Saturday, December 6

ఆహార పోషణ సూచిక - పళ్ళు కాయగూరల ప్రత్యేకత

అన్నిరకాల పళ్ళు, కాయగూరలు ఆహారంగా సేవించడం శ్రేయస్కరం. వీటియందుండే నారవంటి పదార్ధం - సెల్యులోజ్ పేగులను శుభ్ర్రపరచి సక్రమ మలవిసర్జనకు సహకరిస్తుంది. ఈ నార పేగులకు వ్యాకోచం పొందించి ప్రేగులలో తడిని సంరక్షిస్తుంది. కాకరకాయలు వంటి కొన్ని చేదు కాయగూరలు బలవర్ధకమైన టానిక్ లాగా ఉపకరించి పేగులలో ప్రవద్ధి పొందే నులిపురుగులను నశింపజేస్తుంది. జీర్ణ శక్తి సమృద్ధమై ఆకలి కలిగిస్తుంది. ఎండు ఖర్జూరపు కాయలలో విస్తారంగా లభించే సెల్యులోజ్, టేనిక్ ఆసిడ్ విరేచనకారి. ద్రాక్షపళ్ళు, అత్తిపళ్ళు కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది.

సిట్రిక్, మాలిక్, ఆసిటిక్, టేనిక్, టార్టారిక్, వంటి అమూల్యమైన ఆమ్లపదార్ధాలు పళ్ళలోను, కాయగూరలలోను ఎక్కువగా లభిస్తాయి. ఈ సహజ ఆమ్లాలు అన్నాశయంలో జీర్ణ శక్తిని అభవృద్ధి పరచి ఆకలిని పుట్టిస్తాయి. దీనివల్ల జీర్ణ కారకములగు ఎంజైములు ఉద్భవించి కాలేయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆమ్లాలు, లవణములు క్షారాలతో కలసి పిండి పదార్ధాలను సక్రమంగా జీర్ణిస్తాయి. కడుపు ఉబ్బరం, పులిత్రేపులు మొదలగునవి తగ్గుతాయి. [ఇంకా... ]