Wednesday, December 24
సాహిత్యం - సి.పి.బ్రౌన్
తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్ చిరస్మరణీయుడు. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.డేవిడ్ బ్రౌన్, ఫ్రాన్సిస్ కాలేల ద్వితీయ కుమారుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్) 1817లో చెన్నపట్నంలోని సెంట్ జార్జ్ కోట కాలేజిలో సివిల్ సెర్వంట్ విద్యార్ధిగా చేరాడు. తెలుగు మరియు మరాఠీ ప్రాంతీయ భాషలను ఎంచుకొని విద్యాభాసం చేశాడు. వెలగపూడి కోదండరామయ్య గారు బ్రౌన్‌కు తెలుగులో అక్షరాభ్యాసం చేయించి, తెలుగు రాయడం, చదవడం నేర్పించారు. బ్రౌన్ మరాఠీ కంటే తెలుగుపట్లే ఎక్కువ మక్కువ చూపేవాడు. 1823లో ఆబే దుబాయ్ రచించిన "హిందువుల ఆచారాలు" అనే గ్రంధాన్ని బ్రౌన్ చదివి అనేక విజ్ఞానం సంపాదించాడు. [ఇంకా... ]