Wednesday, December 31

తెలుగు బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య .
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901 .
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు.
రచనలు : 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింపెస్స్ ఆఫ్ వర్డ్ హిస్టరీ'.
స్వర్గస్తుడైన తేది : డిసెంబర్ 15.
గొప్పదనం : నిరాహారదీక్ష చేసి మద్రాసు రాష్ట్రాం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినారు.

ఒకప్పుడు మన ఆంధ్రాప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉండేది. తమిళ సోదరులు, మనం ఎంతో ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా, భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి! మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మద్రాసు రాష్ట్రంలో జనాభా ఎక్కువైయింది. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఏది మేలు...?

గడపలన్నిటిలోన ఏ గడప మేలు?
మహలక్ష్మి నర్తించు మా గడప మేలు

అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు?
అతిధులందరు జేరు మా అరుగు మేలు

వీధులన్నింటిలోన ఏ వీధి మేలు?
కొట్లాటలే లేని మా వీధి మేలు

ఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు?
సిరులు సంపదలు తులతూగు మాఊరు మేలు [ఇంకా... ]

వంటలు - స్టఫ్ డ్ రోల్స్

కావలసిన వస్తువులు:
ప్రెంచ్‌రోల్ - 1.
ఉడికించిన బఠాణీ - 2 కప్పులు.
ఉడికించిన పెసర మొలకలు - 1 కప్పు.
సన్నగా తరిగిన అల్లం - 1 చెంచా.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 2 చెంచాలు.
చాట్ మసాలా - 2 చెంచాలు.
తరిగిన కొత్తిమీర - 2 గరిటెలు.
తరిగిన ఉల్లిగడ్డ - 1.
ఉప్పు - సరిపడినంత.
వెన్న - వేయించడానికి సరిపడినంత.

తయారు చేసే విధానం:
ప్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక్కో భాగం ఓ కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. [ఇంకా... ]

నీతి కథలు - నోరుమూయించడం

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - పూరి

ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి వెళ్ళే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సెప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్ళు గలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా లభ్యమవుతాయి.

పూరి బంగాళాఖాతం తీరములో ఉన్న ఒక పట్టణం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. జగన్నాధాలయం చుట్టూ నగరం నిర్మాణం జరిగివున్నది. [ఇంకా... ]

Tuesday, December 30

ఆహార పోషణ సూచిక - కరివేపాకులోని కలిమి

కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. చేదు అని కాకరని, వాసన అని ముల్లంగిని త్రోసిపుచ్చినా కరివేపాకుని వాడని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు కదా! కరివేపాకు వేసిన కూరలు కమ్మదనాన్నే కాక సువాసనని కూడ చేర్చి నోరూరింప చేస్తాయి. పెరటిలో బద్దకించక కరివేపాకు మొక్కని నాటుకుంటే అవసరమైనప్పుడంతా తాజా కరివేపాకును వాడే భాగ్యానికి నోచుకోవచ్చు. ఇటీవల అటవీశాఖ వారు కూడ ఈ మొక్కలను సరఫరా చేయుచున్నారు. ఇది కొండ చరియలలోను, కొండ దిగువ భాగంలోను, హిమాలయములలోను, కాశ్మీరు నుండి కుమ్‌యోన్‌ వరకు వ్యాపించి ఉంది.

కరివేపాకు శాస్త్రీయ నామము 'మురయ కొనిగి'. నిమ్మ, చీనీ జాతులకు చెందిన 'రూటేసి' కుటుంబమునకు ఇది కూడా చేరినది. కరివేపాకు చెట్టు షుమారు 6 మీ|| ఎత్తు పెరిగి చూచేందుకు అందంగా, గుబురుగా, దృఢమైన సన్నని కాండంతో, శాఖలతో అలరారుతూ వుంటుంది. పుష్పములు శిఖర స్ధానంలో తెలుపులో, సువాసనాభరితమై వుంటాయి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - రోబో

దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించాడు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటున్నారు. 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ తొలి "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసినా అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేశారు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఒక 'మరపక్షి' ని తయారుచేసి (ఆవిరి ద్వారా) ఎగరేశాడట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్‌లో కూడా రోబో ప్రత్యక్షమయింది. మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించాడు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్ అట. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది. మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు (బాంబ్ డిప్యూజింగ్), లేదంటే మనిషితో అవసరం లేని పనులకు (ఫ్యాక్టరీల్లో కార్మికుల్లా) రోబోలను ఉపయోగించసాగారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చాయి. [ఇంకా... ]

వంటలు - స్ట్రాబెర్రీ డిలైట్

కావలసిన వస్తువులు:
ప్లెయిన్‌ కేక్‌ - ఒకటి.
స్ట్రాబెర్రీలు - గుప్పెడు (నిలువుగా రెండుముక్కల్లా కోసుకోవాలి).
వెనీలా ఐస్‌క్రీం - 500 గ్రాములు.
జిలిటెన్‌ - రెండు టీ స్పూన్లు (గోరువెచ్చని నీటిలో కలపాలి).
పాలు - చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి).

తయారు చేసే విధానం:
ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసిన స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్, పాలు, జిలిటెన్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - ఇందిరాగాంధీ

పేరు : ఇందిరాగాంధీ.
తండ్రి పేరు : జవహర్‌లాల్ నెహ్రూ.
తల్లి పేరు : కమలానెహ్రూ.
పుట్టిన తేది : 19-11-1917.
పుట్టిన ప్రదేశం : అలహాబాద్‌.
గొప్పదనం : "స్త్రీ బలహీనురాలు" అన్నది తప్పని నిరూపించి, స్త్రీ శక్తికి, మనోస్థైర్యానికి ప్రతీకగా నిలిచిన ఇందిరా గాంధీ ఆదర్శనీయురాలు.
స్వర్గస్తుడైన తేది : 1984.

"భారతదేశంలో మహిళలకు అత్యంత గౌరవిస్తారు. స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తారు. స్త్రీ సృష్టికి, శక్తికి మూలం. "ఇందిరాగాంధీ అంటే ఒక శక్తి" ఆడది (క్షమించాలి. . . ) పరిపాలన ఏం చేయగలదు!" అంటూ పెదవి విరిచిన పురుషపుంగవులు దిగ్భ్రాంతి చెందేలా అత్యంత సమర్ధవంతంగా సుధీర్ఘ కాలంపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, శత్రుభీకరంగా దేశాన్ని తీర్చిదిద్దటానికి ప్రయత్నించారు. [ఇంకా... ]

పండుగలు - రథసప్తమి

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు. [ఇంకా... ]

Saturday, December 27

జానపద గీతాలు - గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

గుత్తొంకాయ్ కూరోయ్ బావా!
కోరివండినానోయ్ బావా!
కూర లోపల నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా

కోరికతో తినవోయ్ బావా!

తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగ వండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్ బావా!

బాగని మెచ్చాలోయ్ బావా! [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - బైక్, స్కూటర్, మోపెడ్

కొత్త ఏడాదిలో బైకు భలే ఉంటుంది కదూ. నలుగుర్నీ సలహా అడిగి చదివి మంచి కంపెనీ, అంతకంటే మంచి మోడల్ ఎన్నుకోగానే సరిపోదు మంచి కండీషన్ లో ఉన్న బండిని ఎంచుకోవటంలోనే ఉంది కిటుకంతా.

ఏ కంపెనీ అయినా తాము తయారు చేసే బైకులను మంచి కండిషన్ లో అందించాలనే చూస్తుంది అయినప్ప టికీ కొన్నిసార్లు తెలియకుండానే చిన్న చిన్న లోపాలు కనిపించవచ్చు. వీటిలో ఎక్కువ శాతం రవాణా సందర్భంగా చోటుచేసుకునేవే. అరుదుగా తయారీలోనూ లోపాలు కనిపించవచ్చు. అలాగని కొత్త బండి మొత్తాన్ని విడదీసి ప్రతి భాగాన్నీ పరిశీలించటం సాధ్యం కాదు. కాని, బయటకు కనిపించే భాగాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించటం ఇబ్బందేమీ ఉండదు.

1. బైకును ఎంచుకునేటప్పుడు ముందుగా చూడాల్సింది పెట్రోలు ట్యాంకు. దానిమీద ఎలాంటి సొట్టలు/గీతలు ఉండకూడదు. వెలుతురు బాగా ఉన్నచోట, సాధ్యమైతే ఎండలో బండిని పరిశీలించండి. చేతివేళ్లతో ట్యాంకు మీద సున్నితంగా అటూ ఇటూ స్పృశించండి. గరుకుగా అనిపించినా. సొట్ట పడినట్లు అనిపించినా ఇంకో బైకును చూడండి.

2. రవాణాలో ఎక్కువగా దెబ్బతినేవి క్లచ్, ముందు బ్రేకు లీవర్లు. చివర్లలో విరిగితే సులభంగానే గుర్తించవచ్చు. హ్యండిల్ తో కలిసేచోట రబ్బరు కప్పులుంటాయి. కాబట్టి, ఇక్కడ విరిగితే కనిపెట్టడం కొంత కష్టం. వాటిని జరిపి ఎక్కడైనా తేడాలున్నాయేమో చూడాలి. [ఇంకా... ]

వంటలు - మామిడి రైతా

కావలసిన వస్తువులు:

గట్టి పెరుగు - రెండు కప్పులు.
ఆవాల పొడి - అర టీ స్పూను.
కారం - పావు టీ స్పూను.
ఉప్పు - తగినంత.
మామిడి ముక్కలు - అర కప్పు.

తయారు చేసే విధానం :

పెరుగు చిలక్కొట్టి (నీళ్ళు కలపకుండా)అన్ని పొడులూ కలిపాక. చివర్లో మామిడి ముక్కలు వేసి పెట్టండి. కావల్సి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా చేసుకుని తినొచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - బొమ్మల మాయ

ఎంతమంది ఆడవచ్చు : నలుగురు.
కావలసిన వస్తువులు : ఒకేలా ఉండే రెండు బొమ్మల పేపర్స్.
ఆడే స్థలం : ఇంట్లో.

నాలుగు రంగుల బొమ్మలను ముక్కలుగా కట్ చేసి కుప్పగా వేయాలి. అవి సరిగ్గా జతచేయాలి. ఎవరు ముందుగా జత చేయగలరో వారు విజేత. అలాగే ఒక బొమ్మ అనుబంధంగా నాలుగు చిన్న బొమ్మలను ఉంచి వాటిని చిన్న భాగాలుగా వేరు చేయాలి. పెద్ద బొమ్మ అలాగే వుంటుంది. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీకృష్ణాయ నమః
2. ఓం కమలానాథాయ నమః
3. ఓం వాసుదేవాయ నమః
4. ఓం సనాతనాయ నమః
5. ఓం వసుదేవాత్మజాయ నమః
6. ఓం పుణ్యాయ నమః
7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
9. ఓం యశోదావత్సలాయ నమః
10. ఓం హరయే నమః [ఇంకా... ]

Wednesday, December 24

వ్యాయామ శిక్షణ - ఊగండి... తగ్గండి

ఉయ్యాల ఊగడాన్ని పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఎంతసేపు ఊగినా బోర్ అనేది ఉండదు వాళ్లకి. ఇంకా పైకి ఊపు అంటూ అమ్మని అడుగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. ఉయ్యాల ఊగడం పసిపిల్లల ఆటగానే ఇన్నాళ్లూ భావించాం. కాని రోజూ ఉయ్యాల ఊగడం శరీర ఫిట్ నెస్ కి ఎక్సర్ సైజుగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఉయ్యాల ఊగడం పసిపిల్లల ఆట అనే అభిప్రాయానికి కాలం చెల్లింది. ఇది పెద్దలకు, పిన్నలకూ కూడా మంచి వ్యాయామం కాగలదని ఫిట్ నెస్ నిపుణులు అంటున్నారు. ఊయలను ఊబకాయ సమస్యకు పరిష్కార మార్గంగా పేరొంటున్నారు. అరగంటసేపు ఉయ్యాలలో ఊగుతూ, వంగుతూ శరీరానికి వ్యాయామం ఇస్తే కొన్ని వారాలకే ఆరోగ్యకరంగా, ఉత్సాహంగా, తేలిగ్గా తయారవుతుందిట. [ఇంకా... ]

సాహిత్యం - సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్ చిరస్మరణీయుడు. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.డేవిడ్ బ్రౌన్, ఫ్రాన్సిస్ కాలేల ద్వితీయ కుమారుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్) 1817లో చెన్నపట్నంలోని సెంట్ జార్జ్ కోట కాలేజిలో సివిల్ సెర్వంట్ విద్యార్ధిగా చేరాడు. తెలుగు మరియు మరాఠీ ప్రాంతీయ భాషలను ఎంచుకొని విద్యాభాసం చేశాడు. వెలగపూడి కోదండరామయ్య గారు బ్రౌన్‌కు తెలుగులో అక్షరాభ్యాసం చేయించి, తెలుగు రాయడం, చదవడం నేర్పించారు. బ్రౌన్ మరాఠీ కంటే తెలుగుపట్లే ఎక్కువ మక్కువ చూపేవాడు. 1823లో ఆబే దుబాయ్ రచించిన "హిందువుల ఆచారాలు" అనే గ్రంధాన్ని బ్రౌన్ చదివి అనేక విజ్ఞానం సంపాదించాడు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - అందాన్ని పెంచే సిందూరం

సాధారణంగా మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించేది నుదుటి మీద వుండే సిందూరమే. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక, నుదుటి మీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏవిధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా వుంటుందో తెలుసుకొని ఆవిధంగా పెట్టుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

1. శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి.

2. నుదురు చిన్నగా వుంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకోవాలి.
3. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - అమరావతి

గుంటూరు నుండి 27 కి. మీ వున్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూవుంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలయిన అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది. పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి. [ఇంకా... ]

నీతి కథలు - బాలుడు - తోటకూర

ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి, సురేష్ అనే కొడుకు ఉన్నాడు. అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె! అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. [ఇంకా... ]

Tuesday, December 23

ముఖ్యమైన ఘట్టాలు - సీమంతము

స్త్రీకి ప్రధమ గర్భమందు 4,6,8 నెలలలో ఏ నెలయందైనను భర్త శ్రీమంతమను సంస్కారము చేయవలెను. మరియు 8వ నెలలో విష్ణు దేవతా పూజ చేయవలెను. (ముహూర్త దర్పణం).

