స్వతంత్ర భారతదేశానికి దక్షిణపు కొన-అగ్రము. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తుతగ్గి, చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరకి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. ఇది దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు. రెండు మహా సముద్రాలను వేరుచేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ప్రపంచంలో మరెక్కడయినా ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నిత్యసత్యం - సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం. [ఇంకా...]