Saturday, August 4

పండుగలు - మథర్స్ డే

అమ్మ:
'మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ' అంటూ మనము మొదట అమ్మకు ప్రణామం చేసిన తరువాతనే తండ్రికి, గురువుకి ప్రణామం చేస్తాం. పుట్టిన ప్రతి వ్యక్తికి మొదటి గురువు అమ్మే. అసలు ఈ సృష్టిలో అతి తీయనైన, కమ్మనైన పదం అంటూ ఉంటే అది 'అమ్మే'. ఈ 'అమ్మ' అనే రెండు అక్షరాల పదం లేకపోతే ఈ జగత్తు లేదు. మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే, అమ్మ లేకపోతే మనము లేము, ఈ సృష్టి లేదు. మనల్ని నవ మాసాలు మోసి కని, పెంచేది అమ్మే, పెరిగి పెద్ద వాళ్ళమైన తరువాత ఎన్నో తప్పులు చేస్తే వాటిని ఓర్పుతో క్షమించి, మన తప్పులను సరిదిద్దుతుంది అమ్మ. అమ్మ మనసంత స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సు ఎవరకీ ఉండదు. [ ఇంకా ]