ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి వెళ్ళే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సెప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్ళు గలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా లభ్యమవుతాయి.
పూరి బంగాళాఖాతం తీరములో ఉన్న ఒక పట్టణం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. జగన్నాధాలయం చుట్టూ నగరం నిర్మాణం జరిగివున్నది. [ఇంకా... ]