Wednesday, December 10

మీకు తెలుసా - వలస పక్షులు

నేస్తాలూ! మనం అప్పుడప్పుడు అమ్మానాన్నతో కలిసి బజారుకెళ్తుంటాం కదా. అక్కడ రకరకాల బొమ్మలు వున్న షాపు ఏదైనా కనిపిచిందనుకోండి. మనం ఆ బొమ్మల్నే చూస్తూ నిలబడిపోయారనుకోండి. తర్వాత చూస్తే పక్కన మీ వాళ్లు ఎవరూ లేరు. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడినుండి ఇంటికెలా వెళ్లాలో తెలిస్తే సరే. తెలియకపోతే చాలా భయమేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదూ. అవతల మీవాళ్ల పరిస్ధితీ అంతే. తప్పిపోయిన మీకోసం వాళ్లంతా వెతుకుతుంటారు. బజారుకెళ్లి ఒక్కళ్లమే తిరిగి రావడానికి మనం చాలా ప్రయాసపడతాం. మన వాళ్లనూ కంగారుపెడతాం. కానీ కేజీ బరువు కూడా లేని పక్షులకు ఇలాంటి బాధల్లేవు. అవి ఎవరి సాయం లేకుండానే దేశదేశాలు దాటి వెళ్తాయి. వెళ్లడమే కాదు. క్షేమంగా వెనక్కి తిరిగి వస్తాయి. మునుపు కట్టుకున్న గూటిలోనే కాపురం పెడతాయి. ఈ పక్షులు ఖండాంతరాల్లో పెట్టిన గుడ్ల నుండి బయటికొచ్చిన పిల్లలు అంతకు ముందెప్పుడూ చూడని తమ స్వస్ధలాలకు క్షేమంగా చేరతాయి. విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. వాతావరణ పరిస్ధితులు పక్షుల్ని వలస బాట పట్టించాయి. [ఇంకా... ]