- ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి.
- ఏడాది పొడవునా ఒకే విధమైన పర్‌ఫ్యూమ్ వాడకూడదు. ఋతువులను బట్టి పర్‌ఫ్యూమ్ తీక్షణత గుణధర్మాలు మారుతుంటాయి.
- కొద్ది నీళ్లలో పుదీనాకు వేసి ఉడికించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. చంకల్లో, లోపలి భాగాల్లో పూసుకునేందుకు కొద్దిగా పుదీనా ద్రవాన్ని పక్కకు పెట్టుకోండి.