వ్రతము చేయుటకు కావలసిన వస్తువులు అన్నియు సమకూర్చుకొనవలయును. అవి ఏవనగా.. శ్రీ స్వామివారి చిత్రపటము, పసుపు, కుంకుమ, బియ్యప్పిండి, వివిధ రకములైన ఫలములు అంటే ద్రాక్ష, ఖర్జూర, కిస్‌మిస్ మున్నగునవి. పాలు, పెరుగు, తేనె, నేయి, పంచదారలు, పటిక బెల్లము, సాంబ్రాణి, హారతి, కర్పూరము, కొబ్బరికాయలు, తమలపాకులు, ఏలకులు, సుగంధ ద్రవ్యములు, కదళీఫలములు, గోధుమ, నూక పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ఇంకను స్వామివారి మంటపారాధనకు కొత్త వస్త్రములు, మంచి గంధము, సువాసన ద్రవ్యములు వీటన్నింటిని శుచిగా సేకరించుకుని పవిత్రమైన, శుభ్రమైన స్థలమునందు భద్రపరచుకొనవలయును. [ ఇంకా ]