Monday, December 22

కథలు - ఆ మూల గదిలో

పెళ్ళికూతుర్ని ముస్తాబు చేస్తున్న ఆ ఈడు అమ్మాయిలు అతన్ని చూసి అవాక్కయిపోయారు. కాళ్ళకు పారాణి పెడుతున్న పావని పెరట్లోని పెసర పుణుకులు గుర్తుకు వచ్చాయంటూ నెమ్మదిగా జారుకుంది. అక్కడి నుండి. జడలో మల్లెల్ని పేర్చి అందాల్ని అమర్చుతూన్న మానస పెళ్ళిపందిరిలో పన్నీటి బుడ్డి మరచిపోయానంటూ పరుగులు తీసింది.

సిగ్గులమొగ్గల్ని మోస్తున్న నందినికి విషయం అర్థం కాలేదు. అసలే పెళ్ళికూతురేమో అందాలు వంటిమీద ఆభరణాల్లాగే బరువెక్కి ఉన్నాయి. 'ముఖానికి సగం పూర్తి అయిన అలంకారాలు ఇక చాలులే ఓపలేకున్నాను' అంటున్నాయి. పరుచుకున్న పరువాలు పట్టు తప్పుతున్నాయి.

నందినికి అదోలా ఉంది. తడబాటుతనం తన్నుకొస్తోంది. తడారిన పెదాలు తీపిగా వణుకుతున్నాయి. పైట పట్టు తప్పి జారి స్థానభ్రంశం చెందుతోంది. ఇక ఆగు ముహూర్తానికి మూడు గంటలేగా అని సర్ది చెప్పబోతే, కదలలేని కాలం విరహగీతాన్ని ఆలపిస్తోంది. తనకు తానుగా తీపి ఊహలతో తపించిపోతోంది నందిని. స్థానభ్రంశం చెందుతోంది. [ఇంకా... ]