Friday, December 12
పుణ్యక్షేత్రాలు - అన్నవరం
ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3 కి.మీ. దూరంలో పంపానదీ తీరంలో ఉన్న కొండ రత్నగిరి, ఇక్కడ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ ఆచరింపబడతాయి. కొండ క్రింది నుండి పైకి నేరుగా దేవస్థానం తరపున బస్సులున్నాయి. ఓపిక ఉంటే మెట్లెక్కి కూడా వెళ్ళ వచ్చును. క్రింది నుండి పైకి చేరటానికి నడిచి మెట్లెక్కి వెళితే సుమారు 20 నిమిషాలు పట్టవచ్చు. అంధ్రదేశం హైందవులు కుల విచక్షణ లేకుండా తమ ఇంట ఏ శుభకార్యము జరిగినా - వివాహం, గృహనిర్మాణం జరిగిన, గృహప్రవేశ మహొత్సవము లేక మరేదైన శుభ సందర్భాలన్నింటికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు. అది ఈ స్వామి వ్రతమే, అంటే తెలుగువారికి ఎంత ప్రియాతిప్రియమైన దేవుడో అర్థం చేసుకోవచ్చు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి. [ఇంకా... ]