Tuesday, December 16

జానపద కళారూపాలు - పగటి వేషాలు

సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా ఇవి దేశంలో ప్రచారం పొందాయి. వీటిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి పరిపాలకుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోనికి వచ్చాయని ప్రతీతి.

కృష్ణాజిల్లా కూచిపూడి పగటి వేషధారులకు నిలయం. నృత్యనాటకాలు ఆడేవారు నాట్య మేళములుగా ఏర్పడి తమకున్న కళా ఔన్నత్యంలో ప్రదర్శనలూ ఇస్తున్నారు. కూచిపూడివారిలో కొందరు సంవత్సరంలో కొన్ని నెలలు సంచార మేళములుగా ఏర్పడి ప్రజలలో విజ్ఞాన ప్రభోధం చేస్తూ - తద్వారా ఆనందాన్నీ, ఆలోచననూ కలిగిస్తుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచిపోకూడదు. కూచిపూడి - భాగవత కథా, ప్రదర్శనలకు ప్రత్యేకత అయితే, గడ్డిపాడు - పగటి వేషాలకు ప్రసిద్ది పొందింది. అసలు పగటి వేషాలకు ఒక విలువను చేకూర్చిన వారు గడ్డిపాడు వారే అనిపిస్తుంది. [ఇంకా... ]