Saturday, December 27

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - బైక్, స్కూటర్, మోపెడ్

కొత్త ఏడాదిలో బైకు భలే ఉంటుంది కదూ. నలుగుర్నీ సలహా అడిగి చదివి మంచి కంపెనీ, అంతకంటే మంచి మోడల్ ఎన్నుకోగానే సరిపోదు మంచి కండీషన్ లో ఉన్న బండిని ఎంచుకోవటంలోనే ఉంది కిటుకంతా.

ఏ కంపెనీ అయినా తాము తయారు చేసే బైకులను మంచి కండిషన్ లో అందించాలనే చూస్తుంది అయినప్ప టికీ కొన్నిసార్లు తెలియకుండానే చిన్న చిన్న లోపాలు కనిపించవచ్చు. వీటిలో ఎక్కువ శాతం రవాణా సందర్భంగా చోటుచేసుకునేవే. అరుదుగా తయారీలోనూ లోపాలు కనిపించవచ్చు. అలాగని కొత్త బండి మొత్తాన్ని విడదీసి ప్రతి భాగాన్నీ పరిశీలించటం సాధ్యం కాదు. కాని, బయటకు కనిపించే భాగాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించటం ఇబ్బందేమీ ఉండదు.

1. బైకును ఎంచుకునేటప్పుడు ముందుగా చూడాల్సింది పెట్రోలు ట్యాంకు. దానిమీద ఎలాంటి సొట్టలు/గీతలు ఉండకూడదు. వెలుతురు బాగా ఉన్నచోట, సాధ్యమైతే ఎండలో బండిని పరిశీలించండి. చేతివేళ్లతో ట్యాంకు మీద సున్నితంగా అటూ ఇటూ స్పృశించండి. గరుకుగా అనిపించినా. సొట్ట పడినట్లు అనిపించినా ఇంకో బైకును చూడండి.

2. రవాణాలో ఎక్కువగా దెబ్బతినేవి క్లచ్, ముందు బ్రేకు లీవర్లు. చివర్లలో విరిగితే సులభంగానే గుర్తించవచ్చు. హ్యండిల్ తో కలిసేచోట రబ్బరు కప్పులుంటాయి. కాబట్టి, ఇక్కడ విరిగితే కనిపెట్టడం కొంత కష్టం. వాటిని జరిపి ఎక్కడైనా తేడాలున్నాయేమో చూడాలి. [ఇంకా... ]