Monday, July 9

చిట్కాలు - వంటగదికి సంబంధించినవి

అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి.
[ఇంకా...]