Tuesday, December 30

ఆహార పోషణ సూచిక - కరివేపాకులోని కలిమి

కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. చేదు అని కాకరని, వాసన అని ముల్లంగిని త్రోసిపుచ్చినా కరివేపాకుని వాడని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు కదా! కరివేపాకు వేసిన కూరలు కమ్మదనాన్నే కాక సువాసనని కూడ చేర్చి నోరూరింప చేస్తాయి. పెరటిలో బద్దకించక కరివేపాకు మొక్కని నాటుకుంటే అవసరమైనప్పుడంతా తాజా కరివేపాకును వాడే భాగ్యానికి నోచుకోవచ్చు. ఇటీవల అటవీశాఖ వారు కూడ ఈ మొక్కలను సరఫరా చేయుచున్నారు. ఇది కొండ చరియలలోను, కొండ దిగువ భాగంలోను, హిమాలయములలోను, కాశ్మీరు నుండి కుమ్‌యోన్‌ వరకు వ్యాపించి ఉంది.

కరివేపాకు శాస్త్రీయ నామము 'మురయ కొనిగి'. నిమ్మ, చీనీ జాతులకు చెందిన 'రూటేసి' కుటుంబమునకు ఇది కూడా చేరినది. కరివేపాకు చెట్టు షుమారు 6 మీ|| ఎత్తు పెరిగి చూచేందుకు అందంగా, గుబురుగా, దృఢమైన సన్నని కాండంతో, శాఖలతో అలరారుతూ వుంటుంది. పుష్పములు శిఖర స్ధానంలో తెలుపులో, సువాసనాభరితమై వుంటాయి. [ఇంకా... ]