మన ప్రాచీన కళారూపాలలో చాలా ప్రాచీనమైనది కురవంజి అని కొందరి అభిప్రాయం. తెలుగు కావ్యాలలో కురవంజి ప్రస్తావన చాలా చోట్లే అగుపిస్తుంది. కొందరు కొరవంజి అనీ, కురవంజి అనీ పిలవడమూ కద్దు. ఇంకా పరిశోధకుల దృష్టి నుంచి ఆలోచిస్తే కొరవంజి పరిణామమే యక్షగానం అనీ చెప్పకపోలేదు. కురవంజి విశేషాలను గురించిన విషయ సేకరణలో కురవంజి అంటే కొరవజాతి స్త్రీ అని, ఎరుకలు చేసే నాట్య విశేషమనీ చెప్పబడింది. పదహారవ శతాబ్ధిలోనే కురవంజి నృత్య విశేషం ఉందనీ, అప్పటికే అది చాలా ప్రాచీనమైనదనీ అంటున్నారు.
కురవంజి అనేది ఒక నాట్య విశేషానికి చెందిన అడుగు (లయ). ఈ నాట్యాన్ని ఆదవులలో నివశించే కురవలు అనే జాతి ప్రజలు ప్రదర్శిస్తారు కాబట్టి దానిని "కురవంజి" అన్నారు. ఈ కళారూపం అటవికులది.వీళ్ళు అడవి జంతువుల చర్మాలనీ, ఈకలనీ, పులి గోళ్ళూ, ఎలుగుబంటి వెంట్రుకలు మొదలైన వాటిని ధరించి నృత్యాలు చేస్తారు. పుణ్య క్షేత్రాల్లో యాత్రికుల వినోదార్ధం క్షేత్ర మహత్యాల గురించి కథలల్లి ప్రదర్శించేవారు. [ఇంకా... ]