ఉపయుక్త తిధి, వారదులు:
తిథులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పూర్ణమి.
వారములు: సోమ, బుధ, గురు, శుక్ర వారములు.
నక్షత్రములు: రోహిణి, మృగశిర, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి.
లగ్నములు: మేష, వృషభ, మిధున, తుల, ధనస్సు, కుంభ, మీనములలో అష్టమశుద్ది గలవి.

లగ్నమునకు 5,8,12 స్థానములలో రవి, కుజ, శని, రాహు, కేతు క్షీణచంద్రుడు లేకుండగాను, లగ్నమున చంద్రుడు లేకుండగాను, నవమిశుద్దిగల లగ్నమందు పుంసవన, సీమంతములు చేయవలెను. [ఇంకా... ]

వంటలు - జెల్లీ వైట్ జ్యూస్

కావలసిన వస్తువులు:

లేత ముంజలు - 8.
సగ్గుబియ్యం - 1 కప్పు.
వైట్ కలకండ - 1/2 కప్పు.
తెల్ల ద్రాక్షలు - 1 కప్పు.
కిస్ మిస్ - 1 కప్పు.

తయారు చేసే విధానం:

ముందుగా సగ్గు బియ్యం కడిగి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించి చల్లార్చాలి. తరువాత ముంజలు పైతొక్క తీసి వాటితో పాటు ద్రాక్షపళ్ళు కలిపి మిక్సీలో వేసి తిప్పి తీసి అందులో కలకండ, ఉడికించిన సగ్గుబియ్యం, ఐస్ వేసుకొని బాగా కలిపిన తర్వాత తాగాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిలుకల్లు చిలుకల్లు...

చిలుకల్లు చిలుకల్లు అందురేకాని
చిలుకలను రూపేమి పలుకులేగాని
హంసల్లు హంసల్లు అందురేగాని
హంసలకు రూపేమి ఆటలేగాని

పావురాలు పావురాలు అందురేగాని
పావురాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేగాని
కోయిల్లకు రూపేమి ఘోషలేకాని [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - ఉదయపు అల్పాహారంతో అధిక ఆరోగ్యం

కారణమేదైనా సరే పొద్దుటిపూట అల్పాహారం తినడం మానేసేవారు చాలామందే ఉంటారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గృహిణుల గురించే. ఉదయాన్నే ఇంటిపనుల్లో తీరికలేకుండా ఉండడం, ఇంట్లోనే ఉంటాంకదా పొద్దుట పూట తినడం దేనికి అని వీరు పొద్దున తినడం మానేస్తుంటారు. పిల్లలు స్కూలు టైమవుతుందని, ఆకలి వేయడంలేదని టిఫిన్ తినడం మానేస్తుంటారు. ఇక ఆఫీసులకు వెళ్ళేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారూ ఈ విషయంలో ముందు వరుసలోనే ఉంటారు. అయితే పొద్దుట పూట అల్పాహారాన్ని మానేయడం వల్ల చాలా నష్టమే జరుగుతుందంటున్నారు పరిశోధకులు. ఆ నష్టమేటిటో తెలుసుకొని జాగ్రత్తగా ఉందామా.

రోజు మొత్తంలో ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఆకలి వేయకపోయినా శరీరం తనకు కావల్సిన శక్తి అవసరం గురించి ఏదో ఒక రూపంలో సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది. [ఇంకా... ]

జానపద కళారూపాలు - కురవంజి

మన ప్రాచీన కళారూపాలలో చాలా ప్రాచీనమైనది కురవంజి అని కొందరి అభిప్రాయం. తెలుగు కావ్యాలలో కురవంజి ప్రస్తావన చాలా చోట్లే అగుపిస్తుంది. కొందరు కొరవంజి అనీ, కురవంజి అనీ పిలవడమూ కద్దు. ఇంకా పరిశోధకుల దృష్టి నుంచి ఆలోచిస్తే కొరవంజి పరిణామమే యక్షగానం అనీ చెప్పకపోలేదు. కురవంజి విశేషాలను గురించిన విషయ సేకరణలో కురవంజి అంటే కొరవజాతి స్త్రీ అని, ఎరుకలు చేసే నాట్య విశేషమనీ చెప్పబడింది. పదహారవ శతాబ్ధిలోనే కురవంజి నృత్య విశేషం ఉందనీ, అప్పటికే అది చాలా ప్రాచీనమైనదనీ అంటున్నారు.

కురవంజి అనేది ఒక నాట్య విశేషానికి చెందిన అడుగు (లయ). ఈ నాట్యాన్ని ఆదవులలో నివశించే కురవలు అనే జాతి ప్రజలు ప్రదర్శిస్తారు కాబట్టి దానిని "కురవంజి" అన్నారు. ఈ కళారూపం అటవికులది.వీళ్ళు అడవి జంతువుల చర్మాలనీ, ఈకలనీ, పులి గోళ్ళూ, ఎలుగుబంటి వెంట్రుకలు మొదలైన వాటిని ధరించి నృత్యాలు చేస్తారు. పుణ్య క్షేత్రాల్లో యాత్రికుల వినోదార్ధం క్షేత్ర మహత్యాల గురించి కథలల్లి ప్రదర్శించేవారు. [ఇంకా... ]

Monday, December 22

మీకు తెలుసా - కేలొరీ అంటే ఏమిటి?

ఉష్ణశక్తిని కొలువడానికి కేలొరీలో కొలుస్తాం. ఉష్ణశక్తి యొక్క ప్రమాణాలు "కేలొరీ" అంటారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ(సెల్షియస్)కు పెంచడానికి అవసరమైన ఉష్ణమును "కేలొరీ" అంటారు. దీనినే " గ్రామ్‌కేలొరీ" అని పిలుస్తారు. ఇలాగే ఒక కిలోగ్రాం నీటి ఉష్ణోగ్రతను ఒక సెంటిగ్రేడ్ డిగ్రీకి పెంచడానికి కావలసిన ఉష్ణమును కిలోకెలోరీ లేదా పెద్ద కేలొరీగా పిలుస్తారు.

మనం తీసుకునే ఆహర పదార్ధాలు జీర్ణమయ్యేటప్పుడు కలిగే ఉష్ణమును ఈ కిలోకేలొరీలో కొలుస్తాం. మనం ఆహరమును జీర్ణం చేసుకునేటప్పుడు ఉష్ణశక్తి పుడుతుంది. ఉదాహరణకు ఒక గ్రామ్ ప్రోటీను నుంచి నాలుగు కేలొరీలు, ఒక గ్రామ్ క్రొవ్వు నుంచి తొమ్మిది కేలొరీలు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ కేలొరీల అవశ్యకత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుంటుంది. అంటే వారి వారి బరువు, వారు చేసేపనులు, వారివారి వయస్సుల బట్టి ఆధారపడివుంటుంది అని చెప్పవచ్చు. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - ఫర్నీచర్

ఇల్లు అందంగా పెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కాని అస్తమానం కొత్తవి కొనాలంటే సాధ్యం కాదు కదా. చిన్న చిన్న వస్తువులు కొని ఇంటికి డిఫరెంట్ లుక్ తెచ్చుకోవడం బెస్ట్.

ఆ ఆసక్తి ఉన్నవారికి కొన్ని సూచనలు:

ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఫర్నీచర్ రిటైలర్‌లకి ఉండే అవుట్‌లెట్‌లకు వీలున్నప్పుడల్లా వెళ్తుండండి. మీకు నచ్చిన ఫర్నీచర్ దొరికే అవకాశం ఉంది. నెట్ చూస్తుండండి. నెట్‌లో బొమ్మలతో డిస్‌ప్లే చూస్తారు కాబట్టి మీ ఇంట్లో ఆ వస్తువులను పెడితే ఎలా ఉంటుందో ఐడియా వస్తుంది. దీనివల్ల షాపుల్లోకి వెళ్లి గంటలు గంటలు ఈ టేబుల్‌ను ఇంట్లో హాల్లో పెడితే ఎలా ఉంటుందని ఊహించుకునే పని తప్పుతుంది. ఒక షాపులో నచ్చకపోతే మరో షాపుకి తిరుగుతూ సమయం వృధా చేయకుండా ఉండొచ్చు. ఒకసారి మీకు ఎలాంటివి నచ్చుతాయనే విషయంపై స్పష్టమైన అవగాహన వస్తే షాపింగ్ చేయడం సులభమవుతుంది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - జగదీష్ చంద్రబోస్

పేరు : జగదీష్ చంద్రబోస్.
పుట్టిన తేది : 30-11-1858.
పుట్టిన ప్రదేశం : ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వున్న మైమన్ సింగ్‌లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : కలకత్తా , కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదివాడు.
చదువు : బి.యస్సీ, వృక్షశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు.
గొప్పదనం : మనుషుల్లాగే చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి హాని కలిగినప్పుడు అవి చింతిస్తాయని, రోదిస్తాయని ఆయన తెలుసుకున్నాడు.
స్వర్గస్థుడైన తేది : 23-11-1937.

మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్ జగదీశ్ చంద్రబోస్. ఈయన వాస్తవానికి భౌతిక, రసాయనిక శాస్త్రాలను చదువుకున్నారు. అయినప్పటికీ వృక్షశాస్త్రంలో మైలు రాయిలాంటి పరిశోధనను ఆవిష్కరింపజేశాడు. [ఇంకా... ]

కథలు - ఆ మూల గదిలో

పెళ్ళికూతుర్ని ముస్తాబు చేస్తున్న ఆ ఈడు అమ్మాయిలు అతన్ని చూసి అవాక్కయిపోయారు. కాళ్ళకు పారాణి పెడుతున్న పావని పెరట్లోని పెసర పుణుకులు గుర్తుకు వచ్చాయంటూ నెమ్మదిగా జారుకుంది. అక్కడి నుండి. జడలో మల్లెల్ని పేర్చి అందాల్ని అమర్చుతూన్న మానస పెళ్ళిపందిరిలో పన్నీటి బుడ్డి మరచిపోయానంటూ పరుగులు తీసింది.

సిగ్గులమొగ్గల్ని మోస్తున్న నందినికి విషయం అర్థం కాలేదు. అసలే పెళ్ళికూతురేమో అందాలు వంటిమీద ఆభరణాల్లాగే బరువెక్కి ఉన్నాయి. 'ముఖానికి సగం పూర్తి అయిన అలంకారాలు ఇక చాలులే ఓపలేకున్నాను' అంటున్నాయి. పరుచుకున్న పరువాలు పట్టు తప్పుతున్నాయి.

నందినికి అదోలా ఉంది. తడబాటుతనం తన్నుకొస్తోంది. తడారిన పెదాలు తీపిగా వణుకుతున్నాయి. పైట పట్టు తప్పి జారి స్థానభ్రంశం చెందుతోంది. ఇక ఆగు ముహూర్తానికి మూడు గంటలేగా అని సర్ది చెప్పబోతే, కదలలేని కాలం విరహగీతాన్ని ఆలపిస్తోంది. తనకు తానుగా తీపి ఊహలతో తపించిపోతోంది నందిని. స్థానభ్రంశం చెందుతోంది. [ఇంకా... ]

పుణ్యక్షేత్రాలు - హోలి

ప్రతి సంవత్సరం యావద్భారత దేశంలో "ఫాల్గుణ మాసం పూర్ణిమ" తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు "హొలిక" అనే రాక్షసిని చంపిన దినంగా ఈ "హొలి" పండుగ చేసుకుంటారట. దీనినే ఇంకా కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. "హొలి" అంటే ముందుగా అందరికి రంగులే గుర్తుకు వస్తాయి.

ఈ హొలి పండుగ గూర్చి విభిన్నమైన గాథలు కనిపిస్తున్నాయి. "శ్రీ బలరామ కృష్ణుని" ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రవచనం. అందువల్ల బెంగాలు రాష్ట్రమందు ఈ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలోవేసి ఊపుచూ "డోలికోత్సవాన్ని" జరుపుకుంటారు. [ఇంకా... ]

Friday, December 19

పిల్లల ఆటలు - సైగల అర్థం పోటీ

ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయటగాని
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు
ఆటగాళ్ళవయస్సు : 6 నుండి 10 సంవత్సరాల లోపు

లీడర్ ఆటగాళ్ళనందరినీ కూర్చోబెట్టి అందరికీ పేపరు, పెన్సిలు ఇవ్వాలి. తాను పది రకాలైన సైగలను చేసి చూపించాలి. ప్రతి సైగను చేసాక 20సెకన్లు ఆగి రెండవ సైగను చేయాలి. [ఇంకా... ]

వంటలు - కందులతో కిచిడీలు

కావలసిన వస్తువులు:
బాస్మతి లేక సోనా మసూరు బియ్యం - రెండు కప్పులు.
పచ్చికందిగింజలు - ఒక కప్పు.
టమోటాలు - రెండు.
ఆలుగడ్డ - ఒకటి.
పచ్చిమిరపకాయలు - ఆరు.
ఉల్లిపాయ - ఒకటి.
షాజీరా, జీలకర్ర - అర టీ స్పూను.
పలావు ఆకులు - రెండు.
దాల్చిన చెక్క - ఒకటి.
కరివేపాకు - రెండు రెబ్బలు.
పసుపు - పావు టీ స్పూను.
నెయ్యి లేక డాల్డా - పావు కప్పు.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :
ముందుగా బియ్యాన్ని రెండుసార్లు కడిగి నాలుగు కప్పులు నీరుపోసి ఇరవై నిముషాలు నాననివ్వాలి. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ తులసి మాత స్తోత్రము

1. యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాహ,

యదగ్రే సర్వవేదాశ్చ తులసి ! త్వా నమామ్యహం

2. నమస్తులసి ! కళ్యాణీ ! నమో విష్ణుప్రియే ! శుభే !

నమో మోక్షప్రదే ! నమహ్ సంపత్ర్పదాయిని ! [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - కర్పూరం

కర్పూరం గొప్పేంటి? కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా!

కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. [ఇంకా... ]

జానపద గీతాలు - జుంకాలు కావలెనా

జుంకాలు కావలెనా గంటీలు కావలెనా
మరిఏమికావలెనా మరదలు నరసమ్మ నీకు
జుంకాలు వలదురో గంటీలు వలదురో
నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ
బాడీలుకావలెనా జాకెట్లుకావలెనా
మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు
బాడీలు వలదురో జాకెట్లు వలదురో
నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ
సీరెలు కావలెనా లంగాలు కావలెనా
మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు [ఇంకా... ]

Thursday, December 18

భరతమాత బిడ్డలు - జవహర్ లాల్ నెహ్రూ

పేరు : జవహర్ లాల్ నెహ్రూ.
తండ్రి పేరు : మోతీలాల్ నెహ్రూ.
తల్లి పేరు : శ్రీమతి స్వరూప రాణి.
పుట్టిన తేది : 14-11-1889.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండు, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ.
చదువు : బారిష్టరు.
గొప్పదనం : శ్రీ పటేల్ సహాయంతో సంస్థానాధీశులను సంప్రదించి ఐక్యమత్యం గురించి ఉద్భోదించి వారి సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యేలాగా కృషి చేశాడు. రచించిన రచనలు 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', 'ప్రపంచ చరిత్ర సంగ్రహదర్శనాలు'.
స్వర్గస్తుడైన తేది : 27-5-1964.

జవహర్ లాల్ నెహ్రూ 1889వ సంవత్సరం నవంబరు 14న జన్మించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయరు. మామూలుగా మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి, సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ గారి బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. [ఇంకా... ]

సాహిత్యం - తెలుగు సాహితీవనంలో వనితలు

స్త్రీ అనగానే సమాజంలోని మనుషుల మనస్తత్వాలనుబట్టీ, కవుల ఊహా కల్పనలను అనుసరించి వాస్తవ అవాస్తవాలకు అనుగుణంగా ఆడదనీ, అబల అనీ కొన్ని సందర్భాలలో వక్కాణించగా మరి కొన్ని సందర్భాలలో ధైర్యసాహసాలకు చిరునామాగా, రాజ్యాలనేలు చక్రవర్తినిగా అభివర్ణించడం జరిగింది. శారీరకంగా ఆమె బలహీనురాలైనప్పటికీ మానసికంగా మహా బలవంతురాలు. ముఖ్యంగా సాహిత్యపరంగా తీసుకుంటే పూర్వకాలం నుంచీ నేటివరకూ ఎందరో సాహితీ రంగాన మల్లెలు పూయించారు. తమ రచనా సౌరభాలతో తెలుగు సాహితీ సీమను పరిమళింపజేశారు.

తెలుగులో కవిత్వం రాసిన తొలి తరం కవయిత్రులలో తాళ్ళపాక తిమ్మక్క, మొల్లలను ప్రధానంగా పేర్కొనవచ్చు. చాటువులు చెప్పిన వారిలో ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ ఉన్నారు. ఈ చాటువులను క్రీ.శ.1260 ప్రాంతాల్లో చెప్పారు. తాళ్ళపాక తిమ్మక్క 1460 ప్రాంతాలకు చెందినది. తరువాత క్రీ.శ. 1630 ప్రాంతాల్లో విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి పసుపులేటి రంగాజమ్మ రామాయణ, భాగవతాలకు సంగ్రహాలు వ్రాసింది. "ఉషా పరిణయం"ను ప్రత్యేక పద్య కావ్యంగా వ్రాసిన వాళ్ళలో మొదటి రచయిత్రి రంగాజమ్మ. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - ఎస్కలేటర్

మనం రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో, పెద్ద పెద్ద షాప్ లలో ఇంకా ఎన్నోచోట్ల మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేకమందికి మెట్లేక్కే శ్రమ తగ్గింది. ఎస్కలేటర్ అంటే ఏమిటి, ఎస్కలేటర్ ఎలా పని చేస్తుంది, దానిని ఎవరు కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ను మోసుకెళ్ళే 'ఎస్కలేటర్' ను 1881 లో కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వ్యక్తి పేరు 'జెస్ డబ్ల్యు రెనో'. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. [ఇంకా... ]

వంటలు - కైమా ప్‌ప్స్

కావలసిన వస్తువులు:
కైమా - పావు కిలో.
ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) - పావు కిలో.
పచ్చి మిర్చి (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి) - 5.
అల్లం - చిన్నముక్క.
వెల్లుల్లి రెబ్బలు - 4 (అల్లం, వెల్లుల్లిని ముద్దలా నూరుకోవాలి).
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
ధనియాల పొడి - 1 టీస్పూను.
పసుపు - చిటికెడు.
రం మసాల పొడి - అర టీస్పూను.
కోడి గుడ్లు - 3 (ఉడికించుకుని సగానికి కోసి ఉంచాలి).
గోధుమ పిండి - 200 గ్రాములు.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
కైమాకు కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు చేర్చి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గోధుమ, మైదా పిండికి కొద్దిగా ఉప్పు, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా కలిపి విడిగా పెట్టుకోవాలి. బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకును వేసి దోరగా వేయించాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - ప్రొద్దుతిరుగుడు పువ్వు

ప్రొద్దుతిరుగుడు పువ్వునే సూర్యకాంతి పువ్వు (Sun flower) అంటారు. ఇది బంతి జాతి మొక్కకు చెందినది. ఒకే మొక్కలో అనేక లాభాలనుకునేవారికి అన్నిటికంటే ప్రొద్దుతిరుగుడు పువ్వే మిక్కిలి ముఖ్యమైనది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయీ ప్రొద్దుతిరుగుడు పువ్వును చిహ్నంగా పెట్టుకున్నాడు. అందుకే అతను సన్ కింగ్ అని పిలువబడేవాడు. విన్సెంట్ వాన్ గోఘ్ అనే చిత్రకారుడు అనేక సూర్యకాంతి పువ్వుల చిత్రాలను రమణీయంగా రూపొందించాడు.

సోయా బీన్స్, వేరుశనగ ఆముదపు గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా నూనె గింజ. దీనిలో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు నూనె మరియు కాల్షియం లభిస్తాయి. దీని గింజనుంచి నూనె లభిస్తుంది. శాఖా సంబంధమైన ఈ వెజిటబుల్ నూనెను మార్గరిన్‌లో ఉపయోగిస్తారు. దీనిని దీసెల్ నూనెకు బదులుగా వాడతారు. [ఇంకా... ]

Wednesday, December 17

పండుగలు - ముక్కోటి ఏకాదశి

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||

అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.

ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. [ఇంకా... ]

నీతి కథలు - కోతి - దూలం

పిల్లలు శృతిమించిన అల్లరి చేస్తే దానిని పెద్దవాళ్ళు కోతి చేష్టలు అనటం కద్దు. ఈ కోతి చేష్టలు ఎవరికీ ఉపయోగపడవు సరికదా అప్పుడప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. పనికిరాని పనులు జోలికి పోవటం ఎంత ప్రమాదమో ఈ కధలో ఓ కోతి పాత్ర ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం 'అరిదుర్గ' అనే పట్టణంలో శుభదత్తుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు పట్టిందల్లా బంగారం అన్నట్లు వ్యాపారంలో బాగా కలిసి వచ్చి కొద్దికాలంలోనే ఆ పట్టణము మొత్తంలోకే ఏకైక ధనవంతుడు అయ్యాడు. శుభదత్తుడికి అన్నీ ఉన్నా ఒకే ఒక లోటు. అతని తరువాత తను సంపాదించిన ఆస్తిని అనుభవించటానికి సంతానం లేదు. ఒక రాత్రి శుభదత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివరున్న రామాలయాన్ని బాగుచేయిస్తే శుభదత్తుడికి సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు.

మర్నాడు శుభదత్తుడు ఆ రామాలయం బాగు చేయించటానికి కొంతమంది పనివాళ్ళను నియమించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - మేలి 'ముత్యం'లా

ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా ముత్యాలను చూడగానే మనసు పారేసుకుంటారు చాలామంది. వాటిని కొనే ముందు మన ముఖాకృతికి తగినట్లు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది కదా..

1. తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి.
2. కాస్త చామన్‌ఛాయగా ఉన్నవారికి లేత గోధుమ రంగు ముత్యాలు బాగుంటాయి.
3. పొడవాటి, సన్నని మెడ ఉన్నవారికి ముత్యాల చోకర్లు చక్కగా నప్పుతాయి.
4. మెడ అడ్డంగా, పొట్టిగా ఉన్నవారు కాస్త పొడుగ్గా ఉన్న ముత్యాలహారాలను ధరిస్తే అందంగా కనిపిస్తారు. [ఇంకా... ]

భక్తి గీతాలు - వలదననొరులకు

వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె

తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె

పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను [ఇంకా... ]

వ్యాయామ శిక్షణ - డైటింగ్

సరైన ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే డైటింగ్. డైటింగ్ కేవలం బరువు తగ్గించుకోవడానికి కాకుండా అనవసరమైన క్యాలరీలు శరీరంలో పేరుకుపోయి తద్వారా శరీర సహజక్రియలు సరిగా పనిచేయక ఆ ప్రభావం ఆరోగ్యం మీదా మీ రోజువారీ కార్యక్రమాల మీద పడకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. ఏ వయసులోనైన ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి దోహదం చేస్తుంది. డైటింగ్ చేస్తున్నవారు ఏఏ సమయాల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారపదార్థాలు నిషిద్దం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

ఉదయంపూట అల్పాహారం:
గోరువెచ్చటి పాలు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ.

స్నాక్స్ సమయంలో;
పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని. [ఇంకా... ]

Tuesday, December 16

తెలుగు బిడ్డలు - టంగుటూరి ప్రకాశం

పేరు : టంగుటూరి ప్రకాశం పంతులు.
తండ్రి పేరు : శ్రీ గోపాలకృష్ణయ్య.
తల్లి పేరు : శ్రీమతి సుబ్బమ్మ.
పుట్టిన తేది : 1872.
పుట్టిన ప్రదేశం : ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్.
చదువు : ప్లీడరు (న్యాయవాది).
గొప్పదనం : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికై పాటుపడినారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. స్వరాజ్య అనే పత్రికను స్థాపించాడు.
స్వర్గస్తుడైన తేది : 25-5-1957.

శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. చిన్నతనమంతా వల్లూరు లోనూ, నాయుడుపేట లోనూ గడిపిన ప్రకాశం చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడు. [ఇంకా... ]

శతకాలు - కుమారీ శతకము

శ్రీ భూ నీళా హైమవ
తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు న
త్సౌభాగ్యము నీ కొనcగcగ
లో భావించెదరు ధర్మలోల కుమారీ!

భావం: కుమారీ! మంచి నడవడిక కలిగిన, లక్ష్మీ, భూదేవి, నీళా, హైమావతి, భారతి, నీకు సకల శుభాలు కలిగిస్తారు. నిన్ను కాపాడుతారు.

చెప్పెడి బుద్ధులలోపలc
దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్
మొప్పొంది యిహపరంబులc
దప్పింతయు లేక మెలగcదగును కుమారీ!

భావం: నేను చెప్పే నీతులు సరిగా అనుసరించు. సర్వ ధర్మాలకు న్యాయం చేయి. ఇహపరాలలో నీతిగా జీవించు. [ఇంకా... ]

వంటలు - మినపట్టు

కావలసిన వస్తువులు:
మినపప్పు - అర కేజి.
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో.
ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం:
దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. [ఇంకా... ]

లాలి పాటలు - రామా లాలీ

రామా లాలీ మేఘశ్యామా లాలీ

తామరసనయన దశరథతనయా లాలీ ||రా||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ

బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||

అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ

ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా|| [ఇంకా... ]

జానపద కళారూపాలు - పగటి వేషాలు

సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా ఇవి దేశంలో ప్రచారం పొందాయి. వీటిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి పరిపాలకుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోనికి వచ్చాయని ప్రతీతి.

కృష్ణాజిల్లా కూచిపూడి పగటి వేషధారులకు నిలయం. నృత్యనాటకాలు ఆడేవారు నాట్య మేళములుగా ఏర్పడి తమకున్న కళా ఔన్నత్యంలో ప్రదర్శనలూ ఇస్తున్నారు. కూచిపూడివారిలో కొందరు సంవత్సరంలో కొన్ని నెలలు సంచార మేళములుగా ఏర్పడి ప్రజలలో విజ్ఞాన ప్రభోధం చేస్తూ - తద్వారా ఆనందాన్నీ, ఆలోచననూ కలిగిస్తుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచిపోకూడదు. కూచిపూడి - భాగవత కథా, ప్రదర్శనలకు ప్రత్యేకత అయితే, గడ్డిపాడు - పగటి వేషాలకు ప్రసిద్ది పొందింది. అసలు పగటి వేషాలకు ఒక విలువను చేకూర్చిన వారు గడ్డిపాడు వారే అనిపిస్తుంది. [ఇంకా... ]

Monday, December 15

మీకు తెలుసా - ఋణాల సేకరణ సంస్ధలు

1. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)

సిడ్బి (SIDBI) 1990వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. లఘు పరిశ్రమలకు, అవసరమయ్యే ఆర్ధిక మరియు ఆర్ధికేతర సదుపాయాలను అందించటానికి ఇది ముందుకొస్తుంది. లఘు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులను మార్కెటింగ్ చేయడం, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతవాసులు పెద్ద పట్టణాలకు వలసరవటాన్ని నిరోధిస్తుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్ ఆధునీకరణ, టెక్నాలజీ మెరుగుదల "సిడ్బి" ప్రధానంగా చేపడుతుంది. అనేక బ్యాంకుల ద్వారా చిన్నతరహా, గ్రామీణ పరిశ్రమలకు ఋణాలను అందిస్తుంది.

