గౌరీపూజ ఘనంగా చేయిస్తున్నారు పురోహితులు. వేడుకల ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. భజంత్రీలు సాంప్రదాయ స్వరాలకు కొంత ఆధునికత జోడించి వీనులవిందు చేస్తున్నారు. అంతా. . .అందరిలోనూ ఒక్కటే హడావిడి. ఆడపెళ్ళి వారితో మర్యాద పేరిట ఆతృత నెలకొని ఉంది. మగపెళ్ళివారికి దర్పం తాలూకు స్వాభిమానం, అందుకొనే మర్యాదలతో తలమునకలై కనిపిస్తున్నారు.
"పెళ్ళికొడుకు చినతాతగారికి ఉప్మా అందలేదట. వెంటనే చూడండర్రా" అక్కడ అందరిలోకి వయసులో పెద్దావిడ పెద్దగా అంటోంది.
"ఇచ్చాంలే అత్తా. మారువడ్డిస్తే తేడా చేసిందనుకో, అసలే ముసలిప్రాణి" ఉప్మా అందిస్తూన్న కుర్రాడు బదలు పలికాడు.
"టిపినీలు చేశారా? కాఫీలు త్రాగారా?" ఆడపిల్ల తాలూకు ఓ అల్లరిపిల్లాడు పెళ్ళివార్ని గుచ్చి గుచ్చి మరీ అడుగుతున్నాడు.
"తెగ సందడి చేస్తున్నావ్. పెళ్ళి సందడి సినిమా ఎన్నిసార్లు చూశావేమిటి?" మూడోమారు కాఫీ తాగుత్ను ఒకామె నిలదీసి అడుగుతోంది. [ఇంకా... ]