1. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)
సిడ్బి (SIDBI) 1990వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. లఘు పరిశ్రమలకు, అవసరమయ్యే ఆర్ధిక మరియు ఆర్ధికేతర సదుపాయాలను అందించటానికి ఇది ముందుకొస్తుంది. లఘు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులను మార్కెటింగ్ చేయడం, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతవాసులు పెద్ద పట్టణాలకు వలసరవటాన్ని నిరోధిస్తుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్ ఆధునీకరణ, టెక్నాలజీ మెరుగుదల "సిడ్బి" ప్రధానంగా చేపడుతుంది. అనేక బ్యాంకుల ద్వారా చిన్నతరహా, గ్రామీణ పరిశ్రమలకు ఋణాలను అందిస్తుంది.
మరిన్ని వివరాలకు: SBI, 203, బాబూఖాన్ ఎస్టేట్స్, సెకండ్ ఫ్లోర్, బషీర్‌బాగ్, హైదరాబాద్ - 500 001. [ఇంకా... ]