మరిన్ని వివరాలకు: SBI, 203, బాబూఖాన్ ఎస్టేట్స్, సెకండ్ ఫ్లోర్, బషీర్‌బాగ్, హైదరాబాద్ - 500 001. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - వాటర్ ఫిల్టర్

ఈ కాలంలో వచ్చే అనేక వ్యాధులకు ప్రధాన కారణం త్రాగేనీరు. నీటి ద్వారానే అనేక రకాల అంటు వ్యాధులు ప్రబలుతాయి. అందుకే మంచినీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడపడితే అక్కడ నీటిని త్రాగకూడదు. ఈ కాలంలో కాచి, ఫిల్టర్ చేసిన నీటినే త్రాగాలి. త్రాగే మంచినీరు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. తీసుకునే ఘన, ద్రవపదార్ధాలు ఏవయినా సరే శుభ్రంగా, ఆరోగ్యకరంగా, బలవర్ధకమయిన విటమిన్లు కలిగి ఉంటే చక్కటి ఆరోగ్యం కలిగివుంటాం. మనం త్రాగే ద్రవపదార్ధాలు నీరు, పాలు, పళ్ళరసాలు చాలా శుభ్రత కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్నిచ్చేవిగా ఉండాలి. ముఖ్యంగా మంచినీరు మన శరీర నిర్మాణంలో సుమారు 70 శాతం కలిగి ఉంటుంది. శరీరంలోని అనేక రుగ్మతలను పోగొట్టే మంచినీటి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. కాబట్టి మంచినీరు విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి. ఎల్లవేళలా క్రిమికీటకాలు లేని స్వచ్ఛమయిన నీటిని తాగాలి. శరీరంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లకి ప్రధాన కారణం కలుషిత నీరు త్రాగటమే. ఈ రోజుల్లో ప్రతివారు అన్ని విషయాల్లోనూ శుభ్రతకి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - జయప్రకాష్ నారాయణ్

పేరు : జయప్రకాష్ నారాయణ్ .
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : బీహరు రాష్ట్రంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : అమెరికా.
చదువు : ఎం. ఏ.
గొప్పదనం : "ధనికులు పేదవారు అనే భేధం ఉండకూడదు. మనమంతా భరతమాత బిడ్డలము. మనమంతా కలిసి స్వాతంత్ర్యం సంపాదించి, సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించుకొని, ఆర్ధిక వ్యత్యాసాలు నిర్మూలించి, నిరుద్యోగం, పేదరికం సమస్యలను పరిష్కరించి, మన జీవితాలకు ఒక సార్ధకత ఏర్పరచుకోవాలి" అనే దాని గురించి శ్రమించాడు.

ఈ విశాల భారతదేశం మనందరిదీ. ప్రతి పౌరుడు సమాన భాగస్వామి. మనమంతా ఒకే కుటుంబం సభ్యులం. సమతాభావంతో లోక కళ్యాణానికి పాటుపడాలి. అని ఎలుగెత్తి చాటిన దేశబంధువు, కర్తవ్య పరాయణుడు, రాజనీతిఙ్ఞుడు అయిన జయప్రకాశ్ నారాయణ్ ప్రపంచంలో విశిష్ట వ్యక్తిగా ప్రశంసలు పొందారు. 'ధనికులు, పేదవారు' అనే భేధం ఉండకూడదు. మనమంతా భరతమాత బిడ్డలము. [ఇంకా... ]

కథలు - అప్పగింత

గౌరీపూజ ఘనంగా చేయిస్తున్నారు పురోహితులు. వేడుకల ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. భజంత్రీలు సాంప్రదాయ స్వరాలకు కొంత ఆధునికత జోడించి వీనులవిందు చేస్తున్నారు. అంతా. . .అందరిలోనూ ఒక్కటే హడావిడి. ఆడపెళ్ళి వారితో మర్యాద పేరిట ఆతృత నెలకొని ఉంది. మగపెళ్ళివారికి దర్పం తాలూకు స్వాభిమానం, అందుకొనే మర్యాదలతో తలమునకలై కనిపిస్తున్నారు.

"పెళ్ళికొడుకు చినతాతగారికి ఉప్మా అందలేదట. వెంటనే చూడండర్రా" అక్కడ అందరిలోకి వయసులో పెద్దావిడ పెద్దగా అంటోంది.

"ఇచ్చాంలే అత్తా. మారువడ్డిస్తే తేడా చేసిందనుకో, అసలే ముసలిప్రాణి" ఉప్మా అందిస్తూన్న కుర్రాడు బదలు పలికాడు.

"టిపినీలు చేశారా? కాఫీలు త్రాగారా?" ఆడపిల్ల తాలూకు ఓ అల్లరిపిల్లాడు పెళ్ళివార్ని గుచ్చి గుచ్చి మరీ అడుగుతున్నాడు.

"తెగ సందడి చేస్తున్నావ్‌. పెళ్ళి సందడి సినిమా ఎన్నిసార్లు చూశావేమిటి?" మూడోమారు కాఫీ తాగుత్ను ఒకామె నిలదీసి అడుగుతోంది. [ఇంకా... ]

వేదాలు - చతుర్వేదాలు

హిందూధర్మమునకు వేదములే మూలము. వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటె ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపబడినవి.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండ యనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాది కర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.

ఒక్క పరబ్రహ్మమును తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపమును నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.

మంత్రదష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలుకారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పబడినవి. [ఇంకా... ]

Friday, December 12

పుణ్యక్షేత్రాలు - అన్నవరం

ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3 కి.మీ. దూరంలో పంపానదీ తీరంలో ఉన్న కొండ రత్నగిరి, ఇక్కడ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ ఆచరింపబడతాయి. కొండ క్రింది నుండి పైకి నేరుగా దేవస్థానం తరపున బస్సులున్నాయి. ఓపిక ఉంటే మెట్లెక్కి కూడా వెళ్ళ వచ్చును. క్రింది నుండి పైకి చేరటానికి నడిచి మెట్లెక్కి వెళితే సుమారు 20 నిమిషాలు పట్టవచ్చు. అంధ్రదేశం హైందవులు కుల విచక్షణ లేకుండా తమ ఇంట ఏ శుభకార్యము జరిగినా - వివాహం, గృహనిర్మాణం జరిగిన, గృహప్రవేశ మహొత్సవము లేక మరేదైన శుభ సందర్భాలన్నింటికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు. అది ఈ స్వామి వ్రతమే, అంటే తెలుగువారికి ఎంత ప్రియాతిప్రియమైన దేవుడో అర్థం చేసుకోవచ్చు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - నిలకడగా ఉండటమెలా?

పుస్తకం పట్టుకొన్నా ఏకాగ్రత కుదరటంలేదని, ఙ్ఞాపకశక్తి తక్కువనీ అనుకుంటారు. ఏకాగ్రత, ఙ్ఞాపకశక్తి అనేవి మనము సాధించుకోవలసిన అంశాలు. ఏకాగ్రత సాధిస్తే ఙ్ఞాపకశక్తి దానంతట అదే వస్తుంది. పుస్తకం పట్టుకొన్న వెంటనే ఆలోచనలు వస్తుంటే, ముందుగా ఆలోచనలు పరిశీలించండి. ఆ ఆలోచనలు ఎప్పుడు అవసరమా? అని మిమ్మలిని మీరు ప్రశ్నించుకోండి. ఆ తరహా ఆలోచనలకు ఇక స్వస్తి చెప్పాలి అని నిర్ణయించుకోండి. ఎప్పుడైతే ఏవో ఆలోచనలతో మీ మైండ్ డైవర్ట్ అవుతోందో అప్పుడు ఈ 'పరిశీలనా, ప్రశ్న, నిర్ణయం' అనేవి తీసుకోవడం ద్వారా ఏకాగ్రత అనేది సాధించగలుగుతాము. మొదట్లో ఈ ప్రాక్టీస్ వలన కొద్దిగ ఫలితం కనిపించినా, ప్రాక్టీస్ అడాప్ట్ చేసుకొనే కొద్దీ చక్కని ఫలితం వుంటుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - వేటగాళ్ళు - గడుసు జింకలు

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
ఆడే స్థలం : బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 7 సం|| నుండి 10 సం||ల లోపు
పోటీ సమయం : అరగంట

ఈ ఆటలో ముగ్గురు వేటగాళ్ళు రూపంలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని జింకల కోసం పరిగెట్టాలి. మిగతా పిల్లలంతా జింకలలాగా వేటగాళ్లకు దొరక్కుండా పరిగెత్తాలి. మరికొందరు వేటగాళ్ళు వెనక్కి చేరుకొని వీపుమీద చిన్నగా తడుతుండాలి. వేటగాళ్ళు వెనక్కి తిరిగి పట్టుకుంటే పట్టుబడ్డ వాళ్ళు వేటగాళ్ళు అవుతారు. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - కిడ్నీరాళ్లకు ఔషదం నారింజ రసం

కిడ్నీలో రాళ్లు బాధపెడుతున్నాయా? రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు... రాళ్ల బాధ మాయమవుతుంది. ఇటీవలి పరిశోధనల్లో తేలిన నిజం ఇది.

ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు. కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. కాని కొందరిలో ఇవి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. [ఇంకా... ]

వ్రతములు - శ్రీకృష్ణాష్టమి వ్రతకధ

బ్రహ్మలోకములో లోకోపకారం కోసం నారదుడు, కర్త అయిన బ్రహ్మదేవుని సందర్శించి, సర్వసౌభాగ్యములు ఇచ్చే శ్రీకృష్ణాష్టమి వ్రత ప్రాశస్త్యమును చెప్పమని కోరాడు. వత్సా నారదా! కలి కల్మషములను నశింపజేసే శక్తిగల శ్రీకృష్ణాష్టమి వ్రతం అశ్వమేధయాగం చేసినంత ఫలము కలుగును. అన్ని తీర్థముల యాత్ర చేసినంత సాఫల్యం పొందుతారు. కృష్ణ జయంతి రోజున పూజచేసి ఉపవాసం, ఓ జాగరణ చేయువారికి వేయి కపిల గోవులను, వెయ్యి ఏనుగులు ఇచ్చిన పుణ్యం,వెయ్యి బంగారు ఆభరణములు, కోటి వస్త్రదానముల ఫలం కలుగుతుంది.

అంబరీష, గాది, దర్మరాజు సత్యసంధులగు అనేకమంది రాజవర్యులు దేవకినందనుడగు శ్రీకృష్ణ భగవాసుని సంతృప్తి కోసం శ్రీకృష్ణజయంతి రోజున ఉపవసించి, సత్ఫలితములు పొంది, రాజ్యసంపదతో, శాశ్వగతిని పొందారు. వాలఖిల్యాదిమునులు వశీష్ఠదులు, గౌతముడు, గార్గుడు, పరుశురాముడు, వాల్మికిముని వీరంతా వ్రతమాచరుంచారు. [ఇంకా... ]

Wednesday, December 10

మీకు తెలుసా - వలస పక్షులు

నేస్తాలూ! మనం అప్పుడప్పుడు అమ్మానాన్నతో కలిసి బజారుకెళ్తుంటాం కదా. అక్కడ రకరకాల బొమ్మలు వున్న షాపు ఏదైనా కనిపిచిందనుకోండి. మనం ఆ బొమ్మల్నే చూస్తూ నిలబడిపోయారనుకోండి. తర్వాత చూస్తే పక్కన మీ వాళ్లు ఎవరూ లేరు. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడినుండి ఇంటికెలా వెళ్లాలో తెలిస్తే సరే. తెలియకపోతే చాలా భయమేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదూ. అవతల మీవాళ్ల పరిస్ధితీ అంతే. తప్పిపోయిన మీకోసం వాళ్లంతా వెతుకుతుంటారు. బజారుకెళ్లి ఒక్కళ్లమే తిరిగి రావడానికి మనం చాలా ప్రయాసపడతాం. మన వాళ్లనూ కంగారుపెడతాం. కానీ కేజీ బరువు కూడా లేని పక్షులకు ఇలాంటి బాధల్లేవు. అవి ఎవరి సాయం లేకుండానే దేశదేశాలు దాటి వెళ్తాయి. వెళ్లడమే కాదు. క్షేమంగా వెనక్కి తిరిగి వస్తాయి. మునుపు కట్టుకున్న గూటిలోనే కాపురం పెడతాయి. ఈ పక్షులు ఖండాంతరాల్లో పెట్టిన గుడ్ల నుండి బయటికొచ్చిన పిల్లలు అంతకు ముందెప్పుడూ చూడని తమ స్వస్ధలాలకు క్షేమంగా చేరతాయి. విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. వాతావరణ పరిస్ధితులు పక్షుల్ని వలస బాట పట్టించాయి. [ఇంకా... ]

వంటలు - పప్పు పులుసు

కావలసిన వస్తువులు:
కందిపప్పు - 100గ్రా.
చింతపండు - నిమ్మకాయంత.
ఎండుమిర్చి - 2.
పచ్చిమిర్చి - 6.
ఉల్లిపాయలు - 250గ్రా.
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం.
ఉప్పు, కారం - తగినంత.

తయారు చేసే విధానం :
చింతపండునానేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగాను, పచ్చిమిర్చి సన్నంగాను తరుక్కోవాలి. ఎండుమిర్చి ముక్కలుగాను తుంపుకోవాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - భారతీయ వీరులం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం

శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం

మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం [ఇంకా... ]

సూక్తులు - గాంధీజి హితోపదేశం

విద్యార్ధికి : తమ పోషణార్ధమే కాకుండా ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోడానికి జీవితంలో ఒక ముఖ్య ధ్యేయాన్ని ఏర్పరచుకోడానికి క్రమశిక్షణను పొంది అభ్యసించడమే ఒక విద్యార్ధి యొక్క, విద్యార్ధిని యొక్క ముఖ్య ధర్మం. చిన్ననాటి నుండే మంచి శీలాన్ని నిర్మించుకోవడం, ఆరోగ్యవంతమైన శరీరంతో మానసిక శక్తులను అభివృద్ధి చేసుకోవడం ప్రతి యువకుని మరియు యువతి ధర్మం. కాబట్టి శ్రద్ధగా అధ్యయనం చేస్తూ శరీర ఆరోగ్యాన్ని పదిలపరుచుకుంటూ మానసిక శక్తులను పెంచుకోవడమే విద్యార్ధుల ముఖ్య కర్తవ్యం. వీరు దేశానికి ఒక అపూర్వ సంపాగా ఉండాలేగానీ, భారంగా ఉండకూడదు. వీరు దేశానికి, తన్మూలంగా సమాజానికి చివరగా మానవజాతికి చేయవలసిన ధర్మం ఎంతో ఉంది. నిర్భయంగా, సాహసంతో, ఉత్సాహంతో జీవిత రంగంలో తగిన పాత్ర వహించి సాంఘికాభివృద్ధికి తోడ్పడాలి. దీనికోసం ఒక్కొక్కప్పుడు వారు తమ చదువులను కూడా త్యాగం చేయవలసివస్తుంది. [ఇంకా... ]

పండుగలు - గురుపౌర్ణమి

అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. [ఇంకా... ]

Monday, December 8

ఆహార పోషణ సూచిక - మంచి ఆహారం

ప్రాచీన కాలంలో మానవులు ఆచార వ్యవహారాలతోపాటు ఆహార నియమాలకూ అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాబట్టే వారు జీవించినంత కాలం ఎంతో ఉల్లాసంగా జీవించేవారు. వృద్ధాప్యం వారిని ఎంతమాత్రమూ బాధించేది కాదు. పైగా వృద్ధాప్యంలోనూ ఎంతో ఉత్సాహంగా పని చేసేవారు. ఆరోగ్యకరమైన పర్యావరణం అందుకు కొంత దోహదపడితే ఆహారం తీసుకునే విషయంలో వారు చూపించిన శ్రద్ధ కూడా వారికి ఎంతగానో దోహదపడింది. సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో కూడా వారు వారు ఏ ఆహారం దేహానికి ఎంతగా ఉపయోగపడుతుందో గ్రహించడం ఓ అద్భుతం. ఇది వారి మానసిక పరిణితికి అర్ధంపట్టడమే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తుంది. ఆరోగ్యంపట్ల ప్రత్యే శ్రద్ధ వహిస్తూ తేలిగ్గా ఉండే ఆహారం తీసుకునేవారు. తేలికపాటి ఆహారమంటే శాకాహారమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. శాకాహారానికి అత్యంత ప్రాధాన్యమివ్వడమే కాక వాటితో ఔషధాలు కూడా తయారుచేసేవారు. కాలంతోపాటు మానవుడి ప్రవృత్తిలో కూడా వస్తున్న మార్పులు వారు తీసుకునే ఆహారంలో కూడా నేడు కనిపిస్తోంది. [ఇంకా... ]

మీకు తెలుసా - టీ

మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రధమ స్థానంలో ఉంటుంది. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. అలసిన దేహానికి టీ ఎంత అవసరమో అలసిన మనసుకూ అది ఎంతో అవసరమన్ననతగా ప్రభావితం చేసే టీ సేవన మన దేశంలో రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది.సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మెంటల్ రిలీఫ్ కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విదుడల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి తగు మాత్రపు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - కారు

ఒకప్పటి విలాసం ఇప్పటి అవసరం, ఏమిటది? కారు అంటే మీరేమంటారు. నిజమే అంటారు. కొత్త కారు కొనడానికి అందరూ చాలా ఆనందిస్తారు. అయితే ఒక్క నిమిషం కారు కొనేముందు ఏం గమనించాలో చూద్దామా!

