓం శంకరాయ నమః
[
ఇంకా...
]

వంటలు - బెల్లం చిలకడ దుంపలు

కావలసిన వస్తువులు:
చిలకడ దుంపలు - 500 గ్రా.
బెల్లం - 500 గ్రా.
యాలకులు - 5 గ్రా.
నెయ్యి - 50 గ్రా.


తయారు చేసే విధానం :
ఎర్ర చిలకడ దుంపలు తీసుకొని శుభ్రంగా కడగండి. వీటిని గుండ్రంగా కోసి - దళసరి మందం ఉన్న గిన్నెలో వేయండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, దుంపలు ఉన్న గిన్నెలో వేయండి. [ఇంకా...]

Wednesday, June 6

నీతి కథలు - ప్రాణం తీసిన దురాశ

సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను, నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. హితోపదేశం - మిత్రలాభంలో నారాయణకవి చెప్పిన గొప్ప నీతి వున్న చిన్న కథ ఒకటి ఉంది.

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. [ఇంకా...]

వంటలు - సొరకాయ పులుసు

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు - 1/2 కిలో.
నూనె - 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు - తగినంత.
శనగపప్పు - 1 స్పూను.
మినపప్పు - 1 స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఆవాలు - 1/2 స్పూను.
పచ్చిమిర్చి - 4.
జీలకర్ర - 1 స్పూను.


తయారుచేసే విధానం:
చిక్కుడు కాయలు కడిగి ఈనలు తీసివేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టి తాలింపు వేసి ఈ చిక్కుడు ముక్కలు వేసి, కారం, ఉప్పు వేసి కొంచం నీళ్ళు పోసి మగ్గే వరకు ఉంచి దించాలి. [ఇంకా...]

వంటలు - టమోటా కూర

కావలసిన వస్తువులు:
టమోటాలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 4.
పచ్చిమిర్చి - 4.
నూనె - 8 స్పూన్లు.
ఆవాలు - 1/2 స్పూను.
ఉప్పు, కారం - తగినంత.
ఎండు మిర్చి - 2.
శనగపప్పు - 1 స్పూను.
మినపప్పు - 1 స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
కరివేపాకు -2 రెబ్బలు.
వెల్లుల్లిపాయ - 1.
జీలకర్ర - 1 స్పూను.


తయారుచేసే విధానం:
టమోటాలు మరీ పండినవి కాకుండా దోరగా ఉన్నవి ఏరుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను ఒలిచి సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్లో కలిపి ఉంచుకోవాలి. [ఇంకా...
]

వంటలు - చింతకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:
చింతకాయలు - 2800 గ్రా (1 కట్టు).
ఉప్పు - సోలా గిద్ద.
మెంతులు - 100 గ్రా.
పసుపు - సరిపడినంత.


తయారు చేసే విధానం :
ముందుగా చింతకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టాలి. తరువాత చింతకాయలు, ఉప్పు, పసుపు, మెంతులు వేసి మెత్తగా తొక్కవలెను. [ఇంకా...]

వంటలు - మామిడికాయ (మాగాయ)

కావలసిన వస్తువులు:
మామిడికాయ ముక్కలు - మానెడు.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.
మెంతిపిండి - కొంచెం.


తయారు చేసే విధానం :
ముందుగా మామిడికాయలు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఒక మానెడు ముక్కలకు, ఒక డబ్బా ఉప్పు పోసి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజున ఆ ముక్కలను తీసి పిండి ఒక కవర్ మీద పోసి రెండు రోజులు ఎండనివ్వాలి. [ఇంకా...]

Tuesday, June 5

వంటలు - కొత్తిమీర పచ్చడి

కావలసిన వస్తువులు:
కొత్తిమీర - 1 కిలో.
చింతపండు - 1 కిలో.
కారం - 2 డబ్బాలు.
ఉప్పు - 4 డబ్బాలు.
మెంతిపిండి - కొంచెం.
నూనె - 350 గ్రా.


తయారు చేసే విధానం :
కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు మునగారా నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. (ఉడికేటప్పుడే అందులో ఉప్పు కూడా వెయ్యాలి) ఉడికిన తరువాత దించి కొంచెం సేపు ఆరనిచ్చి తరువాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. [ఇంకా...]

వంటలు - టమోటా పచ్చడి

కావలసిన వస్తువులు:
టమోటాలు - 1 కేజి.
కారం - 1 గిద్ద.
ఉప్పు - 1 డబ్బా.
మెంతి పిండి - కొంచెం.
చింతపండు - 200 గ్రా.


తయారు చేసే విధానం :
ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఒక డబ్బాలో ఉప్పు, టమోటా ముక్కలు వేసి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజు వాటిని పిండి ఒక కవర్ మీద వేసి రెండు రోజులు ఎండ నివ్వాలి. [ఇంకా...]

నీతి కథలు - బుద్ధి బలం

పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలీ, దాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది. ఒకటొకటిగా మరణించసాగాయి. తమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి. [ఇంకా...]

నీతి కథలు - వింతపరిష్కారం

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు. [ఇంకా...]

Saturday, June 2

వంటలు - కాకరకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో.
చింతపండు - 1/4 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.
నూనె - 350 గ్రా.


