Friday, August 3

వ్రతములు - శ్రావణ మంగళవారపు వ్రతము

ఒక బ్రాహ్మణుడు సంతానము లేక పోవుటచే మిగుల పరితపించి సంతానము బడయుటకుగాను పరమేశ్వరుని గూర్చి ఘో(గో)రతపము చేసెను. అంతట కొంత కాలమునకు పార్వతీపరమేశ్వరులతనికి ప్రత్యక్షమై కోరికను తెలుపవలసినదనిరి. అతడు సంతానవరము నొసగవలెనని ప్రార్ధించెను. వారు నీకాయువు లేని కొడుకు కావలయునా? లేక అయిదవతనములేని కుమార్తెకావలెనా? అని ప్రశ్నించిరి. అందుకతడు బదులు చెప్పలేక ఆవిషయమును భార్యనడిగి తెలుసుకొనెదనని చెప్పి వారి ఆజ్ఞ నొంది, ఇంటికివచ్చి భార్యనుజూచి - "మనకు ఆయువు లేని అబ్బాయి కావలెనా? లేక అయిదవతనముచాలని అమ్మాయి కావలెనా?" అని ప్రశ్నించెను. ఆమె "పుట్టిచచ్చినను పుత్రుడే కావలయును. ఆడుబిడ్డతో ఆపదలుపడలేమని" చెప్పెను. [ ఇంకా ]