1. మీరు నెలకు కనీసం 1500 కిలోమీటర్లు తిరుగుతారా? అయితే డీజిల్ కారే మీకు సరైంది. పెట్రోలు కారు కన్నా ధర అధికంగా ఉన్నా ఎక్కువగా తిరిగేవారికి నిర్వహణ ఖర్చులు కలిసి రావాలంటే డీజిల్ కారే మంచిది.

2. కారు కొనబోయే ముందు మీ ప్రాంతంలోని డీలర్లలో ఎవరైనా ప్రత్యేక పథకాలు ప్రకటించారేమో కనుక్కోండి. దీనివల్ల మీకు కొన్ని వేల రూపాయల వరకు ప్రయోజనం కలగవచ్చు.

3. కార్ల గురించి, వాటి ధరల గురించి బాగా తెలిసిన వారిని మీ వెంట తీసుకెళ్లండి. బేరాలు ఆడగలిగిన వారైతే మంచిది. ముందుగానే మీరు మాట్లాడుకోండి. షోరూములకు వెళ్లిన తర్వాత ఇద్దరూ అదే మాట మీద ఉండాలి. [ఇంకా... ]

నీతి కథలు - ప్రాప్తం

రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా వుండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళి అయింది. భార్య అందగత్తె, చదువుకున్నది. తెలివితేటలుగలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒక రోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీ దేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను. ఈ రోజు ఎలా వుంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వి నా ముఖం చూసినవారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకి వెళ్ళాడు.

రామయ్యకి ముందు వెనుకా ఎవరూ లేరు. తల్లీ, తండ్రీ చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనుమడిలా వున్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తనుకూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానివేశాడు.
[ఇంకా... ]

పుణ్యక్షేత్రాలు - ఉడిపి

రజతపురమని పేరు 13వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ భగవానుని మందిరం ఉంది. ఇక్కడ మధ్వాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన బహు సుందర రూపమైన బాలకృష్ణ స్వామి విగ్రహము కలదు. స్వామి భక్తసులభుడై కనకదాసు అను భక్తుని కరుణించటానికి తూర్పు ముఖంగా ఉండే స్వామి పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కధ. స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో అక్కడ మండపం కట్టించి దానికి కనకదాస మండపం అని పేరు పెట్టారుట. స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు 8 మఠములు ఏర్పరిచారని అందులో ఉండే యతీశ్వరులే రెండు సంవత్సరాల కొకరుగా వంతుల వారీగా అర్చన చేయటానికి నియోగించబడినట్లుగా చెప్తారు. మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు. యాత్రికలు విశేషంగా పాల్గొంటారు. [ఇంకా... ]

Saturday, December 6

వ్యాయామ శిక్షణ - వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

అన్ని వ్యాయామల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంటసేపు నడవాలి.నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ వేసుకోవాలి. నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ (శరీరానికి చురుకు పుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం ) చేయాలి. ఆ తర్వాత వేగంగా నడవాలి. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరమూ, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం.

ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతున్నట్లు మూడు నిమిషాలు తర్వాత చదును ప్రాంతం మీద రెండు నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. [ఇంకా... ]

వంటలు - ఖాండ్వీ

కావలసిన వస్తువులు:
సెనగపిండి - 50 గ్రాములు.
మజ్జిగ - 3 కప్పులు.
పసుపు - 1 చిన్న చెంచా.
ఉప్పు - తగినంత.
నూనె - 40 గ్రాములు.
కొత్తిమీర - 1 పెద్ద చెంచా.
ఆవాలు - 1 చిన్న చెంచా.
కొబ్బరి తురుము - కొద్దిగా.

తయారు చేసే విధానం:
ఒక పళ్లానికి నూనె రాసి పెట్టాలి. ఒక పాత్రలో పిండి, మజ్జిగ, ఉప్పు, పసుపు కలిపి మిశ్రమం తయారు చేయాలి. దాన్ని పొయ్యి మీద పెట్టి కలపకుండా, పాత్రను కదిలిస్తూ ముద్ద అయ్యేవరకూ ఉడికించాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పళ్ళు కాయగూరల ప్రత్యేకత

అన్నిరకాల పళ్ళు, కాయగూరలు ఆహారంగా సేవించడం శ్రేయస్కరం. వీటియందుండే నారవంటి పదార్ధం - సెల్యులోజ్ పేగులను శుభ్ర్రపరచి సక్రమ మలవిసర్జనకు సహకరిస్తుంది. ఈ నార పేగులకు వ్యాకోచం పొందించి ప్రేగులలో తడిని సంరక్షిస్తుంది. కాకరకాయలు వంటి కొన్ని చేదు కాయగూరలు బలవర్ధకమైన టానిక్ లాగా ఉపకరించి పేగులలో ప్రవద్ధి పొందే నులిపురుగులను నశింపజేస్తుంది. జీర్ణ శక్తి సమృద్ధమై ఆకలి కలిగిస్తుంది. ఎండు ఖర్జూరపు కాయలలో విస్తారంగా లభించే సెల్యులోజ్, టేనిక్ ఆసిడ్ విరేచనకారి. ద్రాక్షపళ్ళు, అత్తిపళ్ళు కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది.

సిట్రిక్, మాలిక్, ఆసిటిక్, టేనిక్, టార్టారిక్, వంటి అమూల్యమైన ఆమ్లపదార్ధాలు పళ్ళలోను, కాయగూరలలోను ఎక్కువగా లభిస్తాయి. ఈ సహజ ఆమ్లాలు అన్నాశయంలో జీర్ణ శక్తిని అభవృద్ధి పరచి ఆకలిని పుట్టిస్తాయి. దీనివల్ల జీర్ణ కారకములగు ఎంజైములు ఉద్భవించి కాలేయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆమ్లాలు, లవణములు క్షారాలతో కలసి పిండి పదార్ధాలను సక్రమంగా జీర్ణిస్తాయి. కడుపు ఉబ్బరం, పులిత్రేపులు మొదలగునవి తగ్గుతాయి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఒంటి కాలి గుర్రం

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది.
ఆడే స్థలం : పచ్చిక మీద.
పోటి సమయం : ఎంతసేపయినా.
కావలసిన వస్తువులు : 16 రూపాయి నాణాలు.
ఆటగాళ్ల వయస్సు : 10 నుండి 12 సం|| రాల మధ్య .

పచ్చిక మీద మధ్య గుండ్రటి సర్కిల్ గీయాలి. ఆ గీత చుట్టూ ఆటగాళ్లు ఒక కాలి మీద నిలబడాలి. పైకి లేపిన కాలిని అదే చేత్తో పట్టుకోవాలి. అంటే ఎడమకాలు పైకి లేపితే ఎడమ చేతితో ఆ కాలిని పట్టుకోవాలి. [ఇంకా... ]

జానపద కళారూపాలు - గంగిరెద్దు మేళం

ప్రజలను వినోదపరచే కళారూపమిది. గంగిరెద్దులవారికి ఒక వూరనేది లేదు. ముఖ్యంగా సంక్రాంతి పందగ దినాల్లో వీరు వీధుల వెంట బయల్దేరతారు.

వయసులో ఉన్న కోడె గిత్తల్ని మచ్చిక చేసుకుని, తాము చెప్పినట్లు చేసేలా తయారుచేస్తారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించడం, మూడు కాళ్ళ మీద నిలబెట్టడం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే, కాలు పైకెత్తి సలాం చేయటం, ఇలా ఎన్నో ఫీట్లలో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాటిని వీధిలోకి తీసుకువస్తారు.

గంగిరెద్దులను అలంకరించడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వీటిని స్వంత బిడ్డల్లా చూసుకుంటారు. మూపురం నుండి తోక వరకు రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. కొమ్ములను రంగులతో అలంకరిస్తారు. [ఇంకా... ]

Friday, November 28

పండుగలు - దీపావళి

భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం, అట్లతద్ది, నాగుల చవితి వంటి పండుగలను స్త్రీలు ఇష్టపడితే, ఉగాది, వినాయక చవితి వంటివి ఎక్కువ శాతం పురుషులు ఇష్టపడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఐతే వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. [ఇంకా... ]

కవితలు - వట్టివేళ్ళు (నానీలు)

మెరిసే మెరుపు
చటుక్కున
ఆగిపోయింది
ఆ మెరుపు తీగను చూసి

తప్పు
వాడు చేశాడు
ఆమె పంచుకొంది
చివరకు ఆమే పతితా!

"ఓహో! ఉప్ప తొట్టెలు
వెలుగుతున్నాయి
చెత్తలేకున్నా
పసిగుడ్డులతో" [ఇంకా... ]

వంటలు - కొబ్బరి పూర్ణాలు

కావలసిన వస్తువులు:

కొబ్బరి కాయ - 1.
మైదా - 1/4 కిలో.
నూనె - 1/2 కిలో.
బెల్లం - 1/4 కిలో.
యాలుకలు - 5.

తయారు చేసే విధానం :

కొబ్బరికాయ కొట్టి తురుముకోవాలి. బెల్లం కూడా తురమాలి. ఇవి రెండూ కలిపి పొయ్యి మీద వేడి చేయాలి. ఇది ముద్దలాగ అవుతుంది. దీనిలో యాలుకల పొడి వేసి కలపాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఉయ్యాల...

లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటూయ్యాల

చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల

పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయ్యాల [ఇంకా... ]

మీకు తెలుసా - ప్రభుత్వ పధకాలు

1. ప్రధాని రోజ్‌గార్ యోజన:

ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఒక్కరు గానీ లేక 5గురు గానీ సమ్యుక్త భాగస్వామ్యంతో ఋణం పొందవచ్చు. ఎటువంటి హామీ అవసరం లేకుండా, రూ. 1.00లక్ష వరకు ఋణపరిమితి కల్గి ఉంటుంది. ఈ పధకం. మొత్తం ప్రాజెక్టు విలువలో అభ్యర్ధి / అభ్యర్ధిని 5% మార్జిన్ మనీని భరించాలి. 'మార్జిన్ మనీ' అంటే పరిశ్రమ ప్రారంభించే వ్యక్తి పెట్టే పెట్టుబడి. సదరు ప్రాజెక్టు విలువలో 15% రు. 7,500/- లు మించకుండా రాయితీ ఇవ్వబడుతుంది. బ్యాంకు నిర్దేశము మేరకు ఋణమును 3 నుండి 7 సంవత్సరాల కాల పరిమితిలో వాయిదాల పద్ధతిన చెల్లింపవచ్చును.

ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్‌గా ఇవ్వబడుతుంది. [ఇంకా... ]

Wednesday, November 26

వ్యక్తిత్వ వికాసం - సర్దుకుపోదాం

తమ దైనిక చర్యకు భంగం వాటిల్లితే కొంతమంది పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. తాము అనుకున్నట్లు లేదా తమ ప్రణాళిక ప్రకారం జీవితం ముందుకు సాగకపోతే కొంతమంది తమ సమతౌల్యాన్ని కోల్పోతారు. అయినా మన జీవితపు జయం - అపజయం ఈ రెండూ, మనం కఠినమైన దాన్ని మృదువుగా మార్చుకోగలిగి జీవితం నుండి ఉత్తమమైన దాన్ని ఎలా రాబట్టుకోగలమన్న విషయంపైనే ఆధారపడి వుంటాయి.

ఈ క్రింద ఇవ్వబడిన పరీక్షను చేయడానికి ప్రయత్నించండి. చివరిలో ఇవ్వబడిన జవాబులను చూసేందుకు ముందు "అవును", "కాదు" అని జవాబులు వ్రాసుకుంటూపొండి.

1. వాతావరణం ఉత్సాహవంతంగా లేనప్పుడు మీరు సంతోషంగా, ఆనందంగా ఉండగలరా?

2. కుటుంబ సభ్యులు - భార్యాపిల్లలు - బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తారా?

3. మీరు చిన్న పిల్లలతో, వయసు మళ్ళినవారితో, మీ తరం వారితో సర్దుకుపోగల సామర్ధ్యం కల అతిధులా? [ఇంకా... ]

పిల్లల పాటలు - చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు [ఇంకా... ]

వంటలు - కొబ్బరి ఉప్మా

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - 1.
రవ్వ - 1కిలో.
పచ్చిమిరపకాయలు - 6.
పల్లీలు - 1/2 కప్పు.
పచ్చి శనగపప్పు - 1/2 కప్పు.
తాలింపు గింజలు - 2 స్పూన్లు.
నూనె - 2 కప్పులు.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 4.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

రవ్వను దోరగా వేయించి ఉంచుకోవాలి. కొబ్బరి కోరి సిద్ధంచేసుకోవాలి. మూకుట్లో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరికోరు వేసి వేగనివ్వాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - క్రికెట్

క్రికెట్ ఆట నిబంధనలు

1. క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.

2. జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.

3. ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు.

4. ఇన్నింగ్స్ ప్రారంభమునకు ముందు రెండు చివర్లు, ఆట పర్యవేక్షణకు ఇద్దరూ 'అంపైర్లు' నియమించబడతారు. ఆట ప్రారంభ సమయానికి 30నిమిషాలు ముందుగా అంపైర్లు తమ స్థానాలలో ఉండాలి. ఆట పూర్తి అగు వరకు వారు తమ విధి నిర్వహణలో ఆట స్థలంలో ఉండాలి.

5. పరుగులు, బౌలింగ్ వివరములు, 'స్కోరు షీట్' లో రికార్డు చేయుడానికి 'స్కోరర్లు' నియమించబడతారు. వారు అంపైర్లు యిచ్చు తాఖీదులు (Instructions) , సంజ్ఞలు (Signals) ప్రకారం స్కోరు రికార్డు చేయాలి. అంపైర్ల సిగ్నల్స్ కు అందినట్లుగా జవాబు చెప్పవచ్చును. [ఇంకా... ]

సాహిత్యం - మన కవులు

కావ్యాలు తాము పుట్టిన కాలం యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. నాటి ఆచార వ్యవహారాల గురించి సమగ్రంగా వివరిస్తాయి. జాతి జీవన పురోగతికి ఇవి దిశా నిర్దేశాలు కావడంతో వాటిని ప్రజలు అనుసరిస్తుంటారు. ఆచారాలు ఎప్పటివైనా, వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకుంటూ, కొత్త పోకడలను రూపుదిద్దుకుంటూ సాగుతారు. ఇది చరిత్రలో ఓ అంతర్భాగం. ఆ చరిత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కావ్య పఠనం తప్పనిసరి. అందుకే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే కావ్యాల గురించి తెలుసుకున్నట్టే కావ్య రచనా కర్తలైన కవుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఆంధ్ర జాతికి అక్షర రూపంలో అంతులేని విజ్ఞానాన్ని అందించిన కవుల వివరాలను అందిస్తున్నాం.

తొలితరం కవులు :

నన్నయ:

నన్నయ 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య కాలమునాటి కవి. రాజమహేంద్రవరములోని రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు అతడు సంస్కృత భారతాన్ని తెనిగించ పూనుకున్నాడు. తెలుగు భాషలో కావ్య రచనకు తగిన భాష లేని ఆ కాలంలో నన్నయ ప్రజల వాడుకలో ఉన్న తెలుగు భాషా పదాలను సమీకరించి ఆ పదాలను కావ్య భాషకు సరిపోయేట్టు చేయడానికి "ఆంధ్ర శబ్ద చింతామణి" అను తెలుగు వ్యాకరణ గ్రంధాన్ని సంస్కృతంలో రచించాడు. కావ్య రచనకు కావలసిన భాషను తయారుచేసుకుని మహాభారత అనువాదానికి పూనుకున్నాడు. [ఇంకా... ]

Tuesday, November 25

జానపద గీతాలు - ఏడవకు ఏడవకు!

"ఏడవకు కుశలవుడ రామకుమార,
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;

ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;

పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,
భూదేవి అమ్మమ్మ వెచ్చె నేడవకు;

రావిరేకలు గొనుచు రత్నాలు గొనుచు,
లక్ష్మన్న పినతండ్రి వచ్చె నేడవకు; [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - జంషెడ్జీ టాటా

పేరు : జంషెడ్ జీ టాటా.
తండ్రి పేరు : నసెర్ వాంజీ టాటా.
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 3-3-1839.
పుట్టిన ప్రదేశం : గుజరాత్‌లోని బరోడా దగ్గరున్న నవ్‌సారి పట్టణంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : బొంబాయి.
చదువు : (తెలియదు)
గొప్పదనం : బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించి విదేశాల్లోని అనేక యూనివర్శిటీలలో "టాటా" అవార్డులను ప్రకటించాడు. ఆయన 1909 మే 19న స్వర్గస్థుడయ్యాడు.
స్వర్గస్తుడైన తేది : 19-5-1904.

భారతదేశం నేడు పారిశ్రామిక రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఇంకా వేగంగా మున్ముదుకు వెళ్తోంది. అయితే ఈ పురోభివృద్దికి కారకులైన మహనీయుల్ని మనం మరచిపోకూడదు. ఒకప్పుడు మన భారతదేశం ఆంగ్లేయుల దాస్యశృంఖాలలో వున్నప్పుడు మన దేశంలో లభించే సహజ జల, లోహ వనరులను వారు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ లాభాలు చేసుకుంటూ పారిశ్రామికంగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టక ఎంతో స్వార్ధంతో వ్యవహరించేవారు. [ఇంకా... ]

నీతి కథలు - దేశభక్తి

మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు. [ఇంకా... ]

వంటలు - కేసరి ఖీర్

కావలసిన వస్తువులు:

పాలు - 1 లీటరు.
బియ్యపు పిండి - 60 గ్రాములు.
నెయ్యి - 2 స్పూన్లు.
పంచదార - 125 గ్రాములు.
పాల మీగడ - 1/2 కప్పు.
బాదం పప్పులు - 20.
పిస్తా - 1 స్పూను.
కేసరి - 1 స్పూను.
వేడి పాలు - 1/2 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గంటసేపు బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి. కేసరి గుళికలు తీసుకొని 1/2 స్పూను వేడి పాలల్లో నానబెట్టాలి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - పట్టు బట్టల కధ

అందరం సుబ్బారావు కూతురు పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అంటే వేరే చెప్పాలా? ఆడవాళ్ళు అందరూ రంగురంగుల పట్టుచీరెలు కట్టుకుని వచ్చారు. అందరూ సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారు. పట్టుబట్టలకు మనదేశంలో వున్నంత గిరాకీ యింక ఏ దేశంలోనూ లేదు. అసలు ఈ పట్టు విశేషాలు ఏమిటో చూద్దాం.

పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి?

పట్టు దారంతో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.

పట్టు - పరిశ్రమగా ఎలా ఎదిగింది?

మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.

ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది. [ఇంకా... ]

Monday, November 24

మీకు తెలుసా - సైన్స్ సంగతులు

1. బొగ్గు: బొగ్గును చూర్ణం చేసి వేడి వేయటం ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌లో సల్ఫర్ ఏమీ ఉండనంత వరకూ సాంద్రీకరించి ద్రవస్థితికి తీసుకొస్తారు.

2. కార్బన్ ఉద్గారాలు: బొగ్గు, సహజవాయువు ఆధారంగా నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్బన్ ఉద్గారాలు ఉంటాయి. వీటిని భూగర్భంలోకి పంపే టెక్నాలజీలు అవసరం.

3. హైడ్రోజన్: ఫ్యూయల్‌సెల్‌లో హైడ్రోజన్‌ను ప్రాసెస్ చేసినప్పుడు విద్యుత్ విడుదలవుతుంది. నీరు ఉప ఉత్పత్తిగా వెలుపలికి వస్తుంది.

4. మీధేన్: చెత్తాచెదారం, కుళ్లిపోయిన పదార్ధాలు, మృతకళేబరాలు ఇటువంటి వాటితో నిండి ఉండే స్థలాల నుంచి మీధేన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని సేకరించే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత సమర్ధవంతంగా ఎలా వినియోగించుకోవాలన్నదే ఇప్పుడున్న ప్రశ్న.

5. గ్యాసు నుంచి ద్రవం: కార్బన్, హైడ్రోజన్ మూలకాలను సహజవాయువులో కలిపి కృత్రిమ పెట్రో సంబంధ ద్రవాలను తయారుచేస్తారు. డీజిల్ తయారయ్యేది ఈ పద్ధతిలోనే. [ఇంకా... ]

వంటలు - ఈస్టర్‌కు బన్నీకేక్

కావలసిన పదార్థాలు :

మైదాపిండి - 200 గ్రాములు.
పంచదారపొడి - 200 గ్రాములు.
నెయ్యి - 200 గ్రాములు.
గుడ్లు - నాలుగు.
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్.
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్.

ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు.

తయారీవిధానం:

మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - ఫోన్

ఈ రోజుల్లో ఫోను వాడకం తప్పనిసరి అయ్యింది. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి. సాధారణంగా ల్యాండ్ లైన్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఇది కాకుండా కొందరి ఇళ్ళల్లో పిల్లల దగ్గరకూడా ఫోన్లు ఉంటున్నాయి. ఒకే మనిషి రెండూ, మూడు ఫోన్లు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు. సెల్‌ఫోను కంపెనీలు రకరకాల ఆఫర్లలో ముందుకు వస్తున్నాయి. దీనితో కొందరు ఫోన్లని కూడా మార్చేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నారు. ఆఫర్ల ఆకర్షణకు లోనయి అవసరమున్నా లేకున్నా మరో సెల్ కొంటున్నవారి సంఖ్య బాగానే పెరుగుతుంది. దీనితో నెలవారీ ఫోను బిల్లులు బాగానే చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాల వారికి ఈ బిల్లులు కొన్నిసార్లు భారంగా తయారవుతున్నాయి. అలాగే ఫోన్లు కొనడంలో, వాడకంలో, నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నెల తిరిగేసరికి ఫోను బిల్లు తడిసి మోపెడు అవుతుంది. పర్సు బరువు తగ్గుతుంది.

1. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. బయట భర్త లేదా భార్య దగ్గర ఉన్న సెల్‌కు ఫోను చేస్తుంటారు. అయితే ల్యాండ్ లైన్ నుంచి సెల్‌ఫోనుకు ఫోను చేస్తే చార్జి ఎక్కువ పడుతుంది. కనుక సెల్ టు సెల్ చేయటమే ఉత్తమం. లేదంటే అవసరమున్నంతవరకే మాట్లాడాలి. మాట్లాడటం అయిన తరువాత నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అని భార్యాభర్తలు వంతులకు పోతే బిల్లు ఎక్కువవుతుంది. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పాలు

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ప్రతి ఇంటిలోనూ అత్యంతావశ్యకత కలిగిన ఏకైక ఆహారం పాలు. పాలతో అవసరం ఉండని మనిషి ఉండడు. పసి బిడ్డ మొదలు పండు ముదుసలి వరకు టీ, కాఫీ రూపాలలో పాలు తీసుకోకుండా ఉండరు. సగటు మానవుడికి అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు జన జీవన సామాన్యంలో ఓ అంతర్భాగం. ఇది ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం. పాలు సేవించకుండా జీవించే క్షీరదం ఉండదు. మానవుడు తీసుకునే మొట్టమొదటి ఆహారం పాలు. ఈ ఆహారం చివరి వరకు మానవుడిని అంటిపెట్టుకునే ఉంటుంది. అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఈ ఆహారం ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే పాలు నిత్య సంజీవని. ప్రకృతిలో లభించే ఉత్కృష్టమైన ఆహారం పాలు. [ఇంకా... ]

వ్రతములు - పోలి స్వర్గమనకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. [ఇంకా... ]

Thursday, November 20

వ్యక్తిత్వ వికాసం - మనసారా నవ్వండి

మానవ జీవితాన్ని నేడు ప్రభావితం చేస్తున్న అనేక అంశాల్లో జాతి రత్నాలు ధరించడం ఒకటి. ఒక్కో రత్నం ఒక్కో అంశంపై ప్రభావితం చూపుతుందనేది ఓ నమ్మకం. ఆరోగ్యానికి ఒక రత్నం, ఆర్ధిక స్థితిగతులకు మరోటి ... ఇలా ఒక్కో ఒక్కో రత్నం ఒక్కో విధమైన ప్రభావితం చూపుతుందనే నమ్మకం ఉండబట్టే ఎవరి పరిధిలో వారు ఈ జాతి రత్నాలను ఉంగరాల రూపంలోనో, మాలల రూపంలోనో నేడు ధరిస్తుండడం సర్వసాధారణం అయిపోయింది. నవరత్నాలనూ ఒకే ఒక్క ఉంగరంలో కూర్చి ధరించే వారు కూడా నేడు అనేకమంది. ఇన్ని రత్నాలను ఒకసారి కొని, ధరించడం అనేది ఆర్ధికంగా ఎంతో భారమైన విషయం. అందుకే ఎంతకంటే విలువైన రత్నాలను పైసా ఖర్చు లేకుండా ధరించే అవకాశమున్నా మేలు జాతి రత్నాలంటూ వాటివైపే మొగ్గు చూపుతున్నాడు సగటు మానవుడు. పైసా ఖర్చు లేకుండా ధరించగలిగే రత్నాల గురించి సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లనే వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అసలు పబ్లిసిటీ అవసరం ఎంతమాత్రమూ లేని ఆ నవరత్నాలను పైసా ఖర్చులేకుండా అందించే ఒకే ఒక్క సూత్రమే "నవ్వు". ఎంత అనారోగ్యమున్నా, ఎన్నెన్ని బాధలున్నా నవ్వుతూ కొన్నిటిని మరచిపోవచ్చు. కొన్ని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఫేస్ ప్రేమ్

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు
కావలసిన వస్తువులు : ఖాళీ ఫోటోఫ్రేమ్‌లు లేదా కార్డ్‌బోర్డ్ అట్టముక్కలు
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 6 సం|| నుండి 8 సం||లలోపు
పోటీ సమయం : 1 నిముషం
ఆడే విధానం:
ముందుగా ఖళీ ఫోటోఫ్రేమ్‌ను సంపాదించాలి. లేకపోతే అట్టపెట్టెలను సేకరించి వాటిని నలుచదరంగా కట్‌చేసి ఫోటోఫ్రేమ్‌లా ఉపయోగించవచ్చు. [ఇంకా... ]

వంటలు - కరివేపాకు పొడి

కావలసిన వస్తువులు:

కరివేపాకు - 4 కట్టలు.
చింతపండు - 150 గ్రా.
జీలకర్ర - 15 గ్రా.
ధనియాలు - దోసెడు.
శనగపప్పు - 50 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
ఎండుమిర్చి - 200 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :

ఖాళీ మూకుట్లో పప్పుల్ని ఎర్రగా వేయించి తీసుకోవాలి, అలాగే జీలకర్రా, ధనియాలు కూడా వేయించి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఓ చెంచాడు నూనె మరిగించి ఎండుమిరపకాయలు కరివేపాకులు కలిపి వేయించాలి. [ఇంకా... ]

కథలు - తేలు కుట్టిన దొంగ

అదేపనిగా మోగుతున్న ఫోన్‌వైపు అదేపనిగా అలా చూశాడు వటపత్రశాయి. అలా మోగిమోగి ఆగిపోవటం... ఒక్కసారి అలుముకున్న నిశ్శబ్దం.
పెద్దశబ్దంతో గట్టిగా నిట్టుర్చాడు వటపత్రశాయి. ఆశబ్దాన్ని ఆలకించిన తటిల్లత " ఏమయ్యిందండీ?" అనడిగింది కంగారుగా.
భార్య తటిల్లతకు తటాలున జవాబు చెప్పేంతలో ఫోన్‌ మళ్ళీరింగయ్యింది.
ఆ ఫోన్‌కాల్‌ తప్పకుండా బంగార్రాజు నుంచే అయివుంటుందనుకున్నాడు.
రిసీవర్‌ తీసి "హలో" అన్నాడు.
బంగార్రాజు ఫెళ్ళున నవ్వాడు.
" ఏమిటింత ఆలస్యం? అవునూ... చెప్పడం మరిచాను. స్టేజిమీద అటువైపు ఎమ్మేల్యే కటకం కంటకమూర్తి, ఇటు వైపు చైర్మన్‌ కురాకుల సకల కళావతి. ఇహ మధ్యలో సకల కళానిధి ఈ బంగార్రాజు ఉండాలి... తెల్సిందా?"... అనడిగాడు.
" తప్పకుండా సార్‌... అంతా మీరు చెప్పినట్టే మరి నా సంగతి" గుటకలు మింగాడు వటపత్రశాయి. [ఇంకా... ]

జానపద గీతాలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి
పామల్లెపాకి కుందల్లె కూర్చుండి
నందల్లె నడిచి గుఱ్ఱమంత పరుగు [ఇంకా... ]

Wednesday, November 19

వ్యాయామ శిక్షణ - ఇల్లే జిమ్ లా...