తయారు చేసే విధానం :
ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని చింతపండు, నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. [ఇంకా...]

నీతి కథలు - కృతజ్ఞత

అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు రామయ్య వెళ్ళాడు. అక్కడికి సమీపములో వేటగాడు వలపన్ని బియ్యం నూకలు వెదజల్లి వుంచాడు. వాటికి ఆశపడి జంటపావురాళ్ళు వలలో చిక్కుకుని ప్రాణభీతితో ఉన్నాయి. వాటిని వల తప్పించి పైకి ఎగురవేశాడు రామయ్య.

కొంతకాలము గడిచింది. రామయ్య అడవికి వెళ్ళి వస్తూనే వున్నాడు. ఒక రోజు దారి తప్పి అడవిలో బాగా పైకి వెళ్ళిపోయాడు. దారి తెలియక అవస్థపడుతున్నాడు. చీకటి పడింది. క్రూరమృగములు తనని ఏం చేస్తాయోనని భయపడుతూ అక్కడికి సమీపంలో గల సత్రం వద్దకు చేరుకున్నాడు. [ఇంకా...]

భక్తి సుధ - లలితా సహస్రనామం

ధ్యానమ్:
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం,
అణిమాదిభిరావృతాం మయూఖైః - అహమిత్యేవ విభావయే మహేశీమ్.
ధ్యాయేత్ పద్మాసనస్ధాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం,
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమపద్మాం వరాంగీమ్,
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్.
[ఇంకా...]

వంటలు - మామిడి అల్లం పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడి అల్లం - 1/2 కిలో.
చింతపండు - 1 కిలో.
కారం - 2 డబ్బాలు.
ఉప్పు - 4 డబ్బాలు.
మెంతిపిండి - కొంచెం.


తయారు చేసే విధానం :
మామిడి అల్లం ముందుగా చెక్కు తీసి ముక్కలు చేసి రెండు గంటలు ఎండనివ్వాలి. కొంచెం నీళ్ళు పొయ్యి మీద ఉంచి బాగా మరిగిన తరువాత చింతపండు, ఉప్పు వేసి ఒక పూట నాననివ్వాలి. [ఇంకా...]

వంటలు - మునక్కాయ ఆవకాయ

కావలసిన వస్తువులు:
ములక్కాయ ముక్కలు - వీసె (1400 గ్రా).
చింతపండు - 1/2 కిలో.
ఉప్పు - 2 డబ్బాలు.
కారం - 1 డబ్బా.
నూనె - 350 గ్రా.


తయారు చేసే విధానం :
ముందుగా నీళ్ళు చింతపండు కలిపి పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. అందులో ఉప్పు కూడా వేసి కలపాలి. అది ఆరిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. [ఇంకా...
]

Friday, June 1

పుణ్యక్షేత్రాలు - కంచి

ఇది ఒక దివ్యదేశం - ముక్తి క్షేత్రంగా కొనియాడబడిన సప్తమోక్షదాయక పురులలో ఒకటిగా పురాణ ప్రసిద్ధి గలది. మద్రాసు మహానగరానికి సుమారు 75 కి.మీ. దూరంలో నైఋతిదిశగా చెంగల్పట్టు జిల్లాలో అమరియున్నది. ఆ పేరు ఎత్తగానే పండుగలు వివాహాది ప్రత్యేక సందర్భాల్లో ధరించే వైభవోపేతమైన కంచిపట్టు చీరెలు మనస్సులో మెదులుతాయి. వెండిజరీలతో బంగారు రంగు రంగు నగిషీపనుల సోయిగాలు అనంతం, విశేష ప్రఖ్యాతితో ఈ నాటికీ విరాజిల్లుతున్నాయి. [ఇంకా...]

సౌందర్య పోషణ - కన్నులకు

  • ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను కళ్ళచుట్టూ రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయి.
  • ఎండవేడిని తట్టుకునేందుకు వాడే సన్‌స్క్రీన్ లోషన్ల వంటి వాటిని బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడండి.
  • కళ్ళకింద వలయాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని లేజర్ చికిత్స ద్వారా పాక్షికంగా తగ్గించుకోవచ్చు. ఈ చికిత్స తీసుకునే సమయంలో ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి.
    [ఇంకా...]

వంటలు - ఉసిరి ఆవకాయ

కావలసిన వస్తువులు:
ఉసిరికాయలు - మానెడు.
కారం - 1 డబ్బా.
ఉప్పు - 1 డబ్బా.
ఆవపిండి - 1 డబ్బా.
నూనె - సరిపడినంత.


తయారు చేసే విధానం :

ఆవ పిండి:
ఆవాలను ఎండలో పెట్టి, ఎండిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. తరువాత ఆవపిండి, ఉప్పు, కారం కలిపి ఉంచుకోవాలి.

ముందుగా పొయ్యి మీద నూనె పెట్టి కాగిన తరువాత ఉసిరికాయలు అందులో వేసి, ఒక అర గిద్ద నీళ్ళు పోసి ముక్క ఉడికే వరకు ఉంచవలెను.
[ఇంకా...]

నీతి కథలు - నిజాయతీ

ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. [ఇంకా...]