సన్నగా మెరుపుతీగలా మెరవాలని జిమ్‌లో చేరారు మీరు. రోజూ ఉత్సాహంగా వెళుతున్నారు... ఉన్నట్టుండి ఒక రోజు 'అబ్బా బద్దకంగా ఉన్నది ఇవ్వాళ్ళొద్దులే రేపు చూద్దామంటూ డుమ్మా కొట్టారు. రెండో రోజు వెళ్ళలేక పోయారు. అటువంటప్పుడు నేనైతే ఇలా చేస్తానంటున్నారు ఓ పేరొందిన ఫిట్ నెస్ నిపుణురాలు.

1. జిమ్ కు వెళ్ళాలనిపించనప్పుడు ఇంట్లోనే నచ్చిన మెచ్చిన పనిని చేయాలి. ఒక గదిలో నచ్చిన సంగీతాన్ని పెట్టుకొని డాన్స్ చేయాలి. కనీసం ఒక అరగంటైనా ఇలా గడపాలి.

2. ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు లేకుండా ఉండటం నచ్చుతుందా! అయితే యోగా చేస్తే సరి.

3. ప్రతిరోజూ ఒకే రకమైన పనులు కాకుండా కొంచెం వైవిద్యం ఉండే వాటిని ఎంచుకోవాలి. [ఇంకా... ]

లాలి పాటలు - ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||

అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే|| [ఇంకా... ]

మీకు తెలుసా - వాడుక భాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష. సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కోక్కొండ వెంకటరత్నం (1852-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు. వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. వాడుక భాషను 'కులట' అని గేలి చేసే పండితులు దానిని దూరంగా విసర్జించక యేల వాడుక చేతురు? వారు యాంటీ నాచ్ కాదు కాబోలు? అంటూ ఒక చురక తగిలించి ఆ పండితులు చేసే తప్పులను ఆయన ఎత్తి చూపారు. 1917లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్త దారులు తొక్కారు. "మండలాల్లో మాటలు మారినాయని భాష చెడ్డ భాష అవుతుందా? కొత్త గ్రంధాలు చదువుకోని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అన్య మాండలిక గ్రంధాలు చదువుకోని ఆ పదాలు నేర్చుకోవాలి. ఆ మాటలు తెలియని ఆ భాష చెడ్డదనడం మంచిది కాదు. మారడం భాషకు సహజం" అన్నారు. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీ భావనారాయణాయ నమః
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః
7. ఓం వస్త్రనిర్మితాయ నమః
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః
9. ఓం విజ్ఞానఘనాయ నమః
10. ఓం వీరపరాక్రమాయ నమః [ఇంకా... ]

పిల్లల పాటలు - మా వూరి ఏరు

పేరొకటి వున్నదని నా కెరుకలేదు
నీరు కూడ నిరంతర ముండబోదు
పేరు, నీరును లేని ఏరైన నేమి!
మా యూరి కీయేరే గంగాభవాని!

చూడచక్కని ఏరు మావూరి ఏరు!
ఏడాది కొకసారి ముచ్చటగా పారు!
తెల్లవారక ముందె చలిచెలమచేరి
చల్లన్ని నీటితో తబిలె నాడించి [ఇంకా... ]

Tuesday, November 18

మీకు తెలుసా - పచ్చబొట్టు

అత్యంత పురాతనమైన కళ ఇది. ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఫేషన్. భారత దేశానికి కూడా ఈ ఫేషన్ విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి పాలతో పాయసం

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - 1.
బియ్యం - 1/4 కిలో.
బెల్లం - 1/4 కిలో.
జీడిపప్పు - 10 గ్రాములు.
నెయ్యి - 50 గ్రాములు.
యాలుకలు - 5.
కిస్‌మిస్ - 5 గ్రాములు.
పచ్చ కర్పూరం - కొంచెం.

తయారుచేసే విధానం:

కొబ్బరి తురుముకోవాలి. ఈ తురుమును మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా చేయాలి. దీనిని పలుచని బట్టలో వడకట్టాలి. మరల కొద్దిగా నీళ్ళు పోసి ఈ పిప్పి వేసి మరలా మిక్సీ పట్టాలి. మరలా వడకట్టాలి. ఈ పాలను కొద్దిసేపు కదల్చకుండా గిన్నెలో పోసి ఉంచాలి. పైన నీరు తేరుకుంటుంది. పై నీరు వంచి వేయాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - స్వామి వివేకానంద

పేరు : స్వామి వివేకానంద ( నరేంద్రనాథ్ దత్తా ).
తండ్రి పేరు : విశ్వనాథ్ దత్తా.
తల్లి పేరు : భువనేశ్వరి దేవి.
పుట్టిన తేది : 12-1-1863.
పుట్టిన ప్రదేశం : కలకత్తా.
చదివిన ప్రదేశం : కలకత్తాలో.
స్వర్గస్తుడైన తేది : 4-7-1902.

స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే 'జాతీయ యువజన దినోత్సవంగా' కూడా జరుపుకుంటారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా గురుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. గురువు పేరు మీదుగా 'రామకృష్ణ మఠం' స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు ఆనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు. [ఇంకా... ]

పెద్దల ఆటలు - ట్రాన్సులేషన్ ఆట (అనువదించటం)

ఈ ఆట నిర్వహించేవాళ్ళు ఒక పేపర్లో టీ పౌడర్ పేర్లను తెలుగులోకి అనువదించి వ్రాసుకోవాలి. వాటిని జిరాక్స్ తీసి అందరికీ ఇచ్చి వాటి పేర్లు వ్రాయమని చెప్పి వారికి సమయము ఒక్క నిముషం ఇవ్వాలి.

ఉదా: టీ పేర్లు

ఒక స్మారక చిహ్నం - తాజ్ మహల్ టీ
మూడు గులాబీలు - త్రీ రోజస్
బంగారుచక్రం - చక్రా గోల్డ్ [ఇంకా... ]

జానపద కళారూపాలు - యక్ష గానం

ప్రాచీనమైన దేశీ సారస్వత శాఖలో సంగీత రూపక ప్రధానమయిన యక్షగానాలను యక్షులు పాడే గీతాలు కనుక యక్ష గానాలు అనే పేరు వచ్చిందనీ, జక్కు జాతివారు వీటిని ఎంతో మక్కువతో ప్రదర్శిస్తారు కనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ పలు వ్యాఖ్యానాలున్నాయి. 16వ శతాబ్దంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

యక్షగానం అనగా దేశీయ చందోబద్ధమయిన నాటకము. దీనినే పాటగా కూడా పేర్కొనక పోలేదు. యక్షగానాల గురించి బ్రౌణ్య నిఘంటువులో పాటగా పేర్కొనబడింది. అయితే అప్పకవి దృష్టిలో యక్షగానం పాటలుగల ప్రబంధం అయివుండవచ్చునని తోస్తుంది. ఎందుచేతనంటే అప్పకవీయంలో యక్షగాన ప్రశస్తి ఉంది. అందులో అర్ధచంద్రికలూ, త్రిపుట, జంపె, ఆటతాళము, 'వీనయక్షగాన ప్రబంధంబులతుకవచ్చు ' అని పేర్కొన్నాడు. [ఇంకా... ]

Monday, November 10

లాలి పాటలు - చిట్టిపాప

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట [ఇంకా... ]

పెద్దల ఆటలు - మాచ్ అవుట్ ఆట

ఈ ఆటలో ముందుగా చిన్న చిన్న కాగితాల మీద జనరల్ గా ఆడవారు పెట్టుకొనే వస్తువుల పేర్లు వ్రాయాలి.

ఉదా: మట్టిగాజులు, స్టిక్కర్, తిలకం, కుంకుమ, నల్ల పూసలు, లిప్ స్టిక్, ముత్యాలదండ, పగడపు ఉంగరం, ముత్యపు ఉంగరం, మాటీలు, వెడల్పు గాజులు, సన్న గాజులు, లక్ష్మీదేవి ఉంగరము, చీరల రంగులు రాసుకోవచ్చు. ఇలాంటి కాగితం ముక్కలపైన రాసి మడత పెట్టి ఉంచాలి. ఆట ఏమిటంటే ఒక్కొక్కరి చేత ఆ పేపర్ స్లిప్ తీయించాలి. ఆ స్లిప్ లో రాసినది కనక వారు వేసుకొని వుంటే వారు అవుట్. అలా ఒక్కరు ‌మిగిలేంత వరకు తీయించి చివరగా మిగిలిన వారిని‌ విన్నర్స్ గా ప్రకటించటమే. [ఇంకా... ]

భక్తి సుధ - విష్ణు సహస్రనామం

పూర్వపీఠిక:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||

అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే|| [ఇంకా... ]

నీతి కథలు - పిసినారి పేరయ్య 

చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - చెరకుతో అందం

చెరకు గడనుండి తయారయ్యే గ్లైకోలిక్ యాసిడ్ తో ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమై కాంతివంతంగా తయారుకావచ్చు. అయితే యాసిడ్ అనగానే భయపడక్కరలేదని ఇది చాలా సహజమైనదని, హానికరమైనది కాదని వైద్యనిపుణులు అంటున్నారు.

ఇది ఎలా పని చేస్తుందంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. పిగ్మెంటేషన్ వల్లఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటన్నిటికీ ప్రత్యేకమైన బ్రెషింగ్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యూటీపార్లర్‌తో తీసుకోవాల్సిన చికిత్సలు. [ఇంకా... ]

Friday, November 7

వ్యక్తిత్వ వికాసం - విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మెళకువలు

విశ్వాసం విజయావకాశాలను మెరుగు పర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి, ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వడానికి కీలకమైన వనరు. ఇది ఆలోచనలనుంచి ఉధ్భవించినది కాబట్టి ఎవరికి వారు స్వయం కృషితో వృధ్ధి చేసుకోవచ్చు.విశ్వాసం తీగ లాంటిది. అది పాకడానికి స్థిరమైన పట్టుకొమ్మ కావాలి. విశ్వాసాన్ని వికసింపచేయడానికి బలమైన ధ్యేయం ఉండాలి. అందువల్ల ప్రతిఒక్కరికీ నిర్ధిష్టమైన జీవిత లక్ష్యం అవసరం. జీవిత లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా నిర్వచించుకోవాలి. లక్ష్యం అందుకోగలదిగా ఉండాలి.

ఒక లక్ష్యాన్ని సాధించిన తరువాత ఇంకొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఎప్పటికప్పుడు అందుకోగల లక్ష్యాన్ని నిర్ణయించుకుంటూ అంతిమ లక్ష్యం వైపు అంచెలవారీగా సాగిపోవాలి. స్వల్పకాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించిన కొలమానాలతో సమీక్షించుకోవాలి. అంచనాలు వేసేటప్పుడే కాలాన్ని కూడా అందులో అంతర్భాగం చేయాలి. అంచనాలకు, సాధించిన ప్రగతికి మధ్య ఉన్న తేడాను ఎప్పటికప్పుడు ఆచరణాత్మకంగా సరిచూసుకొని సవరించుకోవాలి. [ఇంకా... ]

పెద్దల ఆటలు - గుర్తించే ఆట

ఈ ఆటకు గిన్నెలలో రకరకాల పప్పులు, జీలకర్ర, రవ్వ, బియ్యం ఇలాంటి ఐటంస్ గిన్నెలలో పోసి టేబుల్ మీద పెట్టాలి. ఒక్కొక్కరికి ‌కళ్ళకి గంతలుకట్టి ఒక్కొక్కగిన్నెలోని వస్తువులను వారు తాకి ఆ వస్తువు పేరు చెప్పమనాలి. ఇదికూడా ఒక్కనిముషము సమయంలో చెప్పమనాలి. ఈ ఆటకి ఆడేవారు మాత్రమే అక్కడవుండాలి.

ఆడాల్సినవారు దూరంగా ఉండాలి. వారు గనక వాటిని చూస్తే సులభంగా గుర్తిస్తారు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి, పాలు పుడ్డింగ్

కావలసిన వస్తువులు:

కొబ్బరి కాయలు - 2.
బెల్లం - 200 గ్రా.
బియ్యం - 100 గ్రా.
పాలు - 1 లీ.
నెయ్యి - 1 కప్పు.
కిస్మిస్ - 2 స్పూన్లు.
జీడిపప్పు - 2 స్పూన్లు.
యాలుకలు - 1 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా కొబ్బరి తురిమి పల్చటి గుడ్డలో ఒడగట్టి పాలు తీయాలి. తరువాత నీళ్ళు కలిపి పల్చగా కొబ్బరి పాలు తీయాలి. రెండూ విడివిడిగా ఉంచుకోవాలి. [ఇంకా... ]

నీతి కథలు - తెలివి

పూర్వం ఒకప్పుడు ఒక నక్క గబ్బిలాన్ని పట్టుకుంది. దానిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు గబ్బిలం దీనాలాపంతో తనను చంపకుండా విడిచిపెడితే ఎంతైనా పుణ్యం ఉంటుందని వేడుకుంది. నక్క పట్టిన పట్టు వీడకుండా "పక్షులంటే నాకు ఎంతో ఇష్టం. నేను పక్షులను అస్సలు విడిచిపెట్టను" అంది. అప్పుడు గబ్బిలం "నక్క బావా! నేను పక్షిని కాదు. కావాలంటే నా వంటి మీద ఒక్క ఈక కూడా లేదు చూదు" అని తన శరీరం చూపించింది. నిజమేననుకుని నక్క గబ్బిలాన్ని వదిలివేసింది. గబ్బిలం బ్రతుకు జీవుడా అని చెట్టుపైకి వెళ్ళి చెట్టు కొమ్మను పట్టుకుని వ్రేలాడుతూంది. [ఇంకా... ]

జానపద కళారూపాలు - వీధి నాటకాలు

ఇప్పుడంటే రంగ స్థలం హాలు, కర్టెన్లు - ఇలా ఎన్నో విధాల అభివృద్ది చెందిందిగాని, ఒకనాడు వినోద ప్రదర్శనలు అన్నీ వీథిల్లోనే జరిగేవి. ఒకనాడు వీధులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. పాఠశాలలన్నీ వీధుల్లోనే ఉండవి. అందుకే వాటిని వీధి బడులు అనే వారు. నడి వీధిలోనే దేవదాసి నృత్యాలు, మేజువాణీలు జరిగేవి. పురాణ గాధలను కూడా పండితులు వీధులలోనే చెప్పేవారు. వీధికి అంతటి ప్రాముఖ్యత ఉండేదానాడు. అలాగే నాటకాలు కూడా. నాటకాలను వీధుల్లో ఆడేవారు గనుక వాటిని వీధి నాటకాలు అనేవారు. వాటిని ప్రదర్శించేవారిని భాగవతులు అనేవారు. అసలు ఒకనాడు గ్రామ పంచాయితీల పాలనా వ్యవహారాలన్నీ వీథుల్లోనే ఏ వేప చెట్టుక్రిందో, ఏ రావి చెట్టు క్రిందో జరిగేవి. ప్రధానంగా రామాయణం, భారతం, భాగవత, గాథలూ, బసవపురాణ కథలూ వీథి నాటకాలుగా ప్రదర్శిస్తూండడం పరిపాటి. వీటిని దేశి నాటక ప్రదర్శనలు అంటే సరిపోతుందనుకుంటాను. ఈ దేశి నాటకాల పురోగతి శివకవుల ఆద్వర్యంలోనే జరిగింది. [ఇంకా... ]

Wednesday, November 5

మీకు తెలుసా - జిగురు కధ

చ్యూయింగ్ గం నమిలేవారిని ఎవరిని అడిగినా అది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. చ్యూయింగ్ గంకి శతాబ్దాల చరిత్ర ఉందంటె మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ప్రాచీన గ్రీకులు, మెక్సికోకు చెందిన మాయెన్స్, చెట్లనుంచి తీసిన రకరకాల జిగటపదార్ధాలను గంలాగా నమిలేవారు.

అయితే ప్రపంచంలో వ్యాపారరిత్యా 'స్టేట్ ఆఫ్ మైన్ ప్యూర్ స్ప్రూస్ గమ్ము ' అనే గమ్మును 1848 లో జాన్ బి. కర్టీస్ తయారు చేశాడు. ధామస్ ఆడంస్ చాక్లేటును కనుగొన్నాడు. ఒకనాడు వాళ్ళ ఇంటికి జనరల్ ఆంటోనియా డీ అన్నా అతిధిగా వచ్చాడు. చికిల్ను ఉపయోగించి చౌక సింధెటిక్ రబ్బరును తయారు చేయమని సలహా ఇచ్చాడు. ఆయన ఫాక్టరీ స్థాపించి ప్రయోగాలు స్తాపించాడు. ఆయన ఒక షాపు వద్ద ఉండగా ఒక చిన్నమ్మాయి వచ్చి, . చ్యూయింగ్ గమ్‌ కొనడం చూశాడు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి ఖర్జూరం

కావలసిన వస్తువులు:

ఖర్జూరం పళ్లు - 12.
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
బాదంపప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
పిస్తా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
యాలకుల పొడి - పావు టీ స్పూన్.
పాలపొడి - రెండు టేబుల్ స్పూన్లు.
రోజ్ ఎసెన్స్ - కొన్ని చుక్కలు.
కొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు.

తయారు చేసే విధానం:

ఖర్జూరాలను మధ్యలో కొద్దిగా చీల్చి గింజలు తీసేయండి.అన్ని పప్పుల్ని, పాలపొడి, యాలకుల పొడి, రోజ్ ఎసెన్స్‌ని ఒక బౌల్లో కలుపుకుని ఖర్జూరాల్లో కొంచెం కొంచెం కూరి పెట్టండి. [ఇంకా... ]

పెద్దల ఆటలు - మూడు భాషల ఆట

ఈ ఆటలో పాల్గొనేవారందరినీ రౌండ్ గా కూర్చోమని చెప్పాలి.

ఆట ఏమిటంటే ఎవరో ఒక మెంబరు దగ్గర నుంచి మొదలు పెట్టి వారిని ఒకటి, తరువాత వారిని టు, మూడో వారిని తీన్ అని చెప్పుతూ 20 నెంబర్స్ చెప్పించి మళ్ళీ మొదటినుంచి నెంబర్స్ మొదలుపెట్టి కంటిన్యూ చేయమనాలి. ఈ విధంగా అందరి చేతా చెప్పించేటప్పుదు గనక ఎవరైనా అంకె తప్పు చెప్పినా, భాష తప్పు చెప్పినా వారు ఓడిపోయినట్లే అలా కంటిన్యూ చేసి చివరగా మిగిలిన వారిని గెలిచినట్లుగా ప్రకటించాలి. [ఇంకా... ]

నీతి కథలు - ఎవరు గొప్ప?

ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః [ఇంకా... ]

Tuesday, November 4

చిట్కాలు - పిల్లలకు సంబంధిచినవి

పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల విషయంలోనూ అంతే అప్రమత్తతతో వ్యవహరించాలి. అందుకే పిల్లల అహార వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.

1. పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్ బ్రేకబుల్ అయ్యుండాలి. ప్లాస్టిక్ వస్తువులైతే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి.

2. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. అలాగే ఇందులో ఆహారపదార్ధాలను వేడి చేసేటప్పుడు వాడే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

3. పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్లనిచ్చి తినమనాలి. ప్లాస్టిక్ ఫోర్కులు కూడా ఇవ్వొచ్చు.

4. గిన్నెలు, కప్పుల అడుగుబాగం వెడల్పుగా ఉంటే అందులోని పదార్ధాలు తొందరగా నేలపై చిందవు. [ఇంకా... ]

మీకు తెలుసా - చిన్నతరహా పరిశ్రమలు

చిన్నతరహా పరిశ్రమల నిర్వచనం మారిన తరువాత కొన్నిసూచనలు జారీ అయినవి - అవి:

నిర్వచనం మారకముందే చిన్న పరిశ్రమలు గానీ వాటికి నిర్దేశించిన పెట్టుబడి పరిమితులను దాటి ఉంటే, అలాంటి పరిశ్రమలను సవరించిన నిర్వచనం ప్రకారం సవరించిన పెట్టుబడి పరిమితుల్లో ఉంటే వాటిని చిన్న పరిశ్రమలుగా, అనుబంధ పరిశ్రమలుగా గుర్తిస్తారు.

నోటిఫికేషన్ తేదికి ముందుగానే అప్పటి పెట్టుబడి పరిధి అధిగమించి, క్యార్ ఆర్ బిజినెస్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా ప్రస్తుతం హెచ్చించిన పెట్టుబడి పరిమితి లోపల ఉంటే ఆ లైసెన్సు అవసరం లేదు. వారి సి.ఒ.బి. దరఖాస్తులపై ఎటువంటి చర్య తీసుకోరు. వారిని చిన్నతరహా అనుబంధ పరిశ్రమలుగానే పరిగణిస్తారు. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిలకమ్మ పెండ్లి

చిలకమ్మ పెండ్లి - చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ
కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ

కొక్కొరోకోయని - కోడి కూయగా
ఘుమ్మని తుమ్మెద - తంబుర మీటగ
కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తెమ్మరలు - వేణువూదగా
నెమలి సొగసుగా - నాట్యం చేయగా [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మొరార్జీ దేశాయ్

పేరు : మొరార్జీ దేశాయ్
తండ్రి పేరు : రంచోడ్డి దేశాయ్
పుట్టిన తేది : 29-2-1896
పుట్టిన ప్రదేశం : గుజరాత్
చదివిన ప్రదేశం : గుజరాత్
చదువు : బి.ఏ.
గొప్పదనం : పేదవారి విషయంలో అత్యంత శ్రద్ద చూపి వారి అభివృద్దికి ఎంతో పాటుపడ్డారు
స్వర్గస్థుడైన తేది : 7-5-1924

రంచోడ్డి మురార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్ లో జన్మించాడు. తండ్రి రంచోడ్డి దేశాయ్ బడిపంతులు. ఆయన ఏడుగురి సంతానంలో మురార్జీ మొదటివాడు. బతకలేక బడిపంతులు అన్నట్లు ఆ రోజుల్లో మురార్జీ తండ్రి సంపాదన ఇంటికి ఏ మాత్రం సరిపోయేది కాదు. ఆయన చిన్నతనంలో కడుపునిండా భోజనం తిన్న రోజులు వేళ్ళమీద లెక్క పెట్టవచ్చునని మురార్జీ ఒక పత్రికా సమావేశంలో అన్నారు. మురార్జీ తెలివైన విద్యార్థి కావటం వలన భావనగర్ మహారాజు నెలకు పది రూపాయలు స్కాలర్ షిప్పు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ పదిరూపాయలతో తల్లి, ఏడుగురు పిల్లలు ఎంతో గుంభనంగా సంసారం సాగించేవారు. మురార్జీ ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పెరిగాడు. [ఇంకా... ]

కవితలు - దూరతీరాలు

కన్నదేశం వదలి, ఉన్న దేశానికి వస్తే
ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే!

కారు వున్నా, కాసు వున్నా,
ఊరు గాని ఊరులోన సుఖం సున్న!

కారు ఏసి, ఇల్లు ఏసి,
వళ్ళు మాత్రం వేడివేడి

ఊరు గొప్పది, పేరు గొప్పది,
ఉనికి మాత్రం ఉత్తది!

సంవత్సరాలుగా సహచరులే
సంబంధాలు మాత్రం అరకొరలే!

ముఖం చూడ సుపరిచతమే
మనిషి మాత్రం అపరిచితుడే! [ఇంకా... ]

Monday, November 3

సంగీతం - మన సంగీతం

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం.

మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు నారద తుంబురులు, హనుమంతుడు గొప్ప నాదోపాసకులుగా కీర్తి పొందారు. రాజస్థాన్ ఎడారి మరు భూమిలో మిరాబాయి కృష్ణ భక్తి గాగాన ప్రవాహాన్ని ప్రవహింప చేశారు.ఆమె గానాన్ని అక్బర్ చక్రవర్తి సైతం మారువేషంలో వచ్చి వినేవాడని చెబుతూ ఉంటారు. నాదబ్రహ్మను ఉపాసించి ఇహపరాలను సాధించిన మహానీయులు ఎంతో మంది ఉన్నారు. సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువుగా ఇవ్వగల్గుతాయని, పంటలు ఎక్కువుగా పండుతాయని ఆధునిక పరిశోధకుల భావన. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - అద్వైత త్రయం

దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు. జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు. రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు. పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - అవ్వా - అప్పచ్చా

ఎంతమంది ఆడాలి : ముగ్గురు ఆడాలి.

ముగ్గురు పంటలెయ్యాలి. ముందుగా ఎవరు పండితే వారు అతన్ని ఏనుగు మీద ఎక్కించాలి. మరి ఏనుగేది. మిగతా ఇద్దరూ ఏనుగుగా మారతారన్నమాట. ఎలాగంటే - ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని తమ కుడి అరచేతులను పైకి లేపి నిచ్చెన కట్టాలి. ఎదురు బాలుడు కూడా అలాగే కట్టాక ఇద్దరు చేతులు కలుపుతారు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏనుగు అన్నమాట. పండిన బాలుడు చేతుల మధ్య కూర్చుండ బెట్టుకొని పైకి లేపి, వూరేగించాలి. అప్పుడు ఇలా పాడాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - సీతా కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే ||సీ||

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ||సీ||

భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ||సీ| [ఇంకా... ]

వ్రతములు - కైలాస గౌరి వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాజునకొక్కతే కుమార్తె గలదు. అతడామెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగని యేరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త యెల్లప్పుడు వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచేత ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి, పార్వతీదేవిని ప్ర్రతిదినము పూజించుచు, తన పతిని తనతో కలుపమని ప్రార్ధించుచుండెడిది. అట్లు కొంతకాలము జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి, కైలాసగౌరి నోము నోచినచో భర్తతో యెడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తర్వాత నామె ముందురోజు రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి, ఆ నోమును నోచుకొనెను. [ఇంకా... ]

Friday, October 31

పిల్లల పాటలు - అమ్మకొక ముద్ద

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి
అమ్మకొక ముద్ద

చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద [ఇంకా... ]

వంటలు - అటుకుల పోణీ

కావలసిన వస్తువులు:

గోభీ పువ్వు (చిన్నది) - 1
ఆలు - 2
లావు అటుకులు - 250 గ్రా
పచ్చి మిర్చి (తరిగినవి) - 6
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 2 రెమ్మలు
ఆవాలు - 5గ్రా
జీలకర్ర - 5 గ్రా
ఎండుమిర్చి - 3
పసుపు - అర టీ స్పూను
ఉప్పు, రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత
పచ్చి కొబ్బరి తురుము - కొద్దిగా

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి పప్పు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వరసగా కాక గోభీ, ఆలు ముక్కలు వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. [ఇంకా... ]